సబ్ ఫీచర్

‘పొర’పాట్లకు స్వస్తి పలుకుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమికి రక్షణ కవచంగా నిలిచేది ‘ఓజోన్ పొర’ అని శాస్తవ్రేత్తలు అభివర్ణిస్తుంటారు. సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన, ప్రభావవంతమైన అతి నీలలోహిత కిరణాలను శోషించుకుని, సకల జీవకోటికి రక్షణగా ఈ ‘పొర’ నిలుస్తోంది. ఓజోన్ అనేది మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువు(ట్రై అటామిక్ ఆక్సిజన్ మాలిక్యూర్). ఇందులో ఉన్న అన్ని ఆక్సిజన్ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు. కానీ మనం శ్వాసక్రియలో పీల్చే సాధారణ ద్విపరమాణుక ఆక్సిజన్ అణువులో మాత్రం రెండు పరమాణువులు ఒకే విధమైనవి. భూవాతావరణాన్ని నేలమీద నుంచి పైకి వెళ్ళేకొలది అక్కడున్న ప్రధాన రసాయనిక భౌతిక ధర్మాల ఆధారంగా, కొన్ని పొరలుగా విభజించారు. నేలకు దగ్గరగా 20కి.మీ.లోపే ఉన్న పొరను ట్రోఫాస్పియర్ అనీ, 20 కి.మీ.నుంచి 50 కి.మీ. మధ్యన ఉన్న పొరను స్ట్రాటో స్పింకుర్ అనీ, ఆ తర్వాత మీసో స్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అనే పొరలు సుమారు 500 కి.మీ.వరకు వివిధ మార్గాల్లో విస్తరించి ఉన్నాయి. మన సాధారణ ఆక్సిజన్ అణువులు స్ట్రాటో స్పియర్‌లో ఓజోన్ అణువులుగా మారుతాయి.
ఓజోన్ అనేది వాయు పదార్థం. ఇది లేత నీలం రంగులో ఉంటుంది. భూమిని ఆవరించి ఉన్న ‘ఓజోన్ పొర’ కాలుష్యం ప్రభావంతో క్రమంగా దెబ్బతింటోంది. దీన్ని పరిరక్షించేందుకు ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1987, సెప్టెంబర్ 16న దాదాపు 24 దేశాల ప్రతినిధులు మాంట్రియల్ నగరంలో సమావేశమై, ఓజోన్ పొర రక్షణ గురించి చర్చించారు. ఈ చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందంపై సంతకం చేసిన తేదీకి గుర్తుగా ‘ఓజోన్ లేయర్ డే’ని నిర్వహించాలని తీర్మానించారు. భూమీద కాలుష్య కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ఏటా సెప్టెంబర్ 16న ‘ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినం’గా పాటించాలని 1994లో ప్రకటించింది.
ఓజోన్ భూమి చుట్టూ ఒక గొడుగులా ఆవరించి కవచంలా కాపాడుతుంది. అధిక ఇంధన వాడకం, మితిమీరిన రసాయనాలు ఉపయోగించడం, చెట్లు నరికివేయడం వంటి అంశాలు ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి. సిజెసి మిథైల్ క్లోరోఫారం, మిథైన్ బ్రోమైడ్, హెచ్‌ఎఫ్‌సి వంటివి ఓజోన్‌ను బలహీనపరిచే రసాయనాలు. కా లుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువై భూగ్రహం అతిగా వేడెక్కడం వల్ల వన్యప్రాణులు చనిపోతున్నాయి. ఓజోన్ పొరకు మనమే చేజేతుల్లా చిల్లులు పెట్టేస్తూ, మన వినాశాన్ని మనమే కొనితెచ్చుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద వర్షాధార అరణ్యంగా పేరుగాంచిన అమెజాన్ 2025నాటికి 40 శాతం కనుమరుగై పోతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెజాన్ ప్రమాదంలో పడిందంటే మానవ ఉనికే ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే ఏటా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కార్బన్‌లను 40శాతం అమెజాన్ అడవులే పీల్చుకుంటున్నాయి. 2050 నాటికి అంటార్కిటికా పైన ఓజోన్ పొరతో ఏర్పడిన రంధ్రం పూడుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. నైట్రోజన్ ఆక్సైడ్, ప్రమాదకరమైన కాలుష్య కారకం. ఓజోన్ పీఎం 2.5 (పార్టిక్యులేట్ మ్యాటర్ కంటికి కనిపించనంత అత్యంత సూక్ష్మమైన ధూళి) ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మనం పీల్చే గాలిలో ఓజోన్ ఉంటే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆస్తమా బాధితులు, పిల్లలు, వయోవృద్ధులు, ఓజోన్ ఉన్న గాలిని ఎక్కువగా పీలిస్తేవారి ఆరోగ్యానికి ప్రమాదం. ఛాతీనొప్పి, దగ్గు, గొంతు మంట, శ్వాసనాళాల వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఓజోన్ అదుపు చాలా చిన్నది కావడంవల్ల అది వాయురూపంలో ఉండడంతో దానిని మనము చూడలేము. ఇది దాదాపు పారదర్శకంగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్యసంస్థ సమాచారం ప్రకారం, విశ్వవ్యాప్తంగా 20 నుంచి 30 లక్షల మంది చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో 20శాతం పైగా రోగులు సూర్యకాంతి నేరుగా సోకిన ఫలితంగా కేన్సర్ బారిన పడుతున్నారని ఒక అంచనా. సూర్యుడి నుంచి వచ్చే యువిబి అతి నీల లోహిత కాంతిని ఓజోన్ పొర నిరోధిస్తున్న కారణంగా, ఓజోన్ పొర క్షీణిస్తే, ఉపరితల యువిబి స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల చర్మ క్యాన్సర్ పెరగడంతోపాటు వివిధ రకాల నష్టాలు కలుగుతాయి. ఓజోన్ పొర నాశనం వల్ల భూమిపై ప్రాణులకు హాని కలుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్, ల్యూకేమియా (తెల్ల రక్తకణాల క్షీణత), స్ర్తిలలో రొమ్ము క్యాన్సర్, చర్మం, కంటి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ప్రాణవాయువు విడుదలకు ఉపయోగపడే కిరణజన్య సంయోగక్రియ అంతరాయం ఏర్పడి ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేగాక ఆహారోత్పత్తిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అందివచ్చిన విలాసాలను విచ్చలవిడిగా వాడుతున్నాం. ఏసీలు, ఫ్రిజ్‌లు, కాస్మోటిక్స్ ఎక్కువగా వినియోగస్తున్నాం. ఇదే ఓజోన్ పొరకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తీసుకువస్తుంది. ఏసిల వాడకం తగ్గించాలి. పాలిథిన్ వినియోగం తగ్గించాలి. భారతదేశంపై ఓజోన్ ప్రభావం పడిందనే నివేదికలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తపడాలి. హరిత గృహ వాయువులు వాతావరణంలోకి వెళ్లడాన్ని నిరోధించేందుకు విరివిగా చెట్లు నాటాలి. పర్యావరణాన్ని పరిరక్షించేలా కృషిచేయాలి. ఓజోన్ పొరను కాపాడుకుందాం. ఆరోగ్య సమాజాన్ని చక్కటి వాతావరణాన్ని సృష్టిద్దాం. భూ తాపాన్ని తీరుద్దాం.
(రేపు ప్రపంచ ‘ఓజోన్ పొర’ రక్షణ దినం)

-కె.రామ్మోహన్‌రావు 94414 35919