సబ్ ఫీచర్

ఆర్థిక స్థిరత్వం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో పాటు యువతరం ఆలోచనల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. పాతికేళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేస్తుంది. ఫలితంగా విందులు, వినోదాలు అంటూ యువతరం డబ్బును వృథాగా ఖర్చు చేస్తోంది. చెబితే.. జీవితంలో వినోదం కూడా అవసరం అంటారు. కానీ ఇప్పుడు మనం చేసే పొదుపే.. భవిష్యత్తులో మన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మహిళలు తమ కెరీర్ మొదలుపెట్టినప్పుడే దీని గురించి జాగ్రత్తలు తీసుకుంటే చాలామంచిది.
* ఆడపిల్లలకు పొదుపుపై అవగాహన తక్కువ అన్న అపవాదు ఉంది. అవగాహన లేకపోయినా సురక్షిత మార్గాల్లో పెట్టుబడుల విషయం తెలుసుకోవడానికి నిపుణుల సాయం తీసుకోవాలి. దీనివల్ల ముందునుంచి ఆర్థిక ప్రణాళికను క్రమబద్ధం చేసుకోవచ్చు. ఫలితంగా అదనపు ఖర్చులు తగ్గించుకుని స్థిరమైన ఆదాయంతో భవిత భద్రంగా ఉండేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
* కొనుగోలు శక్తి ఆధారంగానే క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి బ్యాంకులు.. అలాగని లెక్కకు మించి తీసుకోకూడదు. అవసరానికి ఒకటి సరిపోతుంది. దాన్ని కూడా ప్రణాళికగానే వాడాలి. అలాగే వాటిపై కొనుగోలు చేసిన వస్తువుల తాలూకు వాయిదాలు, ఇతరత్రా చెల్లింపులు సకాలంలో ఉండేట్లు చూసుకోవాలి.
* సంపాదించిన రూపాయిలో కనీసం ఇరవై శాతం పొదుపు చేయడం మంచిది. ఇందులో పదిశాతం దీర్ఘకాలిక, మరో పదిశాతం స్వల్పకాలిక లక్ష్యాలపై పెట్టుబడి పెట్టేలే చూసుకోవాలి.
* సంపాదనలో పడటానికి ముందే అవసరానికీ, విలాసాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ప్రతి సందర్భాన్నీ ఆనందంగా జరుపుకోవాలి. అలాగని దానికోసం ఉన్న మొత్తం అంతా ఖర్చుపెట్టుకోవడం సరికదా.. ఏ సరదా అయినా పొదుపు చేశాకే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
* వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చుచేస్తున్నారో, పొదుపు చేస్తున్నారో ప్రతిదానికీ లెక్క రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కడ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో, పొదుపు చేస్తున్నారో తెలుస్తుంది. ఇది మీకు మీ ఆర్థికస్థితిపై ఓ అవగాహనను కలిగిస్తుంది.
* ముందు మీకంటూ ఓ ఆర్థిక ప్రణాళికను తయారుచేసుకోవాలి. అంటే వచ్చేవారం, నెల, సంవత్సరంలో మీకయ్యే ఖర్చులను ఒకసారి రాసుకోవాలి. పిల్లల స్కూలు ఫీజులు, పదవీ విరమణ, యాత్రలు.. ఇలా వీటన్నింటి కోసం కొంచెం మొత్తాన్ని ముందే నిర్దేశించుకోవాలి.
* అలాగే అభిరుచుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను అనే్వషించుకోవాలి. ఉదాహరణకు మీకు టైలరింగ్‌పై ఆసక్తి ఉంటే కొత్త రకాల దుస్తులను కుట్టి కొంత మొత్తాన్ని కూడగట్టవచ్చు. మరేదైనా కళ ఉంటే.. దాని నుంచి కొంత సంపాదించవచ్చు.
* కొన్ని ఖర్చులు అనుకోకుండా వచ్చి పడుతుంటాయి. పెళ్లిళ్లు, పార్టీలు, పిల్లలు, పెద్దల అనారోగ్య సమస్యలు ఇలాంటివి.. కాబట్టి వాటికోసం కొంత మొత్తాన్ని ప్రతినెలా పక్కన పెట్టుకుంటే మంచిది.
* కుటుంబ పెద్దకే కాకుండా మొత్తం కుటుంబానికి వర్తించేలా బీమా చేయించుకోవాలి.
* ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. *