సబ్ ఫీచర్

నిర్వీర్యమవుతున్న ఉపాధ్యాయ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కని భావి టీచర్లను తయారు చేయాల్సిన ప్రభుత్వ బిఇడి డైట్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయ. నాణ్యమైన ఉపాధ్యాయ విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు అమలులో ఆమడ దూరంలో ఉన్నారు. టీచర్ ట్రైనింగ్ చేసే సమయంలో బోధించవలసిన అనుభవం, అర్హత గల అధ్యాపకులు లేనందువల్ల డిప్లమో ఇన్ ఎలిమెం టరీ ఎడ్యుగేషన్ (డిఎడ్), బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుగేషన్ (బిఇడి) కాలేజీలు ఎన్నో ఏళ్లుగా అధ్యాపకులు లేక అల్లాడుతున్నాయ.
ఉపాధ్యాయ విద్యలో ఎన్నో మార్పులు చేశారు. సిలబస్ మార్చారు. ఒక్క ఏడాదిలో పూర్తయ్యే ‘బడి’కోర్సును రెండేళ్లకు పెంచారు. కాని సర్కారు ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో కుంటుపడిన విద్య బోధనను మెరుగు పరిచే విద్యాశాఖ మంత్రులు, అధికారులు కానరావడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయ విద్యలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడం లేదు. భావి టీచర్లకు బోధన కరువైంది. దశాబ్దాల నుండి డైట్ కాలేజీల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉంటున్నా, భర్తీకి చర్యలు చేపట్టడం లేదు. ఎవరైనా పదవీ విరమణ పొందితే ఆ పోస్టు పని అంతే. మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకం చేయాలన్న విషయం తెలుగు ప్రభుత్వాలకు తెలియదా? నవ్య పథంలో పయనిస్తామని ప్రగల్భాలు పలికిన పాలకుకు ఉపాధ్యాయ విద్యకు ఇచ్చిన గౌరవం ఏమిటి? ఎన్‌సిఇఆర్‌టి వారు ఇంటర్నల్ పరీక్షలకు పెద్దపీట వేశారు. ఒక్క సంవత్సరంలో బిఇడి చేసిన వ్యక్తి ప్రమాణం సరిపడినంత లేదని రెండేళ్లకు పెంచింది. దీనివల్ల అధ్యాపకులపై పనిభారం పెరిగింది. తాత్కాలిక నియామకాల వల్ల ప్రయోజనం శూన్యం. అంకిత భావం, అర్హత, క్రమశిక్షణ, నాణ్యమైన బోధనను అందించే డైట్ అధ్యాపకులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు తక్షణమే అవసరం. తెలంగాణ రాష్ట్రంలో పది సర్కారు జిల్లా విద్యా శిక్షణా సంస్థలు, ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఐఏఎస్‌ఇ), మూడు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుగేషన్ కళాశాలల్లో 298 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయ. 14 సర్కారు కాలేజీల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 375 పోస్టులు మంజూరు కాగా 77 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు.
వెనుకబడిన జిల్లా అయన ఆదిలాబాద్ డైట్‌లో 24 మది అధ్యాపకులు పనిచేయాలి. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. తాత్కాలిక సిబ్బంది తప్ప భావి టీచర్లకు గత్యంతరం లేదు. తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో మొత్తం పోస్టులు ఖాళీగా పడివున్నాయం టే టీచర్ ట్రైనింగ్‌లో నాణ్యత ఎంత నిప్పచ్చరంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నల్గొండ, ఖమ్మం, మెదక్, నాగార్జున సాగర్, వరంగల్ కాలేజీల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయ. మరోపక్క సమాజంలో సంస్కారాలను పెంపొం దించాల్సిన విశ్వవిద్యాలయంలోని బిఇడ్ కళాశాలల్లో దశాబ్దాలుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయ. ఎన్ని ప్రభుత్వాలు మారినా ముఖ్యమం త్రులు, వీసీలు మారినా పాత సీసాలో, కొత్త సారా వలెనే ఉంది. డైట్, బిఇడ్ కాలేజీల్లో పాఠాలు చెప్పగల అధ్యాపకులు సుమారు 45 మంది ఉప విద్యాశాఖాధికార్లుగా వెళ్లారు. మండల విద్యాశాఖాధికారి పోస్టులు భర్తీ కాక, పాఠశాల విద్యపై పర్యవేక్షణ కరవైంది.
ఏది ఏమైనా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉత్తమ సంస్కార వంతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ పోస్టులను పైవిధంగా నాణ్యమైన శిక్షణ పొందని, ఉత్తీర్ణతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా భర్తీ చేస్తే,వారు నేర్పే విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

-రావుల రాజేశం