సబ్ ఫీచర్

కావ్యాలంకారానికి ఆద్యుడు సన్నిధానం సూర్యనారాయణ శాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరోమణి సన్నిధానం సూర్యనారాయణశాస్ర్తి గారు 1897 డిసెంబర్ 10న బుచ్చినర్సమ్మ, సుబ్బయ్య పుణ్య దంపతులకు జన్మించారు. వైదిక కుటుంబీకులైన శాస్ర్తిగారి బాల్యమంతా వారి మేనమామ గారింట కృష్ణాజిల్లాలోని చిరివాడ గ్రామంలో బాల్యం గడిపారు. బాల్యం నుండే ఆంధ్ర, సంస్కృత వాఙ్మయమందు అభిరుచి కలిగిన శాస్ర్తిగారు కాకినాడ ప్రాచ్యకళాశాలలో సాహిత్య మూలాలను అనే్వషించి మద్రాసు (చెన్నై) విశ్వవిద్యాలయ విద్వాన్ ప్రధమ పరీక్షలో ప్రధమ శ్రేణిలో ఉత్తేర్ణులైనారు.
పిమ్మట 1920 ప్రాంతంలో సికిందరాబాద్ విచ్చేసి మహబూబ్ కళాశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగంలో ప్రవేశించి 35 వసంతాల అనంతరం 1957లో ఉద్యోగ విరమణ గావించారు. తరువాత మాడపాటి హనుమంతరావు గారి ఆహ్వానముపై రాజా రావుబహదూర్ కళాశాలలో ప్రప్రధమ ఆంధ్ర, సంస్కృత అధ్యాపకులుగా ఐదువర్షములు సేవలందించి 1962లో ఉద్యోగ విరమణ చేసి నిశ్చింత జీవనం సాగించారు.
శాస్ర్తిగారి ఆంధ్ర, సంస్కృత బోధన బహు ప్రత్యేకతతో కూడుకొన్నది. వారు తరగతిలో పద్యం గాని, శ్లోకం గాని శ్రావ్యంగా చదువుతుంటే కళాశాల మొత్తం నిశ్శబ్దముగా ఉండేదని, కళాశాలలో అందరూ అన్నీ మానేసి పద్యాలు విని ఆనందించేవారని అధ్యాపకులు చెప్పుకునేవారు. ఆయన గొప్పతనం గుర్తించి ఆకాశవాణి , హైదరాబాద్ కేంద్రంలో సంస్కృత భాషా బోధనా తరగతులు కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించారు. ఆయన గ్రంథాల్లో ప్రశస్తమైనవి మూడు. మొదటిది కావ్యాలంకార సంగ్రహము. అలంకార శాస్తమ్రుపై ప్రామాణిక గ్రంథం. ప్రపంచంలో చాలా విశ్వవిద్యాలయాలలో ఇప్పటికీ ఉపయోగిస్తున్న ప్రామాణికమైన ఉత్తమ గ్రంథం. రెండవది తత్సమ చంద్రిక. ఇది వ్యాకరణ గ్రంథం. ఈ కోవలో ఇటువంటి వ్యాకరణ గ్రంథం ప్రతి భాషకు ఉండాలని భాషా శాస్తవ్రేత్తల అభిప్రాయం. దీనినిబట్టి ఈ గ్రంథం విలువ మనం గ్రహించవచ్చు. మూడవది బాల- వ్యాకరణం. ఈ గ్రంథంతో వ్యాకరణం స్వయంగా నేర్చుకోవచ్చు. ఈ గ్రంథత్రయం ‘‘న భూతో న భవిష్యతి’’ అంటే అతిశయోక్తి కాదు.
సూర్యనారాయణశాస్ర్తి సాహిత్య గురువులు వేలూరి శివరామశాస్ర్తి గారు (చిరివాడ), ఆధ్యాత్మిక గురువులు కావ్యగంట గణపతిశాస్ర్తి గారు (అరుణాచలం). ఆయన ప్రతి నిత్యం గాయత్రి మంత్రం ద్విసహస్రం, విష్ణు సహస్రనామం రోజంతా ఉపాసించేవారు.
సూర్యనారాయణశాస్ర్తి విద్యారత్న బిరుదాంకితులు. గద్వాల, వనపర్తి అద్దంకి సంస్థానాధిపతుల గౌరవ పురస్కారాలు అందు కున్నారు. ప్రపంచ మహాసభల, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి పురస్కారాలు అందుకున్నారు. ఆయన పోతన భాగవతంలోని కొన్ని ఘట్టాలు ‘‘ఆంధ్ర భాగవతం’’ అనే పేరుతో సంస్కృతంలో అనువదించారు. అప్పటి మంత్రి అయిన పి.వి. నరసింహరావు గారు బమ్మెర గ్రామంలో సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఒకసారి గద్వాల సంస్థానా ధిపతులు వారి సంస్థానంలో ఉన్న గుడిలో అమ్మవారి గురించి కావ్యము రచించమని ప్రార్ధించగా, శాస్ర్తిగారు 150 శ్లోకములతో కావ్యము రచించారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్టప్రతిగా ఉన్నప్పుడు ఒకసారి గ.ఱ..్గ.్గ కళాశాలలో సభలో ప్రసంగించ డానికి వచ్చినప్పుడు కళాశాల అధికారులు శాస్ర్తి గారిని పరిచయం చేసిన సందర్భంలో రాధాకృష్ణన్‌గారు స్పందిస్తూ ‘‘మీరా శాస్ర్తిగారు, మీ కావ్యాలు నేను చదివాను, ఇప్పుడు మిమ్ములను చూస్తున్నాను’’ అని చెప్పారట. బురుగు రామకృష్ణరావు గారు, చెన్నారెడ్డి గారి సతీమణి మొదలగువారు శాస్ర్తిగారి ఇంటికి వచ్చి ఆయనతో కావ్యముల గురించి చర్చించేవారు.
సూర్యనారాయణశాస్ర్తిగారు 80 పుస్తకములు రచించారు. అన్నీ ప్రచురించ బడ్డాయి. ఐతే ఆ పుస్తకములు ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రస్తుతం ఆయన 55 ప్రచురణలు, రెండు భాషలలో (సంస్కృతం, తెలుగు) ప్రపంచ వ్యాప్తంగా 221 గ్రంథాలయాల్లో సమ కూర్చారు. దక్షిణ భారతదేశంలో ఉన్న అరుదైన కవులలో ఒకరుగా గుర్తించి ఆయన కొన్ని గ్రంథాలను వాషింగ్టన్ డీసీలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో పొందుపరిచారు. ఆయన రచించిన కొన్ని ముఖ్యమైన గ్రంథములు - 1) వివేకానందం: తెలుగు, సంస్కృతం, 2) జాతక కధాగుచ్ఛములు: తెలుగు, 3) పువ్వులతోట: తెలుగు, 4) ఆంధ్ర ప్రభంధ కధలు: తెలుగు, 5) వాసవదత్త: తెలుగు, 6) అమృత కణములు: తెలుగు, 7) కీర సందేశము: తెలుగు, 8) ప్రవరాఖ్య వరూధినీయం: తెలుగు, 9) ఖడ్గతిక్కన: తెలుగు, 10) కుమారి: తెలుగు, 11) పరమహంస కధావళి: తెలుగు, 12) ఆంధ్ర వ్యాసావళి: తెలుగు, 13) కావ్యమాల: తెలుగు, సాహిత్య పదకోశము, 14) స్మరగీతా: తెలుగు, 15) శతపత్రము : తెలుగు, 16) గాఢాసప్తశతి: ప్రాకృతం నుండి తెలుగు అనువాదం, 17) పరమహంస కధావళి : -్ఘ్ఘఇళఒ యచి గ్ఘ్ఘౄరీజఒ్దశ్ఘ -్ఘ్ఘ్ఘదఘౄఒ్ఘ నుండి తెలుగు, సంస్కృతం అనువాదములు., 18) ఆంధ్ర భాగవతం: సంస్కృతం, పోతన భాగవతంలోని కొన్ని ఘట్టములకు అనువాదం, 19) రామదాసమ్: భద్రాచల రామదాసు చరిత్ర, సంస్కృతం, 20) తెనాలి రామకృష్ణ : సంస్కృతం, 21) త్రికమ్: సంస్కృతం, 22) ఆంధ్రకావ్య కథాః; సంస్కృతం, 23) నంద చరితం: సంస్కృతమ్, 24) కాదంబరిసార: సంస్కృతం, 25) కళాపూ ర్ణోదయం: పింగళి సూరన్నగారి గ్రంథమునకు సంస్కృత అనువాదం, 26) సంయుక్త స్వయంవరం: సంస్కృతం, 27) కావ్యాలంకార సంగ్రహం : తెలుగు, 28) ఆంధ్ర వ్యాసావళి: తెలుగు, 29) తత్సమ చంద్రిక: తెలుగు, 30) బాలవ్యాకరణం: తెలుగు.

- తీగవరపు వనజ, 7382762152