సబ్ ఫీచర్

ఆడపిల్లని బతికిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్ల అని తెలియగానే చాలు కడుపులో వున్న పిండాన్ని చిదిమేస్తున్నారు. ఎక్కువగా మన దేశంలోనే అందులోను బాగా చదువుకొని, ఆర్థికంగా వున్న కుటుంబాల్లోనే భ్రూణహత్యలు జరగడం శోచనీయం. బాలికలపై వివక్షతోనే భ్రూణహత్యలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టడానికి పసిపిన్‌డిటి చట్టం కూడా వుంది. అయినా కూడా ప్రయోజనం లేదు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసే సంస్కృతి ఇంకా కొనసాగుతుండడం విచారకరం. నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాల్లోనే భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేరళలో ప్రతీ వందమందికి 930 మంది బాలికలు, పంజాబ్‌లో 845, ఉత్తరప్రదేశ్‌లో 846 మంది, మన రాష్ట్రంలో 943 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఆడపిల్ల అని తెలిసినంతనే గర్భ విచ్ఛిత్తికి పాల్పడడంవల్ల రాను రాను ఆడపిల్లల సంఖ్య పడిపోతోంది. ఇలా ఆడపిల్లలని కడుపులో ఉండగానే చిదిమేయడానికి గల ప్రధాన కారణం ఆడపిల్ల అంటే ఖర్చు అని భావించడమే.
ఇప్పటికీ మగ పిల్లలు పుట్టాలనే యావ ప్రజల్లో చావలేదు. మన దేశానికి ఏదోక మూల కోడలు ఆడపిల్లని కనిందని అత్తలు కోడళ్ళను గెంటివేసే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మగ పిల్లాడిని సంతానంగా ఇవ్వలేదని భార్యలను వదిలే భర్తలు ఇంకా ఉన్నారు. పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అయితే ఏ మాత్రం కనికరం లేకుండా ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి చెత్తబుట్టలో వేస్తే పసిప్రాణాలు కుక్కలకు ఆహారం అవుతున్నాయి.
మగ పిల్లాడు వలన బోలెడు లాభాలు ఉన్నాయని, ఆడపిల్ల అయితే అన్ని ఖర్చులనే భావన కూడా భ్రూణహత్యలకు ప్రధాన కారణం. పురుషుడికి కట్నం ఎక్కువ రావడం, స్ర్తి అయితే కట్నం ఇవ్వాల్సి రావడంవలన ఆడపిల్ల అంటేనే ఖర్చు కాబట్టి పురిటిలోనే చంపేసే విష సంస్కృతికి బీజాలువేశారు. సమాజంలో పురుషులకు ఇచ్చిన ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడంలేదన్నది నిర్వివాదాంశం. చట్టాలపై చట్టాలు చేస్తున్నా చర్యలు చేపడుతున్నామని పాలకులు ఎంతగా చెబుతున్నా దేశ వ్యాప్తంగా జరుగుతున్న భ్రూణహత్యలను నియంత్రించడంలో పాలకులు విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. తల్లి గర్భంలోనే మాతృత్వాన్ని చంపేస్తున్నవారికి కఠినశిక్షలు పడే విధంగా చట్టాలు రూపొందించినా అమలు విషయంలో నిర్లక్ష్యవైఖరితో ఇది కొనసాగుతూనే వుంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్కానింగ్ సెంటర్లలో లింగనిర్థారణ పరీక్షలు చేయరాదని స్పష్టమైన నోటీసుబోర్డులు వున్నా అవి గోడలకే పరిమితం అవుతున్నాయి.
లింగనిర్థారణలో ఆడశిశువు అని తేలితే అబార్షన్‌కు వెనుకాడడం లేదు. ఇలా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో వచ్చీ రాని వైద్యంతో తల్లిప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. గర్భం దాల్చిన మహిళ ప్రాణాలకు ముప్పువాటిల్లిన సమయంలోనూ, శిశువు అంగవైకల్యంతో వున్నట్లు నిర్థారణ జరిగితే చట్టబద్ధంగా అబార్షన్ చేసే అవకాశం వుంటుంది. ఇదే విషయాన్ని మెడికల్ టెర్మినేట్ ఆఫ్ ప్రిగ్నెన్సీ ఎంటిఎ చట్టం స్పష్టం చేస్తుంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలే ఇష్టానుసారంగా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అబార్షన్‌లు చేస్తున్నాయి. సంబంధిత గైనకాలజిస్ట్, అల్ట్రాసౌండ్ వైద్యుల పర్యవేక్షంలో అబార్షన్ చట్టపరంగా నిబంధనల పరిధిలో చేయాల్సి ఉంటుంది. అంతేగాని భర్తనో, అత్తమామలో ఆడశిశువని తెలుసుకొని అబార్షన్ చేయించడం ఏ పరిస్థితుల్లోనూ చట్టం అంగీకరించరు. కానీ అనేక ప్రాంతాల్లో ఇదే జరుగుతున్నది. దేశ వ్యాప్తంగా కాని, తెలుగు రాష్ట్రాల్లో కానీ వేలాది స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అందులో గుర్తింపు లేని స్కానింగ్ సెంటర్లు కోకొల్లలు. నిజానికి అబార్షన్ ప్రక్రియ గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లలోనే చేయాల్సి ఉంటుంది కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. గుర్తింపు పొందిన డాక్టర్లు మాత్రమే స్కానింగ్ తీయాల్సి వుంటుంది. దీనికితోడు గర్భకోశ వైద్యులు రిఫర్ చేస్తేనే పరీక్షలు నిర్వహించాలనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్‌లు చేసినవారికి పిఎన్‌డిటి యాక్టు 94 ప్రకారం లింగనిర్థారణ చేసినా, అబార్షన్ చేసినా మూడు సంవత్సరాల జైలుశిక్ష, యాభై వేల రూపాయల జరిమానా, రెండోసారి చేస్తే ఐదు సంవత్సరాల జైలు, యాభైవేల జరిమానా, మళ్లీ అదే నేరం మూడోసారి కొనసాగిస్తే డాక్టర్ డిగ్రీని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దుచేస్తుంది.
భ్రూణహత్యలకు పాల్పడేవారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే, ఈ భ్రూణహత్యలకు కొంతవరకైనా ఫుల్‌స్టాప్ పడే అవకాశాలున్నాయి. ఈ శిశు హత్యను తీవ్రంగా నేరంగా పరిగణించే విధంగా 302యే కాదు అవసరం అనుకుంటే మరిన్ని చట్టాలు జోడించి, అబార్షన్‌కు ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షించకుంటే ఈ భ్రూణహత్యలు కొనసాగుతూనే వుంటాయి. చట్టాలు చేయడంలో వున్న శ్రద్ధాసక్తులు వాటిని అమలుచేసే విషయంలోనూ తీసుకుంటే కొంతలో కొంతవరకైనా చెప్పే మాటలకు చేసే చట్టాలకు అర్థం వుంటుంది.

-పుష్యమీ సాగర్ 9010350317