సబ్ ఫీచర్

‘370 రద్దు’పై ఎందుకీ రగడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సబబే అని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అభిప్రాయపడింది. ఈమేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ న్యాయ విభాగం (సుప్రీం కోర్టు యూనిట్) తీర్మానించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరికి భిన్నంగా పార్టీ లీగల్ సెల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం విశేషం. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసిన నాటి మహారాజా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ వ్యక్తీకరించిన అభిప్రాయాలను సమర్ధిస్తున్నట్లు లీగల్ సెల్ అధ్యక్షుడు అనూప్‌జార్జి చౌధురీ పేర్కొన్నారు. ఇమాం మొహమ్మద్ తాహిదీ అనే ఇస్లామిక్ పండితుడు- ‘కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌ది కాదు. ఆ మాటకొస్తే కశ్మీర్, పాకిస్తాన్ రెండూ భారత్‌కు చెందినవే. ముస్లింలు అంతా కలిసి భారత్‌ను హిందూత్వం నుంచి ఇస్లాంగా మార్చినప్పటకీ, భారత్ హిందూ భూమి అన్న వాస్తవం మారిపోదు. ఇస్లాం కంటే ఇండియానే ప్రాచీనమైనది. ఈ విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు.
ఇక 370వ అధికరణం రద్దుపై మన ప్రబుద్ధుల వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. ‘100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి- అంటే 2047 సంవత్సరం నాటికి కశ్మీర్ భారత్‌లో ఉండదు’ అని వారు అంటున్నారు. ఈ మాటెవరిది? తమిళనాడు ఎఎండిఎంకె పార్టీ అధ్యక్షుడు వైగోది. ‘అంతా కలిసి కశ్మీర్‌ను బురదలో ముంచెత్తారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్‌ది 30 శాతం , బిజెపిది 70 శాతం తప్పు ఉంది’ అని ఆయన సెలవిచ్చారు.
కేంద్రానికి మద్దతు
జమాతే ఉల్మా-ఏ-హింద్ (జెయూహెచ్) అనే సంస్ఢ ఢిల్లీలో జరిపిన వార్షిక సమావేశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తూ తీర్మానించింది. ‘కశ్మీర్ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్న విశ్వాసం మాకుంది. అయితే శత్రు సైనికులు, పొరుగు దేశమైన పాకిస్తాన్ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడాన్న మనం గమనించాలి. కశ్మీర్ ధ్వంసానికి పాకిస్తాన్ పూనుకుంటున్నదని ఈ సంస్థ ఆరోపించింది. కాగా, ఆగస్టు 15వ తేదీని ‘బ్లాక్ డే’గా పాటించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్‌ను విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. సంఘ్ పరివార్, బ్రాహ్మణీయ మతోన్మాదుల నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం వ్యూహం ప్రకారం ఆర్టికల్ 370, 35లను రద్దుచేసిందన్నారు. కశ్మీర్ విభజనకు తెరాస, వైకాపా, తెదేపా వంటి పార్టీలు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు, ప్రజలు, వామపక్షాలు, కాంగ్రెస్ , ముస్లింలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ, దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం 370వ ఆర్టికల్‌ను రద్దు చేసిందన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి రాజకీయ పరిణమాలు పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఉంటుందా? అధ్యక్ష తరహా పాలన వస్తుందా?? అన్న అనుమానం వస్తుందన్నారు. లెఫ్ట్ పార్టీల సదస్సులో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాల్సిందే అని తీర్మానించారు. కాగా, బ్రిటన్‌కు చెందిన బాబ్ బ్లాక్‌మన్ అనే ఎంపీ మాట్లాడుతూ, ‘ఆక్రమిత కశ్మీర్‌ను కూడా పాకిస్తాన్ వదలి పెట్టాలని, ఈ మొత్తం ప్రాంతంపై భారత్‌కే పూర్తి సార్వభౌమాధికారం ఉంది’ అన్నారు. యూకేలో ఉంటున్న కశ్మీరీ పండిట్లతో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇష్టం లేకపోయినా పిలిచినచోటకల్లా వెళ్లి, సభికులను తృప్తిపరిచేందుకు మాట్లాడవలసిన అవసరం ఆ బ్రిటిష్ ఎంపీకి లేదనుకుంటాను.
ఇటీవల పాకిస్తాన్‌లో అనేకమంది ముస్లిం ప్రముఖులు పర్యటించారు. సౌదీ ఉప విదేశాంగమంత్రి అదవ్ ఆవ్ జుబేహిర్, యూఏఈ విదేశాంగమంత్రి బిన్‌ఆల్ మహ్యన్ తదితరులు ఆ పర్యటనలో పాల్గొన్నారు. పలు ముస్లిం దేశాల నుంచి వచ్చిన సందేశాలను పాక్ ప్రధానికి అందించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. తమ తమ దేశాధినేతల నుంచే కాకుండా, పలు శక్తివంతమైన ముస్లిం దేశాల నుంచి కూడా కశ్మీర్‌పై పాక్‌కు ఈ సందేశాలను అందించారని తెలుస్తోంది. కశ్మీర్‌పై తలెత్తిన ఉద్రిక్తతలను సడలించాలంటే దొడ్డిదారి దౌత్యయత్నాలను పాక్ చేపట్టాలని వీరు కోరినట్లుగా ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు, ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ, సైనిక దళాల అధిపతులతో ముస్లిం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశాలు అత్యంత గోప్యంగా జరిగాయనీ, అత్యున్నత స్థాయిగల అధికారులను మాత్రమే అనుమతించారని సమాచారం. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను సడలించేందుకు కొన్ని దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
మోదీపై విమర్శలొద్దు
పరిస్థితి శ్రుతి మించకుండా ఉండాలంటే ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఇమ్రాన్‌ఖాన్ విమర్శలు చేయడాన్ని కట్టిపెట్టాలని వీరు స్పష్టం చేశారు. అయితే ఈ అభ్యర్థనలను పాక్ తిరస్కరించిందని, భారత్‌తో నేరుగానే చర్యలు జరుపుతామే తప్ప, దొడ్డిదారిన జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు ఆంగ్ల పత్రిక వెల్లడించింది.
-చాణక్య