సబ్ ఫీచర్

శ్రీసూక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లక్షయతీతి లక్ష్మీః’ అని లక్ష్మీశబ్దానికి వ్యుత్పత్యర్థం. లక్షింపచేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూలతత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. ఐహికమైన కోరికలు ఉంటే వరలక్ష్మి వరమైన కాంక్షతో ముముక్షువులై సేవిస్తే ఈ వరలక్ష్మి దేవియే మోక్ష లక్ష్మిగా ఆశీస్సులందిస్తుంది. అందుకే సిద్ధి లక్ష్మి నుండి మోక్షలక్ష్మి వరకు-
‘సిద్ధిలక్ష్మీర్మోక్ష లక్ష్మీ ర్జయలక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీర్వలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా’ అని ప్రార్థింపబడుతోంది- వరలక్ష్మీదేవి.
‘‘చంద్రాం హిరణ్మరుూం’’ చంద్రుడిలా స్వచ్ఛమైనది, సౌమ్యమయినది, ఎటువంటి నామ రూప వాసనా మాలిన్యము లేనిది తల్లి. ఆ తల్లి నా మనసులో ప్రవేశపెట్టి మహాలక్ష్మీదేవిని ఉపాసించేటట్లుచేయమని ప్రార్థిస్తున్నాం మనం. ఎవరిని? అగ్నిదేవుణ్ణి.
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్
శ్రీయం దేవీ ముపహ్యయే శ్రీర్మాదేవీర్బుషతామ్-
అన్నది శ్రీసూక్తం. గుఱ్ఱాలు ముందుంటే, రథాలు మధ్యలో ఉంటే, ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తూ ఉంటే.. ‘ఆశు గచ్ఛతీతి అశ్వః’ వేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవి ఇంద్రియాలే. రథమంటే మన శరీరం. ‘శరీరం రథమేవాతు’ ఇంద్రియాలనే గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుంది. అందుకే వాటి వెనకాలే మధ్యలో ఉంటుంది శరీరం. ‘హస్తినాద ప్రబోధినీం’- ఆ శరీరం కన్నా వెనకాల ఉంది హస్తి అనగా ఏనుగు. ఏమిటది? మన అహంకారం. శరీరాన్ని మమకారంతో చూస్తోంది. దాని కంటె ముందున్న ఇంద్రియాలనే అశ్వాలు, దాన్ని ఈడ్చుకుపోయి విషయానుభవమిస్తున్నాయి, జీవుడికి. ఇది జీవుడికున్న సంసార బంధం.
అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే, నాదా ప్రబోధినీం- దాన్ని ప్రజ్వలింపజేస్తుంది, మాయాశక్తి. అదే హరిణి- మనలను సంసారాభిముఖంగా హరిస్తుంది. అలా కాకుండా సాయుజ్యం వైపు తీసికెళ్లాలి. దీనికి ‘శ్రీ’ కావాలి. ఆ శ్రీదేవినే ‘ఉపహ్వయే’ మనలోకి ఆవాహనం చేసికోవాలి. శరీరమనే రథమధ్యస్థయగు లక్ష్మియే చైతన్యలక్ష్మి. చెవులు మూసికొంటే వినపడు నాదమే హస్తినాదం. అదే వేణునాదం- వీణానాదం- వేదనాదం- శంఖ ధ్వని ఆ నాదము చేత నిరంతరం బోధింపబడుతున్న చైతన్యలక్ష్మిని ఆరాధిస్తే, పరమాత్మను చేరుకొనే సన్నిధి చూపిస్తుంది. ఈ ఆరాధనలో మానవులు తమ ఇంద్రియాలను తాను చెప్పినట్లు నడుచుకొనేటట్లు చేసికొని, మనస్సుని అదుపులో ఉంచుకొని, తమ శరీర రూప రథముల్ని భగవంతుని వైపు త్రిప్పుకొని సన్మార్గంవైపు మరలి పవిత్రులవ్వాలని చెప్తుంది వరలక్ష్మీదేవిగా పూజలందుకొంటున్న శ్రీమహాలక్ష్మి.
పుణ్యాత్ములైన దేవీభక్తులకు, క్రోధంగాని, మత్సరంగాని, లోభంగాని, మలినమైన మనస్సుగాని ఏ అవగుణాలూ ఏర్పడవు. భక్తి ఒక్కటే వాటన్నిటినీ దూరంగా పారద్రోలగలదు. నిత్యమూ ముఖ్యంగా శ్రావణ శుక్రవారములలో లక్ష్మీసోత్త్రంతో జగన్మాతను ఆరాధిచటం శ్రేయోదాయకం, సౌభాగ్యప్రదం అని చెప్తుంది శ్రీసూక్తం.