సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యా? అవిద్యా?
ఈరోజు విద్యార్థిలోకం గందరగోళంలో పడింది. పిల్లలు నీటుగా తెల్లటి బట్టలయితే వేసుకుంటున్నారుగాని కొందరి మనసులు మాసే వున్నాయి. వినేదేమో వాళ్ళనీ వీళ్ళనీ భాగోతాలు, చూసేదేమో దొంగ చూపులు; చేసేదేమో ఎవర్ని ఎట్లా బురిడీకొట్టిద్దామా అన్న ఆలోచన-ఇటువంటిచోట సరస్వతీదేవి నిలుస్తుందా? చదువు సాగుతుందా? ఏ జన్మలో చేసుకున్నదో రుూ జన్మలో యిలా తగుల్తోంది.
జననీ జన్మభూమిశ్చ...
ప్రతివ్యక్తి తన తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగే ప్రతి పౌరుడూ తన దేశ చరిత్రను తెలుసుకోవాలి. తన జాతి సంస్కృతిని వంటబట్టించుకోవాలి. చరిత్ర, సంస్కృతి-యివే జాతికి తల్లీ, తండ్రి. తన దేశచరిత్రనూ, జాతి సంస్కృతినీ తెలుసుకోనివాడు తన తల్లెవరో, తండ్రెవరలో ఎరుగని శుంఠ!
విదేశీ సంస్కృతి
భారతీయ సంస్కృతి అంటే చులకన భావం. పాశ్చాత్య సంస్కృతి అంటే మోజు ఎందుకు కలుగుతున్నాయి? వాటి వౌలిక లక్షణాలపట్ల వుండే అజ్ఞానంవల్లనే ఆ పరిస్థితి కలుగుతూ వున్నది. పోనీ, పాశ్చాత్య సంస్కృతీ విలువలకన్నా పూర్తిగా జీర్ణం చేసుకోగలుగుతున్నారా అంటే అదీలేదు. పైపైమెరుగుల వరకే మన దృష్టిపోతోంది. తన సంస్కృతేమిటో తన వారసత్వమేమిటో ఎరుగనివాడు మరొకరి సంస్కృతి గురించి ఏం అర్థం చేకోగలుగుతాడు?
విద్యావంతుల కర్తవ్యం
విద్యవలన వివేకం కలగాలి. మంచి శీలం పెంపొందాలి.
విద్యార్జన తేలిక కాదు. అందుకు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని ఏకాగ్రతతో కృషిచేయాల్సి వుంటుంది. కాని ప్రస్తుత విద్యావిధానం విద్యార్థులను ఇంద్రియాలకు బానిసలను చేసేదిగా వుంది. ఈ బానిసత్వం నుంచి బయటపడటం ఎలాగో తెలియక అసూయ, లోభం, అహంకారాలలో మునిగి, అదో గొప్పగా భావిస్తున్నారు. విద్యావంతునినుండి ఈ దేశం ఆశిస్తున్నది ఏమిటి? ఇంటింటా విజ్ఞాన జ్యోతిని అతడు వెలిగిస్తాడని. నీతి నిజాయితీలతో కృషిచేసి, అతడు ఇతరులకు ఆదర్శప్రాయుడు అవుతాడని. అది జరుగుతోందా?
విద్వాంసుడు
అరిషడ్వర్గాలను జయించ లేనివాడు విద్వాంసుడు అనబడడు. ఆత్మశుద్ధి లేనిదే బాహ్య వికాసం మాత్రం ఎలా సంభవం? పుస్తకాల నుంచి పొందిన విజ్ఞానాన్ని అనుభూతి పూర్వకంగా ధృవపరచుకోవద్దా? ప్రస్తుత విద్యావిధానంలో రుూ లక్షణం బొత్తిగా గోచరించదు. మానవునిలో దివ్య చైతన్యాన్ని మేలుకొలిపే వూసే ఆ విధానంలో లేదు.
నవయుగ వైతాళికులు
శ్రద్ధగా చెప్పాలేగాని పిల్లలు నేర్చుకోలేనిదంటూ వుండదు. సరయిన శిక్షణ వుంటే చాలు- వాళ్లు మంచి శీలం పెంపొందించుకుంటారు. తమతమ పనులు చేసుకోడంలో మంచి నైపుణ్యం సంపాదించుకుంటారు. ఉన్నతాదర్శాలను పుణికిపుచ్చుకుంటారు. ‘మన విధానం మంచిది. దీనివల్ల శాంతి, ఆనందం, కలుగుతాయి’-అని చాటటానికే నేను విద్యార్థులను నా సాధనాలుగా మలచుకున్నాను. వారి ఆనందమే నా ఆనందం, నా ఆహారం! నేను కోరే నూతన సమాజాన్ని ఆవిష్కరించటానికి ముందు నడిచేది వారే!
పరమాత్మే గురువు
గురువు అనగానే ఎవరో వ్యక్తే కానక్కరలేదు. ప్రకృతి అంతా మనకు గురువే.
‘గు’ అంటే గుణాతీతుడు. ‘రు’అంటే రూప రహితుడు. ఈ దృష్టితో చూస్తే పరమాత్మే నీ గురువు!
విషయార్థి
వేదతత్వంపై నిర్మించబడిన భారతీయ సంస్కృతిని గురించి అందరూ తెలుసుకోవాలి.
ప్రస్తుతం భారతదేశంలో యువత తీవ్ర అశాంతి నెదుర్కొంటున్నది. అర్థం పర్థంలేని కార్యక్రమాలకెగబడుతున్నది. సాధించేదేమీలేకపోయినా కొందరిలో గప్పాలక్కొదవ లేదు. విద్యార్థికి తానేం నేర్చుకోవాలో తెలియటల్లేదు. పేరుకే ‘విద్యార్థి’కానీ వాస్తవానికి ‘విషయార్థి’?

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది