సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువపుడు వారిరువురిని (అనగా శ్యామను శిష్యుని) బిలిచి శ్యామ చేతులను జూపుచు, ‘‘ఇవియేమో చెప్పగలవా?’’అని యడిగెను. శిష్యుడు, ‘‘ఏల? ఇవి శ్యామ చేతులుగదా’’యని బదులుచెప్పెను. గురువంతట శ్యామకండ్లు, ముక్కు మొదలైన యవయవములను జూపుచు, పదే పదే యదియే ప్రశ్నవైచెను. శిష్యుడుచితమైన సమాధానములను జెప్పసాగెను.
అంతట వానికిట్లు దోచినది: ‘‘ప్రతి దానిని గూర్చియు ఇది శ్యామముక్కు, ‘ఇది శ్యామకన్ను’- అని చెప్పచున్నాను గదా. ఈ శ్యామ యెవరు?’’
దిగ్భ్రమ చెంది యాతడు గురువునిట్లు ప్రశ్నించెను: ‘‘స్వామీ! ఈ కండ్లు, ముక్కు, చెవుల మొదలైనవి యెవరివో ఆ రుూ శ్యామయెవరు?’’ గురువిట్లు పలికెను: ‘‘నాయనా! ఈ శ్యామయెవరో నీవు తెలిసికొనగోరిన పక్షమున నాతో రమ్ము, నీకు బోధపఱిచెదను.’’ ఇట్లనుచు వానిని దీనికొనిపోయి తత్త్వము నుపదేశించెను.
పుత్రుల జ్ఞానమును పరీక్షించిన తండ్రి
1118. ఒకనికి ఇద్దఱు కుమారులుండిరి. యుక్త వయస్సు రాగానే వారినాతడు బ్రహ్మచర్యాశ్రమమును బ్రవేశింపజేసి వేదాధ్యయనమునకై యొక గురుని కడ నుంచినాడు. వారు చాలకాలమునకు జదువు ముగించి యింటికి దిగిరి వచ్చిరి. ‘‘నాయనలారా! మీరు వేదాంతము చదివినారా?’’ అని తండ్రి ప్రశ్నించెను. వారు ‘‘ఔను’’ అని చెప్పగా, ‘‘మంచిది, బ్రహ్మమన నెట్టిదో నాకు జెప్పుడు’’ అని యాతడడిగెను. అంత బెద్దకుమారుడు వేదములనుండియు, శాస్తమ్రులనుండియు బ్రమాణముల నెన్నిటినో చూపుచు నిట్లు సమాధానము చెప్పినాడు:
‘‘నాయనా! బ్రహ్మమును నోటి మాటలతో వర్ణించుటకు వీలుపడదు. మనస్సునకు గూడ అది గోచరముకాదు.’’ఇట్లనియు బ్రహ్మమట్టిది, యిట్టిదని వర్ణింపబూని తుదకు ‘నాకంతయు దెలియును’ అని వక్కాణించుచుదాను చెప్పుదానిని బలపఱుచుటకై వేదాంత వాక్యముల నేకరువు పెట్టసాగెను.తండ్రి వినివిని, ‘‘సరే, నీవు బ్రహ్మమును నిజముగా దెలిసి కొన్నావన్న మాట! మంచిది, నీ పని మీద నీవు పొమ్ము’’ అని వానిని బంపివేసెను. అంతట నాతడు తన చిన్న కుమారుని గూడ నదియే ప్రశ్నవైచెను. ఆ పిల్లవాడు వౌనము దాల్చినాడు.
వానినోట నొక్క మాటయైనను వెలువడదయ్యెను, మాటాడుటకుగూడ నాతడు ప్రయత్నింపనే లేదు. అది గని తండ్రి యిట్లు విమర్శించి పలికెను:
‘‘మంచిది, నాయనా! నిజమంతటిదే. పరబ్రహ్మమును గూర్చి ‘యితమిత్థమని చెప్పట కెంతమాత్రము సాధ్యముకాదు. దానిని గురించి పలుక నోరు తెఱచినంతనే యనంతమును సాంతము గను, అపరిచ్ఛిన్నమును పరిచ్ఛిన్నముగను, అప్రమేయమును ప్రమేయముగను నిర్వచించినవాడవగుదువు.
వేయి శ్లోకములను వేయి ప్రమాణములను ఏకరువు పెట్టుటకంటె నీవౌనమే ఈ విషయమును మహోత్కృష్టముగా వెల్లడించుచున్నది.’’
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి