సబ్ ఫీచర్

‘కమలం’ వికాసానికి ఇదే తరుణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితికి చాలా కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమ యానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడటంతో సాధా రణంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు కూడా ఈ ఎన్నికలలో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను బదిలీ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన కారణం- గత రెండు మూడేళ్లలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న తెలుగు మీడియా ఒక పథకం ప్రకారం.. రాష్ట్ర విభజన అనంతరం తలెత్తిన అన్ని సమస్యలకూ భాజపాను కారణంగా చూపెడుతూ ప్రజల ముందు ఆ పార్టీని దోషిగా నిలబెట్టింది. ప్రత్యేక హోదా అంశం కూడా ఆవేశపూరితమైన అంశంగా మారటంతో ఎన్నికలలో భాజపా తీవ్రంగా నష్టపోయింది. దేశం మొత్తం మీద వీచిన భాజపా గాలి ఆంధ్రప్రదేశ్‌లో కనిపించలేదు. కానీ 2019 ఎన్నికలు ఇంకొక రకంగా భాజపా ఎదుగుదలకు కొత్త మార్గాన్ని తెరిచాయి. అది ఈ ఎన్నికల్లో తెదేపా అనూహ్యంగా గల్లంతై పోవటం. ఆ విధంగా ఏర్పడిన రాజకీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోటానికి భాజపాకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో 1956 నుంచి గత 60 ఏళ్ల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అధికారం కేవలం ప్రధాన భూ ఆధారిత సామాజిక వర్గాలకే పరిమితమైందని తెలుస్తుంది. నెహ్రూ కేంద్రంలో తన అధికారం బలపరిచే విధంగా రాష్ట్రాలలో బలమైన సామా జిక వర్గాలు పాలించే విధం గా విధాన రూపకల్పన చేశా రు. తదనుగుణంగా ఆంధ్ర ప్రదే శ్‌లో బలమైన సామాజిక వర్గమైన రెడ్ల చేతిలో రాజకీ య అధికారం కొనసాగింది. ఇందిరాగాంధీ 1971 ఎన్నిక లలో ఘన విజయం సాధిం చి ఈ విధానాన్ని మా ర్చడానికి ఒక ప్రయత్నం చేసింది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీసీ, ఎస్సీ నాయకులతో ఒక నూతన సామాజిక సమీకరణ కోసం ప్రయత్నం జరిగింది. కానీ జై ఆంధ్ర ఉద్యమం రూపంలో రాష్ట్రంలోని బలమైన వర్గాలు ఈ ప్రయత్నాన్ని వమ్ము చేశాయి. ఆపైన జలగం వెంగళరావు నాయకత్వంలో ఇంకొక బలమైన సామాజిక వర్గ ప్రయోజనాలు ఆధారంగా రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. 1980 ఎన్నికల తర్వాత తిరిగి ప్రధానిగా ఇందిరా గాంధీ వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రతిపక్షమే పూర్తిగా తుడి చిపెట్టుకు పోయింది. కానీ ఆంధ్ర రాష్ట్రం విషయంలో ఇందిరా గాంధీ తాత్కాలిక పద్ధతుల్లో రా జకీయాలు నడుపుతూ తరచుగా ముఖ్యమంత్రులను మారుస్తూ పాలనా విధానాన్ని కొనసాగించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమర్థ నాయకత్వం, అవినీతి, జంబో మంత్రివర్గాలు ఒక నూతన రాజకీయ పార్టీ ఎదుగుదలకు పూర్తి వాతావరణాన్ని ఏర్పా టు చేశాయి. అదే సమ యంలో రాష్ట్రంలో బలపడు తున్న ప్రాంతీయ మీడియా ఆధారంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిన ఏడాదిలోనే ఘన విజయాన్ని సాధించి అధికారాన్ని చేజి క్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం లో అధికారం రెడ్డి, కమ్మ సామాజికవర్గాల మధ్య మారుతూ వస్తూ ఉన్నది. మిగిలిన వర్గాలకు ముఖ్యంగా జనాభా పరంగా బలంగా ఉన్న కాపు, దళిత వర్గాలలో- తాము రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామనే భావన బలపడింది. ఈ ఆకాంక్షలను ప్రతిబింబించేలా భాజపా రాజకీయ సమీకరణలు చేసి ముందుకు పోగలిగితే ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గత మూడేళ్లుగా జరిపిన దుష్ప్రచారం వలన ఏర్పడిన వ్యతిరేకతను భాజపా అధిగమించాల్సి అవసరం ఉంది. విభజన అనంతరం రాష్ట్రం నష్టపోవటంలో ప్రధాన పాత్ర భాజపాదేనని ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం అనుకూల మీడియా చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. దీన్ని తిప్పి కొట్టి తన వాదనలు వినిపించడంలో భాజపా విజయవంతం కాలేకపోయింది. ప్రత్యేక హోదా అంశంపై ప్రజలలో చాలా అపోహలున్నాయి. ఈ అపోహలను నివృత్తి చేయటం ద్వారానే భాజపా ఎదుగుదలకు సరైన వాతావరణం ఏర్పడుతుంది. కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన 370 ప్రకరణను తొల గింపు దేశమంతటా భాజపాకు అనుకూల వాతా వర ణాన్ని ఏర్పాటు చేసింది. ఏపీలోనూ ఈ అనుకూల వాతావరణం ఏర్పడి ఉన్నది. దీనిని ఆధారంగా చేసుకొని భాజపా ముందుకు సాగటానికి సరైన వాతావరణం ఇపుడు ఉన్నది. కానీ విభజన అంశాల్లోనూ, ప్రత్యేక హోదా విషయంలోనూ పోహలను నివృత్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక హోదాపై భాజపా తన విధానాన్ని వివరిస్తూ సంపర్క్ అభియాన్‌ను నిర్వ హించడం- 370 ప్రకరణ తొలగింపు విషయం కన్నా చాలా ముఖ్యం.

-ఐవైఆర్ కృష్ణారావు 94943 69595