సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశవుడు నన్ను గంగానది మీదుగా నావలో దీసికొని వెడలుదుననియు, కుక్ అను క్రైస్తవ ప్రచారకుడును, దేశ సంచారియునగు నైరోపా దేశస్థుడు మాతో గూడ వచ్చుననియు నాకు వర్తమాన మంపెను. అది విని నేను సరుగుడు చెట్టుకడకు పదే పదే వెడలనారంభించితిని.
(అనగా భయముచే మలమూత్ర విసర్జనముచేసెనని భావము). అనంతరము వారు వచ్చిరి, నేను స్టీమరు ఎక్కితిని. వెంటనే నాలో నొకమార్పు కలిగెను. అపుడెన్ని విషయములను గూర్చి ప్రసంగించితినో! (్భక్త బృందమును జూపుచు) వీరందఱును నేను అద్భుతమైన బోధలు చేసినానని చెప్పినారు. కాని నాకావిషయమే తెలియదు.’’
1014. నాయందలి పరమాత్ముడే నాచే ఈ కార్యములనన్నిటిని జేయించుచున్నాడు. ఒక్కొక్కప్పుడు భగవద్భావమును బొందువాడను- అర్చింపబడనిదే అపుడు నాకు శాంతి కలుగకుండెడిది. నేను వాని చేతిలోని ఉపకరణమును, నన్ను ఆతడు వినియోగించుకొనుచు. నన్ను ఆతడు ఎట్లు చేయించునో అటుల చేయుదును, ఎటుల పలికించునో అట్లు పలుకుదును.
1015. గురుదేవునకు ముక్త్యారునామా (పవర్ ఆఫ్ అటార్నీ) ఇచ్చిన (అనగా సంపూర్ణాత్మార్పణము చేసిన) పిమ్మట గూడ గిరీశ చంద్రఘోషు పూర్వ జీవితమువలన దనకు సంప్రాప్తమైన పాప ప్రవృత్తులను దలపోసి దుఃఖాక్రాంతుడై కలవరపడనారంభించెను. అది గని శ్రీగురుదేవుడిట్లు పలికెను:
‘‘ఓరుూ, మతిహీనుడా! నిన్ను బట్టు కొనినది బురదపామనుకొనుచుటివా? కాదది విష సర్పము. పరుగెత్తి నీవింటికి బోయినను మరణింపవలసినదే. నీ కామాత్రము తెలియదా? బురద పాము కప్పను బట్టుకొనిన, అది యెన్నియో సారులు బెకబెక లాడిననే కాని ప్రాణము విడువదు. ఒక్కొక్కప్పుడది తప్పించుకొనును గూడను. కాని యదియే (దానిని బట్టుకొనినది) విష సర్పమైనచో, ఒకటి రెండు బెకబెకలతో దాని పని సరి. ఒకవేళ తప్పించుకొనినను కొంచెము దూరము పరుగెత్తి తన గుంటలో బడి వచ్చును. ఇచటికి వచ్చిన వారి విషయము కూడ నిట్టిదే.’’ (అనగా వారెటులైనను పాప వినిర్ముక్తులగుదురని భావము.
1016. ఒకనాడు శిష్యుడు తన పాదము లొత్తుచుండ శ్రీగురుదేవుడు ఆ పరిచర్యనుద్దేశించి యిట్లు పలికెను: ‘‘దీనికి విశేషమైన ప్రాముఖ్యమున్నది.’’ అంతట హృదయముపై జేయువైచుకొని మఱల నిట్లు పలికెను: ‘‘దీనియందు (నాయందు) ఏదైన (దివ్యత్వము) ఉన్న పక్షమున, దీనిచే (ఈ శుశ్రూషచే) అవిద్య (అజ్ఞానము) పూర్తిగా నశింపవలసినదే.’’ అపుడు శిష్యుని గంభీరముగా అవలోకించుచు నిట్లు వచించెను: ‘‘ఇక్కడ నెవ్వరును పైవారు లేరు. ఆనాడు నాకొక దృశ్యము గోచరించినది. అపుడు హరీశుడు నాయొద్దనుండెను.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
ఇంకాఉంది