సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ఆస్తి మీరే
ఈ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించాలి. అసంఖ్యాకంగా పూలు పూయాలి. ప్రపంచమంతటా శాంతి, సంతోష సౌరభాలను వెదజల్లాలి. దీనికి విద్యార్థులేం చేయాలి? చెట్టుకు వేర్లు ఆహారాన్ని అందించినట్లు. స్థైర్యాన్నీ, బలాన్ని అందించి పోషించాలి. బతికించాలి. వేర్లకు నీరు పెడితేనే యిది జరుగుతుందని నాకు తెలుసు. విద్యార్థులే నా సర్వస్వం. ‘మీ ఆస్థి ఏమిటి?’ అని నన్నడిగితే ‘ఈ భవనాలు, ఈ పొలాలు’ అంటాననుకుంటారు కొందరు. కాని అది తప్పు. నా యావదాస్తి విద్యార్థులే! వారికి నన్నునేను అర్పించుకొన్నాను. వారిలో ఎందరికో ఈ సంగతి తెలియదు. ఈ ప్రేమతత్వాన్ని. ఈ సత్యాన్ని, ఈ సహస్రాధిక మాతల ప్రేమను కొందరు దురదృష్టవంతులు గ్రహించలేకుండా వున్నారు.
పెద్దలనుబట్టే పిల్లలు
తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకొంటారు. వాళ్లముందు పెద్దలు అబద్ధాలు చెప్పటం, దురుసుగా ప్రవర్తించటం, తాగటం, తందనా లాడటం చేస్తుంటే వారికీ అవే అలవడతాయి. ఏగూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. ఇళ్లల్లో యిలాటి వాతావరణం నెలకొని వుంటే, పిల్లలు మన సనాతన సంస్కృతీ సౌరభాలను వెదజల్లే పుష్పాలుగా వికసించటం ఎలా?
పిల్లలముందు తండ్రియే సిగరెట్లు త్రాగుతుంటే, పిల్లలు ఏ విధంగా ఊరుకుంటారు? వారు కూడా మర్నాటినుంచి ప్రారంభిస్తారు. తండ్రి జేబులోని సిగరెట్లనే సంగ్రహించి కాల్చటం ప్రారంభిస్తారు.
తండ్రి చూచి ‘తప్పురా!’అంటే ‘నీవు కాలిస్తే తప్పులేదు కాని నేను కాలిస్తే తప్పా’అని బిగ్గరగా అనకపోయినా, లోపలనైనా అనుకుంటారు. దురదృష్టవశాత్తు ఈనాడు పిల్లలచేత బుద్ధిచెప్పించుకొనే తండ్రులు తయారవుతున్నారు.
ఆచరిస్తేనే ఆచార్య
ప్రాచీన కాలంలో గురువులు ఆచరించి శిష్యులకు విద్యలు బోధించేవారు. అట్టి ఆచరణలో బోధించేటటువంటి గురువులు కనుకనే వారికి ‘ఆచార్య’అని పేరు వచ్చింది.
గురుర్విష్ణుః
శీలం లేని బ్రతుకేం బ్రతుకు? దీపం పెట్టని గుడిలాగా వుంటుంది. దారం తెగిన గాలిపటం వంటిది. ఎంతసేపూ జీతాల సంగతి చూసుకొనే టీచరు. ఏం టీచరు? ఉద్యోగపు ఆశతో చదివే విద్యార్థి ఏం విద్యార్థి? విద్యార్థిలో సహజంగా వుండే ప్రతిభను వెలికితీసి వికసింపజేయవలసినదీ. తన శిష్యుడు ప్రతిభా విశేషాలతో ఉన్నత స్థానాన్ని అందుకొనేలా చేయవలసిందీ ఉపాధ్యాయుడే. అటు ఉపాధ్యాయునిలోనూ, యిటు విద్యార్థిలోనూ ఉన్నది దైవత్వమే!
దాపరికం
ఒక గురువు తన శిష్యులను పిలిచి, ‘మీకందరికీ తీయని ప్రసాదం ఇస్తున్నాను. చీమలు, దోమలు, ఎలుక, పిల్లి మొదలయినవి ఏవీ దానిని తినకుండా దాచిపెట్టండి’ అన్నారట. అందరూ ఎక్కడెక్కడో దాచిపెడితే ఒక అబ్బాయి మాత్రం ఆ ప్రసాదాన్ని తన పొట్టలో వేసుకున్నాడు. జీర్ణం చేసుకున్నాడు. అట్లనే, గురూపదేశమనే మధుర ప్రసాదమును హృదయంలో దాచి, జీర్ణంచేసుకొని, ఆధ్యాత్మిక పుష్టిని పొందాలి.
సత్యసాయి కళాశాల
శ్రీ సత్యసాయి కళాశాలను ఎందుకు స్థాపించాము? డబ్బుకోసమా? కాదే! ప్రచారంకోసమా? కాదే! విద్యావేత్తలకూ, మానవ కళ్యాణాన్ని కోరే వారికి స్ఫూర్తినివ్వటానికి ఆ కళాశాలను స్థాపించాము. ఆదర్శప్రాయం కావాలన్నదే లక్ష్యం.
కొంతమంది ‘కళాశాల విద్య దండగ’అంటారు! ‘ఉద్యోగాలు దొరుకుతాయా?’అనడుగుతారు. ‘అసలీ కళాశాల ఎందుకు?’ అంటారు. భావిభారత పౌరుల మనసులలో మాధుర్యం నింపటానికే ఈ కళాశాలను స్థాపించింది. భగవంతుని పట్ల విశ్వాసాన్నీ వివేకాన్నీ, వినయాన్నీ వారిలో కలిగించేందుకే ఈ కళాశాలను స్థాపించింది. సత్యం దిశగా, సచ్ఛీలం దిశగా వారు నడిచే త్రోవను ప్రకాశమానం చేసేందుకే ఈ కళాశాల!

ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.