సబ్ ఫీచర్

సౌందర్యానికి ప్రతీక కమలాపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిల సౌందర్యానికి ప్రతీగా నిలుస్తుంది కమలాపండు. తాజా కమలాపండ్లలో పోషక విలువలు చాలా వున్నాయి. మన గుండెకు ఎంతో మేలు చేసే గుణం కమలాఫలంలో ఎన్నో దాగివున్నాయి.
ఇందులో వున్న హెస్పెరిడిన్, నారింజన్ అనే రెండు పదార్థాలు గుండెకు అదనపు పరిరక్షణనిస్తాయి. ఇవి రెండు పండు పైభాగంలో లోపల తొక్క భాగంలో వుంటాయి.
సౌందర్య సాధనాలు అయిన సబ్బులలో ఉపయోగించడం వలన కమలాపండు సౌరభాలు గుబాళిస్తాయి.
సూర్యకిరణాలనుండి కలిగే నష్టాల్ని కమలాలు పూర్తింగా అడ్డుకోగలవు. కమలాపండులో విటమిన్ సితో బాటు పీచు పదార్థం స్కిన్ క్యాన్సర్ నుంచి రక్షించే గుణాలు అధికంగా వున్నాయి.విటమిన్ సి ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుని కణాలను పరిరక్షించగలవు.
శరీరంపై వున్న ముడతలు, గీతలు వంటివి వృద్ధాప్య లక్షణాల్ని నిరోధించే గుణం వుంది. రోజూ రెండు కమలాపండ్లు తింటే చాలు ఆరోగ్యం చురుకుగా వుంటుంది. శరీర కాంతి నిగనిగలాడుతూ వుంటుంది.
ఎండిన దీని తొక్కలు పొడిచేసి సున్నిపిండిలో కలిపి స్నానం చేస్తే తాజాదనంతో నిగనిగలాడుతుంది. శరీర కాంతి కొలెస్టరాల్ నిరోధించే శక్తి కమలా ఫలానికుంది. చిన్న పిల్లలకు సైతం రోజూ వీటిని తినిపిస్తే ఎంతో మంచిది. చౌకగా లభించే ఈ పండు వల్ల జలుబు చేస్తుందని భయపడతారు. అన్ని విధాలా ఆరోగ్యకరమైన ఫలం, అన్ని కాలాలలోను మనకు లభిస్తుంది.
కమలాల్లోని బెటాక్రిష్టోక్యాన్‌థిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాసకోశానికి చాలావరకూ మేలు చేస్తాయి. శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు దురదలు వున్న చోట తాజా కమలాఫలం తొక్కల్ని రాస్తే నయం కాగలవు.

- ఎల్.ప్రపుల్లచంద్ర