సబ్ ఫీచర్

టీనేజ్ అంటే ఒక తరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజ్ అంటే...
ఒక ఆవేశం...
ఒక తొందరపాటు...
ఒక ఆకర్షణ..
ఒక తరంగం..
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది. దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిది ఒక్కోరకం వ్యక్తిత్వం. ఎదుటివారి మనస్తత్వం బట్టి కొన్నిచోట్ల నడుచుకోవాలి. మన శక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది. అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి-ఆఫీసుకి మధ్యదూరం, రాకపోకలకు అనుకూలత- లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా వుందా? లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలంకాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యువతలో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘నేను ప్రేమిస్తున్నాను’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్నవారు ‘నో’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైనా మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చుకదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదు కదా. అందుకే వారానికి ఏంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు మంత్రం పాటించాలి. ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిరుతిండ్లు తినడం యూత్‌కు అలవాటే,. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు.. గోబీ లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ.. అదే ఊబకాయం. రెండు, మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండేవారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది. మీరు చేసే పనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్టే పని గురించి క్షుణ్ణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా వుంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా.. ఛాలెంజ్‌గా.. అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు, మీవారికి హ్యాపీ. హ్యపీయే హ్యాపీ.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660