సబ్ ఫీచర్

నైషధమ్.. ఐతిహాసిక ప్రబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైషధమ్
ఐతిహాసిక నవల
రచన:
బ్రహ్మశ్రీ త్రోవగుంట
వేంకట సుబ్రహ్మణ్య పండితుడు,
వెల: రూ.230/-
ప్రతులకు
వివిధ పుస్తక విక్రయ కేంద్రాలలో..
*
ఐతిహాసిక నవల, చారిత్రక నవల - స్వరూప స్వభావాలల్లో సామ్యం ఉన్నా విశే్లషణాత్మకంగా రామాయణ భారతములపై ఆధారపడిన వాటిని ఐతిహాసికములు అంటారు. శాసనస్థ ఆధారాదులు కలవాటిని చారిత్రకములు అని వింగడించారు. ఇందులో వాడే భాషను శైలిని నిర్మాణాన్ని తక్కిన ప్రక్రియలకన్నా వేరుగా చూడవలసి ఉంటుంది. ఎపిక్ సింప్లిసిటీ అని ఆంగ్లంలో వాడిన పదాన్ని ఐతిహాసిక సారళ్యం అని ఆంధ్రీకరించుకోవచ్చు. దీనిని పాటించడం అనుకున్నంత సులభంకాదు. సాంఘిక వస్తువుకు చారిత్రక పరివేషంవేసి కత్తిడాలు పట్టిస్తే అది ఐతిహాసికం లేదా చారిత్రకం కాజాలదు. అంతేకాదు ప్రతీక వస్తువుగా మారటం మనం ప్రపంచ సాహిత్యంలో చూస్తూనే ఉన్నాము. అది ఇలియడ్‌కు రామాయణానికి నైషధానికి కూడా వర్తిసుంది. సావిత్రి- ఎ లెజెండ్ అండ్ ఎ సింబల్ అని అరవిందుడు అంత స్పష్టంగా చెప్పటం గమనార్హం. ఇదొక రహస్యము. రామాయణ రహస్యములు స్వర్ణహంస రచనల ద్వారా గుంటూరు శేషేంద్రశర్మ ఈ అంశాన్ని విప్పిచెప్పారు. శ్రీహర్షుడి హృదయం శ్రీనాధునికి అందలేదా? లేకుంటే శృంగార నైషధము అని ఎందుకు ప్రతిజ్ఞ??
నిజానికి భారతీయ అష్టాదశ పురాణగాథలన్నీ ప్రతీకాత్మకములే.. ఇది పాశ్చాత్యులకు తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు కాని భారతీయులు కూడా మరచిపోవటం బాధాకరమేకాదు ప్రమాదహేతువు అయింది. వైదేశిక శక్తులకు ఈ జాతీయ విస్మృతి ఆయుధంగా ఉపయోగపడింది.
ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు చర్చించుకోవలసి వచ్చిందంటే బ్రహ్మశ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్య పండితుడు నిషధ కావ్యాన్ని వచనంగా గద్యప్రబంధంగా రూపొందించాడు. ఐతిహాసిక నవలకు నవలా లాలిత్యం ఇందులో ఉంది. అది దమయంతీ స్వయంవరం. ఈ కథ మహాభారతాంతర్గత ఉపాఖ్యానము. నిషధ స్మరణము కలినాశకమని అనటంలోని అంతరార్ధమేమిటి? అంటే ఇందలి దమయంతి దమయంతి కాదు ఈమె ఆదిపరాశక్తి.
నైషధము ఆంధ్రభూమి దినపత్రికలో ధారావాహికంగా వెలువడింది. ఆ తర్వాత ఇందలి ప్రతీకాత్మకతను వివరించటంకోసం బ్రహ్మశ్రీ కుప్పా కృష్ణమూర్తిశాస్ర్తీగారి వ్యాఖ్యానం కూడా వివరణాత్మకంగా సంపాదకులు అందించారు. అంటే భారతీయ ఇతిహాసాలను ఎలా అధ్యయనం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నదని డిండితార్థం. త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్య పండితుడు లోగడ మహాభారత పదకోశ నిర్మాణంచేసి ప్రసిద్ధుడైనాడు. యాజ్ఞసేని-నైషధము వ్రాసి సుప్రసిద్ధుడైనాడు. ఇదొక మహాకార్యము. నాన్యతో సాధ్యము పాండవ శరణో అజ్ఞాతవాస శ్రమవలె ఈయన పదమూడు సంవత్సరములు పదకోశ తపస్సుచేశాడు. సుబ్రహ్మణ్యంగారిది పండిత వంశము. ఈతడు తెలంగాణా వాసి. రజాకార్ల యుగములో కష్టనష్టములను అనుభవించాడు. ఖాదీగ్రామోద్యోగిగా తేనెను అమ్మి మధువ్రతుడైనాడు. ఇందువలన ఆయనకు ఒక మధురోహ కలిగింది.
భారతాంతర్గత వస్తువులను గద్యకావ్యములుగా మార్చుకోవాలని ఆలోచించాడు. ద్రౌపది కథ ప్రథమము, దమయంతి కథ ద్వితీయము- రచనలో అద్వితీయము కథాకథనంలో ఈ రచయిత మూల త్రికరణం చేయలేదు. అనగా ఇది కాల్పనికము కాదు. బైరప్పవంటి దుర్విదగ్ధులు భారతాన్ని ఎలా భ్రష్టుపట్టించారో మనకు తెలుసు.
షకీల్ అహ్మద్ హిందీ రచయిత. ఎన్నోవందల గ్రంథాలకు ప్రథమ పాఠకుడు. ఎందుకంటే అతడు అక్షరశిల్పి కాబట్టి. ఆయన తన అభిప్రాయాన్ని సామాజిక కోణంలో అధ్యయనం చేసి ఆవిష్కరించాడు. నల దమయంతుల కథలోని అంతరార్థాలు ప్రతీకలు అలా ఉంచితే వర్తమాన మానవాళికి ఈ పౌరాణికం అందించే సందేశం ఏమిటి? అని ప్రశ్నించి సమాధానం ఇచ్చాడు. చీటికీమాటికీ కలహించుకొని విడాకులు తీసుకునే వర్తమాన పాశ్చాత్య సామాజిక వ్యవస్థ ఎక్కడ? అన్యోన్యంగా ఒకరినొకరు అంకితమై మమేకమై ఏటికి ఎదురీత నీదిన నలదమయంతులెక్కడ?
‘‘కాస్త విసుగు పుట్టగానే బట్టలు మార్చుకున్నంత సులభంగా తమ భాగస్వామిని మార్చుకొని అందరితోను సంతానాన్ని పొందుతూ ఆ సంతానానికి సరైన వారసత్వంకూడా ఇవ్వకుండా అస్తవ్యస్తంగా ఉన్న విదేశీ సంస్కృతికి పవిత్రమైన భారతీయ వివాహవ్యవస్థకూ ఎంతో తేడా ఉంది. అసలు ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతారు? అని పాశ్చాత్య ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉండగా నేడు మన యువత అదే పాశ్చాత్య సంస్కృతికి బానిసలయి విడాకులంటూ కోర్టుకెక్కుతున్న ఈ తరుణంలో నలదమయంతుల కథ మరోసారి యువత చదివితీరాలి. ప్రేమ- విరహం- పునఃసమాగమంలోని మధురిమలు కూడా వివాహ వ్యవస్థలోని అంతర్భాగాలేనని శ్రీ త్రోవగుంట సుబ్రహ్మణ్యంగారి రచన చెపుతున్నది’’ అంటూ దార్శనికంగా ప్రవచించాడు షకీల్ అహ్మద్. దీనిని పతాక శీర్షికవలె అట్టమీద అచ్చువేశారు.
త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యంగారు తన ముందుమాటలో కొన్ని విషయాలు వివరించారు. వివాహములో శ్రీనాధుని కావ్యం ముగియటానికి కారణం అనంతర కష్టములను వర్ణించటం ఆయనకు ఇష్టం లేకపోవటమే అన్నారు. నలుని కర్కోటకుడు కరుచుట పక్షులుపై ఉత్తరీయమును ఎత్తుకొనిపోవుట నలుడు అజ్ఞాతంగా సార్ధవాహులతో కలిసి దమయంతి స్వయంవరానికి చేరుట వంటి అంశాలేవీ శ్రీనాధుడు స్పృశించక పోవడానికి కారణం ఏమిటి?? నలచరిత్ర చదివినా విన్నా వ్రాసినా కలి నాశనవౌతుందనే వాడుకకు కారణం ఏమిటి?? నలుని హంస సాక్షాత్తూ శివుడే. అనగా ఇది శివదౌత్యము. తర్వాతి కాలములోని శుచి ముణివంటి పాత్రలకు ఈ దౌత్యమే స్ఫూర్తి.
త్రోవగుంటవారు మరొక అంశం కూడా ఉదాహరించారు. పాతాళము, పుష్కరశాక క్రౌంచాది ద్వీపముల ప్రసక్తితో ఆనాటి భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తమైనదని సూచించారు. నిజమే! షట్ చక్రవర్తులు కేవలం భారతదేశాన్ని భరత ఖండాన్ని(ఆసియా) మాత్రమే కాక మొత్తం ప్రపంచాన్ని పాలించారు. వాగ్దేవి వివిధ రాజన్వులను దమయంతికి పరిచయం చేస్తున్న సన్నివేశంలో మూలములోని కథాకథన కవితా వైభవాన్ని త్రోవగుంటవారు ఎలా ఆవిష్కరించారో చూడండి. ‘‘ఓ దమయంతీ! ఇతని వదన కమలమునకు నడుమ మిచ్చగల చంద్రుడు సాటిరాడు- .... (92 పుట.) ‘‘ఓ పంకజ నేత్రా! ఇతడు(గౌడ దేశాధిపతి) పండిత శ్రేష్టుడు- కీర్తిచేత చంద్రుని కిరణముల తృణీకరింపబడినందున, గడ్డిపోచలుగా చేయబడినందున ఆ తృణమును (గడ్డిని)మేయుటకు జింక చంద్రునిలో చేరినది’’ (పుట 91)
ఎంత చక్కని కల్పన! నిజానికి ఇలాంటి కవితా చమత్కారాలన్నీ శ్రీనాధునివి. అందుకే సందర్భోచితంగా త్రోవగుంటవారు వాటిని యధాతథంగా స్వీకరించి ఈ వచనకార్యంలో నిక్షిప్తం చేశారు. ఇక్కడ మనం గమనింపవలసిన చరిత్రకాంశం ఏమిటంటే పాండ్య ఉల్కల, ఉజ్జయినీ నేపాల మధురాది వివిధ రాజన్యాల జాబితా ఇవ్వబడింది- అంటే ఆనాటి (శ్రీహర్షుని నాటి) రాజకీయ చరిత్రను పరిశోధించడానికి కొంత తోడ్పడుతుంది.
ఉత్కల అంటే నేటి ఒరిస్సా-విశాల అంటే ఉజ్జయిని. పాండ్యము ద్రవిడము నేపాలము నేటి నేపాలమే. మధుర, బృందావన రాజ్యము, క్రౌంచ పక్షుల నిలయము క్రౌంచ ద్వీపము కావచ్చు. దమయంతి చరిత్ర ద్రౌపది చరిత్ర వ్రాయాలనే కోరిక ఎనుబది సంవత్సరాల వయస్సులో త్రోవగుంటవారు సమాజానికి ఏదో త్రోవచూపాలని సంకల్పించారని అర్థం. నలదమయంతుల కథకు ఎన్నో భాష్యాలున్నాయి. ఆదర్శ భారతీయ వైవాహిక బంధం ఒక భాష్యం. ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫలసిద్ధి మరొక ఆదర్శం. శ్రీ విద్యోపాసన అంతరార్ధం ఆదర్శ రాజ్యపాలన మరొక భాష్యం. ప్రాచీన భారతదేశ చరిత్రను చారిత్రక కోణంలో అధ్యయనం చేయటం ఇంకొక పరమార్ధం. కవితా వైభవం సరేసరి. ఇలా ‘్ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని వేదాంత విధులు వేదాంత మనియు భావించిన పంచమ వేదసారం నలోపాఖ్యానం’ అని పరిశోధకుల భావన.
‘‘్ధర్మార్థ కామమోక్షపు మర్మార్ధము తెలిపి ప్రేమపథమునసాగే కర్మానుబంధ సరళికి నర్మదవౌ జీవితంపు సందేశమిదే అని బ్రహ్మశ్రీ ముళ్లపూడి సదాశివశర్మ చిన్నకంద పద్యంలో చేసిన వ్యాఖ్యానం సమగ్రంగా ఉంది. బ్రహ్మశ్రీ కుప్పా వెంకట కృష్ణశాస్ర్తీ అవదూత దత్తపీఠ విద్యాధికారి ప్రామాణికమైన పీఠికను అందిస్తూ నలచరిత్రలోని అంతరార్ధాలను ప్రతీకలను వివరించారు.
‘‘మాలాగా కష్టపడ్డవారెవరైనా ఉన్నారా? అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానమే అరణ్యపర్వములోని నలచరిత్ర. కష్ట సహిష్ణుత జీవితంలో అంతర్భాగం అని భారతీయ సంస్కృతి మనకు ఉగ్గుపాలతో నేర్పింది. ఆ ఒరవడి ఆ సరవడి ఈ నవలలో మనకు సుబ్రహ్మణ్య పండితుడు అందించాడు. ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డిగారు ఈ గ్రంథాన్ని ప్రశంసిస్తూ అందించిన అభిప్రాయంలో అతిశయోక్తిలేదు. ఇది పద్యకావ్యంకాదు. నవల కాబట్టి మాన్యులూ సామాన్యులూ కూడా చదువుకొని ఆనందించి ఆస్వాదించి ధర్మమార్గాన్ని ఆచరింపవచ్చు.

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌