సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐనను, ఈమె హృదయము పవిత్రమైనది కావున పుణ్యలోకమునకు బోవుచున్నది. నీ హృదయము సదా యామె పాపకార్యములనే మననము చేయుచుండెనుగాకన సపవిత్రమైనది. అందుచే నీ సపవిత్రులుండు లోకమునకే పోవుచున్నావు. నిజముగా వ్యభిచరించినది నీవుకాని యామె కాదు.’’
మిట్ట వేదాంతమువలన గలుగు ప్రమాదములు
మిట్ట వేదాంతియగు రాజు
1074. ఈ విశ్వమంతయు బ్రహ్మమేయని ప్రకటించునద్వైత సిద్ధాంతము నొక రాజునకు వాని గురువు బోధించెను. ఈ సిద్ధాంతము రాజునకు జాలనచ్చినది. అంతఃపురములోనికి బోయి యాతడు తన రాణితో నిట్లనెను: ‘‘రాణికిని రాణి దాసికిని భేదములేదు. కాబట్టి దాసియే యింతటి నుండి నారాయణియగును.’’ తన భర్తయొక్క రుూ పిచ్చి ప్రసంగమును విని రాణి నిశే్చష్టురాలయ్యెను. ఆమె యా గురుని బిలిపించి, ‘‘అయ్యా! మీ బోధలయొక్క దుష్ఫలమెట్లున్నదో చూడుడు’’ అని మొఱలిడుచు జరిగిన వృత్తాంతమునంతయు దెలిపెను. ఆ గురువు రాణి నోదార్చుచు నిట్లుపలికెను: ‘‘నేడు రాజునకు నీవు భోజనమిడు సమయమున నన్నముతోబాటు పేడనుగూడ పళ్లెరమున వడ్డింపజేయుము.’’ భోజన సమయమున గురువును రాజును కలిసి భోజనమునకు గూర్చుండిరి. అన్నముతోబాటు వడ్డింపబడిన యావుపేడను జూచుసరికి రాజునకు గలిగిన యాగ్రహమెట్టిదో యూహింపనగును. దీనిని గనిపెట్టిన గురువు మందహాసముచేయుచు మెల్లగానిట్లు ప్రశ్నించెను: ‘‘దేవరవార ద్వైతజ్ఞానము గలవారు గదా. అన్నమునకును, ఆవు పేడకును భేదము నేల పాటింతురు?’’ రాజంతట పట్టరాని కోపముతో నిట్లఱచెను: ‘‘మహాద్వైతినని చెప్పుకొను మీరే, చేతనైనచో, ఈ పేడ తినుడు.’’ గురువంతట ‘‘మంచిది!’’ అని వెంటనే తానొక సూకరముగ మాఱిలొట్టలు వేయుచు, ఆ పేడను, భక్షించి మఱల మానవ రూపమును ధరించెను. రాజంతట సిగ్గుదెచ్చుకొని మఱల నెన్నడును రాణితో నట్టి పిచ్చి ప్రసంగము చేయలేదు.
మిట్టవేదాంతి యగు బ్రాహ్మణుడు
1075. ఒక బ్రాహ్మణుడు తోటను వేయించి రేయింబవళ్లు దానిని జాగ్రత్తగా గనిపట్టి చూచుచుండెను. ఒకనాడొకయావు తోటలోబడి యాతడత్యంత ప్రీతితో సంరక్షించుచున్న యొక మామిడి మొక్కను మేసి వేసినది. తనకు మిక్కిలి ప్రియమైన యామొక్క నావు ధ్వంసము చేయుచుండుట చూడగనే బ్రాహ్మణుడు కాలరుద్రుడై బడితె తీసికొని యావును మోదగా నది చనిపోయినది. బ్రాహ్మణుడు గోహత్య చేసినాడను వార్త యెల్లెడలను వ్యాపించినది. ఈ బ్రాహ్మణుడు తాను వేదాంతినని ప్రకటించుకొను చుండెడివాడు. గోహత్య పాతకము నెవ్వరైనను దనపై బెట్టగనే తాను నిర్దోషియని ఋజువుచేయుటకుగా నతడిట్లు పలుకసాగెను: ‘‘లేదు, నేను గోహత్య చేయలేదు; ఆ పనిచేసినది నా చేయి.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి