సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి శిక్షణ
బడికి పంపటం ఎందుకు? పిల్లలను మానవులుగా మార్చేందుకు. మనిషి తన పూర్తిస్థాయికి ఎదగాలంటే అతనిలో నిద్రాణంగావున్న కొన్ని శక్తులను చక్కగా తీర్చిదిద్దాలి. వాటిని అలాగే వదిలేస్తే, ఉపేక్ష చేస్తే, మనిషి జంతుస్థాయిలోనే మిగిలిపోతాడు. తన వారసత్వాన్ని నిలబెట్టుకొనేలా చేయాలంటే మనిషికి క్రమశిక్షణ అవసరం.
బళ్లో చక్కని క్రమశిక్షణ వుందా? అది ముఖ్యం. క్రమశిక్షణ లేకపోతే, స్వార్థపరులు పిల్లలను పక్కదారులు పట్టిస్తుంటే ఆ తప్పెవరిది? తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, సమాజంలోని పెద్దలది. పాఠశాల యాజమాన్యానిది. ప్రతి పాఠశాలకి ఒక కమిటీ వుంటుంది? కాని పాఠశాల ‘కమిటీ’తరచుగా ‘కం-్ఫర్-టీ’గా తయారవుతూ వుంటుంది.
పవిత్ర కర్తవ్యం
విద్యార్థియైనవాడు వేకువనే బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి తన చదువులో తాను నిమగ్నంకావాలి. తెల్లవారకముందు 4,5 గంటల మధ్య స్నానమాచరించిన - అది ఋషి స్నానమని చెప్పింది భాగవతము. 5,6గంటల మధ్య ఆచరించిన స్నానానికి మానవ స్నానమని పేరు. ఏడుగంటల తరువాత ఆచరించిన స్నానమును రాక్షస స్నానమన్నారు. ఎందుకనగా, అతడు దివ్యమైన బ్రహ్మముహూర్త కాలమును అపవిత్రం చేస్తున్నాడు కాబట్టి.
గురుకులం
ఈ ప్రపంచమే ఒక సద్గురువు. నీకు మార్గదర్శి. స్ఫూర్తిదాయని నీ చుట్టూ లోకం వున్నది అందుకే. పశుపక్ష్యాదులూ, చెట్టూచేమా, కొండా, గుట్టా, గ్రహాలూ, తారకలూ-ఆఖరుకు ఒక చిన్న పురుగైనాసరే, నీకెంతో నేర్పగలదు. నేర్చుకోవాలన్న తపన. జ్ఞానతృష్ణ నీకుండాలి. అలాటి దీక్ష, జ్ఞాన పిపాస నీలోవుంటే ఈ విశ్వం నీకొక విశ్వవిద్యాలయం కాగలదు. నీవు పుట్టిన దగ్గరనుండి గిట్టేదాకా వుండి చదువుకొనే ‘గురుకులం’ అది!
విద్య అంటే...?
విద్య అంటే ఏమిటి? విద్య కేవలం భుక్తి సంపాదనకోసమే అని చాలామంది అనుకుంటారు. కాని నిజంగా ఆలోచిస్తే ఏది మనలను విముక్తిచేస్తుందో అదే నిజమైన విద్య. అంతేకాని ఏమిటి ఈ చదువు? చదువులన్నీ చదివి చాల వివేకియై మదిని తనె్నరుగడు మందమతుడు
ఎంత చదువు చదివి ఏ రీతి నున్నను
హీనుడవగుణంబు మానలేడు.
ఈ చదువులవల్ల శాంతి రాదు. ఈ లౌకికమైన చదువులతోపాటు నైతిక చదువుకూడా వుండాలి. ఆధ్యాత్మిక విద్య వుండాలి.
కాని రుూనాడు ఏం జరుగుతోంది? విద్యయొక్క ఆదర్శములు అడుగంటి పోయినవి. గౌరవమర్యాదలు మంటకలిసినవి. సరస్వతీ పర్ణశాలయైన విద్యారంగంలో ఈనాడు లక్ష్మి ప్రవేశించింది. కనుక ప్రతి విద్యార్థి కూడనూ అధిక ధనమును సంపాదించాలని, ఏ మార్గములోనైన తాను గొప్ప శ్రీమంతుడు కావాలనే కోరికను ఎంచుకుంటున్నాడు. త్యాగము, సౌశీల్యము, నీతి, నిజాయితీ ఉండవలసినటువంటి ఈ విద్యారంగమునందు ఈనాడు వీటికి ఏమాత్రం స్థానంలేకుండాపోయింది. ప్రతి విద్యార్థి కలిమిని, చెలిమిని, బలమును పెంపొందించుకొనుటకే ప్రయత్నిస్తున్నాడు కాని, గుణమును పెంపొందించుకొనుటకు ఏమాత్రం కృషిచేయటం లేదు. గుణము లేని కలిమి, గుణము లేని చెలిమి, గుణము లేని బలము నిరుపయోగము విద్యార్థికి గుణమే ప్రధానము.
ఈనాడు విద్యార్థులు పట్టాచేతిలో అందుకున్న తక్షణమే విదేశాలకు పోవటమో లేక ఏవో గొప్ప ఉద్యోగాలకోసం పరుగులు పెట్టటమో చేస్తున్నారు. మన దేశంలోని పల్లెల అభివృద్ధిని ఈనాడు విద్యార్థులు చేపట్టాలి. ఇవియే మన ప్రాచీనులు అందించిన నైతిక విలువలు.
నదీనాం సాగరో గతిః
విద్యార్థులలో కొందరు సైన్సు సబ్జెక్టులు చదువుతారు. కొందరు ఆర్ట్స్ చదువుతారు. ఇవన్నీ నదుల వంటివి. ఆధ్యాత్మిక విద్య సముద్రం లాంటిది. చివరకు ఈ నదులన్నీ సముద్రంలోనే కలవాలి. అలాగే అన్ని రకాల విద్యలూ ఆధ్యాత్మికత్వానికే దారితీయాలి.
నదులు సముద్రం వైపుపోతూ పొంగి ఇరుప్రక్కలా వుండే గ్రామాలను ముంచివేయకుండా రెండువైపులా గట్లు వుండాలి.
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది