సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది శక్తి
అష్టశక్తులతో కూడిన తత్త్వమునే దివ్యమైనటువంటి ‘ఆదిశక్తి’అన్నారు. దానినే శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అన్నారు. ఈ విధమైన శక్తులతో కూడినటువంటి స్ర్తి అనే పదములో మూడు అక్షరములుంటున్నాయి. ‘స’కా, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘స’కారమనగా సత్కామమనే సాత్విక గుణము వారిలో ఆవిర్భవిస్తుంది. అదియే సాలోక్య సారూప్య ‘సాయి’జ్యములు. దీనిలో దివ్యత్వాన్ని నిరూపించేటటువంటిదే ఈ ‘స’కారము. స్ర్తిలయందు సహజంగా సాత్వికము ప్రప్రథమంలో ఉంటుంది. తదుపరి ‘త’కారమనే తమోగుణము అందులో ప్రవేశిస్తుంది. తమోగుణమంటే సోమరితనం కాదు. సిగ్గు, బిడియం, గౌరవం, మర్యాద, వినయము ఇలాంటివి కూడనూ తమోగుణమని చెప్పవచ్చును. అందువలననే ఇంటియొక్క గౌరవాన్ని కాపాడటానికోసం, నిలబెట్టటానికోసం స్ర్తి అణిగి, మణిగి, లొంగి ఉంటుంది. అదియే తమోగుణముయొక్క తత్త్వము. మూడవ అక్షరము ‘ర’కారము. ఇది రజోగుణ సంబంధము. రజోగుణమంటే పోట్లాడటం వగయిరాలు కాదు. అవసరమైనప్పుడు ప్రాణమునైనా త్యాగంచేస్తారు స్ర్తిలు. గౌరవమర్యాదల నిమిత్తమై ప్రాణాలనైనా అర్పిస్తారు స్ర్తిలు. ఏమాత్రం వెనుకాడరు. చరిత్రను పరికిస్తే ఎంతోమంది స్ర్తిలు వీరత్వాన్ని ప్రదర్శించి వీరనారీమణులుగా చరిత్ర ప్రసిద్ధులైనవారు ఉన్నారు. సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై, సర్వస్వమునూ త్యాగంచేసే లక్షణమే ‘రజోగుణము’ కనుక సత్వరజస్తమోగుణముల స్వరూపమే ‘స్ర్తి’. ఇట్టి పవిత్రమైన అర్ధవంతమైన గుణములతో కూడిన స్ర్తిని ఈనాడు కేవలం అబల అని భావిస్తున్నారు. ఎంత దురదృష్టం!
యత్ర నార్యస్తు పూజ్యంతే...
ఎక్కడ స్ర్తిలు గౌరవించబడుతారో, పూజించబడుతారో, అక్కడనే దైవత్వం ఆవిర్భవిస్తుందంటారు. కాని ఈనాడు దురదృష్టవశాత్తు స్ర్తిలను గౌరవించడం అవమానంగా భావిస్తున్నారు. ఇది అజ్ఞానమునకు ప్రథమ లక్షణం. స్ర్తి గృహలక్ష్మి, ధర్మపత్ని. ఇల్లాలు, అర్ధాంగి. స్ర్తి లేని గృహము అడవితో సమానం. ఇంటికి దీపం ఇల్లాలు అనే విషయం విస్మరించరాదు. కనుక అట్టి స్ర్తిని గౌరవించటం, ఆమెకు తగిన స్థానమును కల్పించటం ఆమె కంటి ధారలు కార్చకుండా చూడటం పురుషుల కర్తవ్యం. ఏ ఇంటియందు స్ర్తి కంటి ధారలు కార్చునో, ఆ ఇంటి స్థితి అధోగతే అవుతుంది. కనుక సాధ్యమైనంతవరకు స్ర్తిలను గౌరవించి, వారిని సంతోషపెట్టటం పురుషుల బాధ్యత.
కలకంఠి కంట...
‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నుండనొల్లదు’ -అని పెద్దలు చెప్పారు. శ్రీరామకృష్ణ పరమహంస తన భార్యను ఆట పట్టించేటప్పుడు కూడా హాస్యం ముదురుపాకాన పడి ఆమె నొచ్చుకొని కంట తడిపెట్టే దాకా తీసుకొని పోకుండా జాగ్రత్తపడేవారు.
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.