సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతట దహనకర్మము ముగియగనే యామె తన గాజులను దీసివేసి వానికిబదులు బంగారు మురుగులను ధరించెను. జనులామె విపరీత చర్యను జూచి వంత పడసాగిరి. కాని యామె వారలకిట్లు సమాధానము చెప్పెను: ‘‘ఇంతకుముందు నా భర్త శరీరము గాజుపెంకులవలెనే దుర్బలమై అస్థిరమైయుండెను. ఇప్పుడాక్షణ భంగురమైన శరీరము నశించినది. అందుచేనాతడిపుడు సర్వవిధముల వికార రహితుడై పరిపూర్ణుడైయున్నాడు. తన శరీరమునకిక శిథిలతలేదు. కాబట్టి నేను సులభముగ చిటిలెడు గాజులను విసర్జించి యంతకంటె స్థిరమైన మురుగులను ధరించితిని.’’జ్ఞానియగు పుత్త్రుడు: అజ్ఞానియగు తండ్రి
1115. ఒకప్పుడిద్దఱు సాధువులు దక్షిణేశ్వరమునకు వచ్చిరి. వారు తండ్రి కొడుకులు, కుమారుడు బ్రహ్మజ్ఞాని, కాని తండ్రికింకను జ్ఞానోదయము కాలేదు. ఇరువును శ్రీరామకృష్ణుని గదిలో గూర్చుండి యాతనితో సంభాషించుచుండిరి. ఇంతలోనొక యెలుక కన్నములోనుండి యొక త్రాచుబామువచ్చి కుమారుని గఱచినది. అది చూచి తండ్రి భీతిలిపోయి చుట్టుపట్లనున్న వారందఱను బిలువసాగెను. కాని కుమారుడు కదలక కూర్చుండియుండెను. అది చూచి తండ్రి మఱింత దిగ్భ్రమచెంది, ‘‘నాయనా! అదేమి? అలాగున కదలక మెదలక కూర్చుండి యున్నావు? నీకు...’అని యడుగగా కుమారుడు నవ్వుచు నిట్లు సమాధానము చెప్పెను: ‘‘పాము అనగా ఏది? ఎవరిని గఱచినది?’’ అతడద్వైతసిద్ధిని బడసినవాడు. కావున పామునకును నరునకును నాతడు భేదమును బాటింపలేదు. (సమస్తపునాతని దృష్టిలో బ్రహ్మమే.)
అంత్యజుడు: శంకరాచార్యుడు
1116. మాల యొకడు మాంసముతో నిండిన తట్టలను గావడిలో బెట్టుకొని మోయుచు శ్రీశంకరాచార్యున కెదురుపడెను. ఆయన యప్పుడే గంగాస్నానముచేసి వచ్చుచుండెను. ఆమాల రుూ మహనీయుని దాకుట తటస్థించినది. శంకరుడాగ్రహపరవశుడై, ‘‘ఓరోరీ! నన్ను దాకితివా!...’’ యనెను. మాల యిట్లు సమాధానము చెప్పెను: ‘‘అయ్యా, నేను మిమ్ము దాకలేదు, మీరు నన్ను దాకలేదు! మీయాత్మ శరీరమో, మనస్సో, బుద్ధియో సెలవీయుడు; నిజముగా మీరెవ్వరో నాకు జెప్పుడు. సత్త్వరజస్తమోగుణములలో నాత్మ దేనిని నంటజాలదనునది తమకు దెలియని సంగతికాదుకదా’’ శంకరాచార్యుడంతట దనప్రమాదమును గ్రహించి సిగ్గుపడియెను. మాలని వాక్యములాతని కాత్మప్రబోధకములయ్యెను.
శిష్యునకు క్రమముగా బోధించిన గురువు
1117. ఒకప్పుడొక సాధువు తన శిష్యునకాత్మజ్ఞానము బోధించు తలంపున వానినొక దివ్యమైన వనములోనుంచి తాను వెడలెను. కొన్ని దినములైన వెనుక నాతడు తిరిగివచ్చి, ‘‘నాయనా! నీకేమియు లోటు లేదుగద?’’అని యడిగెను. శిష్యుడు, ‘‘స్వామీ! లోటులేదని యెట్లు చెప్పగలను?...’’అని సమాధానించెను. గురువంతట శ్యామయను సుందరిని వానికడ దిగవిడిచి, ‘‘నాయనా! మత్స్యమాంసములను యథేచ్ఛముగా దినవచ్చును’’అని చెప్పెను. శిష్యుడీసారి ‘‘స్వామీ! తమ దయవలన నాకేమియు లోటులేదు’’అని చెప్పెను.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది