సబ్ ఫీచర్

సాగర్‌కు వెళతారా! ఇదీ జాగ్రత్త!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా పుష్కరాల వేళ మిగతా ఘాట్లకు వెళ్లేవారికన్నా సాగర్ ఘాట్లకు వెళ్లేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. పర్యాటక ప్రాంతాలు, సాగర్ డ్యామ్ ఉండటంతో ఇటు వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. కానీ డ్యామ్ భద్రత, ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఉండేందుకు అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలు, బస్సులు, ఆర్టీసి సర్వీసులన్నింటిని సాగర్‌కు 15 కిలోమీటర్ల ముందే ఈశ్వరమ్మ పార్కింగ్ ప్రాంతం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి పుష్కర యాత్రికులను ఉచిత బస్సుల్లో సాగర్‌కు 2 కిలోమీటర్ల ముందు పైలాన్‌కాలనీవరకు తీసుకువస్తున్నారు. అక్కడినుంచి షేర్ ఆటోలు, కాలినడకన ఘాట్‌లవద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.

-ఆంధ్రభూమి విలేఖరి, నాగార్జునసాగర్