సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత కాలమున కదృష్టవశమున యోగి తిరిగి యా మార్గముననే వచ్చి గాయములచే కృశించియున్న పాము దుర్దశనుగాంచెను; చాల జాలిచెంది హేతువేమని యడిచెను. అందులకా పామిట్లు సమాధానించెను: ‘‘స్వామీ! మీరు బోధించిన నాటినుండియు నేనెవ్వరిని హింసించుట లేదు. అదియే నా రుూ దుర్దశకు కారణము. అయ్యో! నాయెడ వారెంతయో నిర్దయులై- క్రూరులై- వర్తించుచున్నారు. ఏమని చెప్పుదును నా దురవస్థ!’’ యోగి చిఱునవ్వు నవ్వి యిట్లు పలికెను: ‘‘మిత్రమా! నిన్ను నే నెవ్వరిని గఱవవద్దంటిని గాని బుసకొట్టి భయపెట్టవలదంటినా? నీ వేజంతువును గఱవరాదు కాని బుసకొట్టి ఎవరిని నీదరికి రాకుండ జేయవచ్చునే?’’
ఇటులనే మీరు సంసారులై యుండునెడల లోకులు మీయెడ భయభక్తులు కలిగి మెలగునట్లు వర్తింపవలయును. ఎవరిని హింసింపకుడు, మఱి యెవరి చేతను హింస పొందకుడు.
బ్రహ్మచారి: యేనుగు
1077. ‘‘సర్వము బ్రహ్మమే’’యని గురువు శిష్యునకు బోధించెను. శిష్యుడు దానిని మక్కికి మక్కిగా నర్థముచేసికొనెనే గాని దాని యంతరార్థమును గ్రహింపడయ్యెను. ఒకనాడాతడు రాజవీధిని బోవుచుండగా ఏనుగెదురయ్యెను. పైనున్న మావటివాడు: ‘‘తొలగుడు, తొలగిపొండు’’అని యఱచుచుండెను. బ్రహ్మచారి, (శిష్యుడు) ‘‘నే నేల తొలగిపోవలెను? నేను బ్రహ్మమను, ఏనుగును బ్రహ్మమే. బ్రహ్మమునకు దనవలననే యేమి యపాయము!’’అని తనలోదాను వితర్కించుకొనుచు గదలడయ్యెను. తుదకేనుగు వానిని దొండముతో బట్టుకొని ప్రక్కకు విసరివేసెను. బ్రహ్మచారికి బలమైన గాయములైనవి. కొంత వడికెట్లో గురువుగారి యొద్దకుబోయి జరిగిన వృత్తాంతము నంతను విశదీకరించెను. గురువిట్లు మందలించెను: ‘‘మంచిది; నీవును బ్రహ్మమే, ఏనుగును బ్రహ్మమే; కాని ‘మావటి బ్రహ్మము’ ‘తొలగిపొమ్ము’అని పైనుండి నిన్ను హెచ్చరించెనుగదా. ఆ బ్రహ్మము మాట నీవేల చెవిని బెట్టవైతివి?’’
స్వమత దురభిమానము
ఘంటాకర్ణుడు
1078. ఘంటాకర్ణునివలె స్వమత దురభిమానివి కాకుము. శివునారాధించుచు, నితరమైన వేలుపుల నందఱను ద్వేషించునొకడుండెడివాడు. శివుడొకనాడు వానికి ప్రత్యక్షమై, ‘‘నీ వితర దైవతములను ద్వేషించునంతకాలము నేను నీయెడ ప్రీతుడనుగాను’’అని చెప్పెను. కాని యాతడు వినడయ్యెను. కొన్ని దినములైన పిమ్మట శివుడు మఱల వానికి ప్రత్యక్షమయ్యెను. కాని రుూసారి సగబాలు శివుడుగను సగబాలు విష్ణువుగను గాన్పించు హరిహర రూపమున సాక్షాత్కరించెను.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి