మెయిన్ ఫీచర్

ఎదుగుదల అంటే...? అసూయ వల్ల అనవసర రోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది. మిగులూ లేదు, తగులూ లేదు.. నాలుగు రాళ్ళు వెనకేసుకుందామన్న ధ్యాసే లేదు..’’ జయంతి అలా గంటసేపట్నుంచి నసుగుతోంది.
ఆదివారం ఉదయం హాయిగా పేపర్లు తిరగేస్తూ కూర్చున్న రాజారావుకి ఆమె మాటలు వింటుంటే మండుకొచ్చింది. అయితే నోరు విప్పితే ఆమె ఇంకా రెచ్చిపోతుందని తెలుసు. అందుకే వౌనంగా వుండిపోయాడు.తమకు మాత్రం ఏం తక్కువైంది, లోన్ తీసుకుని ఫ్లాట్ కొన్నాడు. పిల్లలిద్దరూ మంచి స్కూల్సులో చదువుతున్నారు. ఆస్తులు సంపాదించకున్నా అప్పుల్లేవు. అందుకే భార్యతో వాదించి లాభం లేదని ఆమె మాటలు వినీ విననట్టు ఉండేవాడు.
జయంతి లాంటివాళ్ళను మన చుట్టూరా ఎంతోమందిని చూస్తుంటాం. ఆడవాళ్ళలోనే కాదు, మగవారిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈ ఆరాటాలు ఎక్కువగా ఉంటా యి. ఇదంతా ఇతరులతో పోల్చుకోవడంవల్ల వచ్చే దుస్థితి. తమ దగ్గరి బంధువులు, స్నేహితులు, కొలీగ్స్‌తో పోల్చుకుని తాము వారిలా ఆర్థికంగా ఎగదలేదని, బాగుపడలేదని వాపోతుంటారు. ఇలా పోల్చుకుంటూ పోతే, ఎంతటి మిలియనీర్స్ అయినా బాధపడాల్సిందే. ఎంత పెద్ద బిజినెస్ మాగ్నెట్స్ అయినా వాళ్ళకు మించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళతో పోల్చుకుని బాధపడటం అవివేకం. బాగుపడటం గురించి బాధపడటంకన్నా అసలు తమకేం కావాలో తేల్చుకోవాలి. ఎదగడంలేదని ఇంట్లో నస పెట్టుకోవడంకన్నా, తాము ఏం కోరుకుంటున్నారో
స్పష్టంగా తెలిసుండాలి. వాళ్ళనీ, వీళ్ళనీ చూసి అసూయ పడటం వలన అనవసర రోగాలు వస్తాయి. ఆరోగ్యం పాడవటం తప్ప ప్రయోజనమే మీ ఉండదు. అ లాంటివా రు ఇ లాంటి కొన్ని వి షయాలు గుర్తుంచుకోవాలి.
తమకు ఏం కావాలో
నిర్ణయించు కోవాలి. ఆ నిర్ణయానికి అ నుగుణంగా వ్యవ హరించాలి.
బాగుపడటం, ఎదగడం అంటే ఏమిటో తమకు తాము ముందుగా నిర్ణయించుకోవాలి. ఎంత సంపాదిస్తే బాగుపడినట్టుగా ఉంటామనే అభిప్రాయం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి.
ఎదగటానికి అంతులేదు. కాబట్టి ఆర్థికంగా తమకు ఏం కావాలో నిర్ణయించుకోవాలి. అందుకు కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి.
ఆశలు పెంచుకునేముందు తాము చేస్తున్న వృత్తి, ఆదాయం గురించి ఆలోచించుకోవాలి. సంవత్సరానికి తమకెంత ఆదాయం వస్తుందో చూసుకోవా లి. అంతకుమించి కావాలంటే ఉన్న అవకాశాలేమిటో గుర్తించాలి.
బంధువులకి, మిత్రులకి చేసే సహాయం గురించి ఏడవకూడదు. దానికి బదులు అదనపు సంపాదన కోసం ఎలా శ్రమించాలో ఆలోచించటం మంచిది.
బంధు, మిత్రుల ఎదుగుదల్ని చూసి ఓర్చలేకపోవడం అనారోగ్య లక్షణం. అం దరి పనులు, సంపాదనలు ఒకే తీరుగా వుండవు. కొన్నిరకాల పనులు చేసేవాళ్ళకు అదనపు ఆదాయం వస్తుంది. వాళ్ళ మాదిరిగా తమకు రావడం లేదని బాధపడకూడదు. తమ పరిధిలో తాము తృప్తిగా జీవిస్తున్నామో లేదో తేల్చుకోవాలి. తమకు ఏం కావాలో వాటిని పొందుతున్నామో లేదో చూసుకోవాలి. అంతేగాని అసూయ ద్వేషాలతో కునారిల్లడం వల్ల కుటుంబంలో ప్రశాంతత దెబ్బతింటుంది. సానుకూలంగా స్పందిస్తూ తమకు అవసరమైన సౌకర్యాలు పొందగలగాలి. ఈ రీతిగా వ్యవహరిస్తే జీవితం హాయిగా ఉంటుంది.

- పి.ఎం.సుందరరావు