సబ్ ఫీచర్

జాతి ఐక్యతకు ప్రతీక.. ‘మందిర ఉద్యమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలోని ‘రామజన్మభూమి వివాదం’పై సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ వార్త వెలువడ్డాక అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు అనుమానిస్తున్నట్లు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ క్రైస్తవ మతానికి చెందినంత మాత్రాన ఆయన సమాజ హితాన్ని విస్మరిస్తున్నారని భావించలేము. గతంలో అప్పటి సుప్రీం కోర్టు జడ్జికి వ్యతిరేకంగా, న్యాయవ్యవస్థ సంప్రదాయానికి విరుద్ధంగా రోడ్డుపైకి వచ్చి కూర్చొని, పత్రికల్లోకెక్కి నానా రభస చేసి అప్పటి తీర్పును ప్రభావితం చేసిన వ్యక్తుల సమూహంలో ఇతడే నాయకుడు అనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో- ‘చూద్దాం ఏం జరగబోతుందో..?’ అంటూ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఏ కారణం వల్ల అయినా తీర్పు ఆలస్యమైనా, వ్యతిరేకంగా వచ్చినా- రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హిందువులు కోరుతున్నారు. హిందూ సమాజానికి తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా గతంలో ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న భూమిని రామజన్మభూమి న్యాస్‌కు తిరిగి ఇవ్వాలి. దీని కోసం అవసరమైతే పార్లమెంటులో చట్టంచేయాలి. భూమి స్వాధీనం విషయంలో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం కొన్ని తిరకాసులు పెట్టింది. అవన్నీ సరిచేయడానికి మరికొంత సమయం పడుతుంది. తొందరలోనే తీర్పు వెలువడి మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని హిందువులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
‘రామజన్మభూమి ఉద్యమం అంటే మసీదును పడగొట్టడం.. ఆ స్థానంలో గుడి కట్టడం.. అందుకు హిందువులను రెచ్చగొట్టడం.. దేశంలో గొడవలు సృష్టించడం.. తమవారు కానివాళ్లను హత్యలు చేయడం.. అన్య మతస్థులను ఈ దేశం నుంచి వెళ్లగొట్టడం..’- అంటూ దేశ వ్యతిరేక శక్తుల చేతిలో ప్రభావితులైన అనేకమంది దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ‘మెకాలే మానస పుత్రులే’ రామజన్మభూమి ఉద్యమ చైతన్యానికి చెడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రామజన్మభూమి ఉద్యమం ద్వారా దేశానికి జరిగిన మేలు ఏమిటి? అని ఒకసారి అవలోకిస్తే అనేక విజయాలు, మరెన్నో విషయాలు మనకు కనిపిస్తాయి.
రామజన్మభూమి ఉద్యమం ద్వారా దేశానికి కీడు జరిగిందా? లేక మేలు జరిగిందా? వందల సంవత్సరాలుగా అణచివేతకు గురై, దోపిడీలకు లోనే, చీలికలు పేలికలుగా విడిపోయిన హిందూ సమాజం రామజన్మభూమి ఆందోళనతో ఐకమత్యం అయింది. రామజన్మభూమి ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో హిందూ సమాజం చైతన్యాన్ని చూసి ఓర్చుకోలేని శత్రుదేశాల దుష్ప్రచారానికి తోడుగా- కొన్ని మతవర్గాలు, రాజకీయ నాయకులు పనిగట్టుకొని దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో సంభవించిన కీడు అపారమైనదే. ఇలా భారతదేశానికి, హిందూ సమాజానికి కీడుతలపెట్టడం ఈ వర్గాలకు మొదటిసారి కాదు. 712వ సంవత్సరంలో మీర్‌ఖాసీం ఆక్రమణల నుండి కొనసాగింపుగానే ఇదంతా జరిగింది.
రామజన్మభూమి ఆందోళన ఫలితంగా దేశంలో సామాజిక సద్భావనకు తార్కాణంగా గొప్ప మార్పు సంభవించింది. రామజన్మభూమి మం దిర నిర్మాణానికి శంకుస్థాపన ఎవరో శంకరాచార్యులు లేదా వైష్ణవ స్వాములు లేదా రాజకీయ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు జరపలేదు. తరతరాలుగా అణచివేతకు గురైన అనుసూచిత సమూహానికి చెందిన ప్రతినిధిగా బిహార్‌కు చెందిన శ్రీకామేశ్వర్ చౌపాల్ అనే ఒక సాధారణ వ్యక్తి శంకుస్థాపన చేశాడు. ఇది భారతదేశం మారుతున్నదని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. తరతరాల బానిసత్వపు సంకెళ్లు ఛేదించుకొని హిందూ జాతి మేల్కొన్నది. స్వదేశీ భావనతో స్వాభిమానపు ఆలోచనతో పురోగమిస్తున్నదని సగర్వంగా ప్రపంచానికి తెలియజేసింది. రామజన్మభూమి ఉద్యమంలో స్వాతంత్య్ర సమరం నాటి కన్నా ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా కనిపించింది. కోట్లాది మంది ప్రజలు పాల్గొన్న ఇలాంటి అరుదైన శాంతియుత ఉద్యమం ప్రపంచంలో ఏ దేశంలోనూ రాలేదు. ఉద్యమంలో పాల్గొన్నవారేకాక ఉద్యమపు ప్రభావానికి లోనైనవారి సంఖ్య అనేకానేక రెట్లుగా ఉంది. దశాబ్దాలుగా జరిగిన రామజన్మభూమి విముక్తి ఆందోళన ధార్మిక, సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ రంగాలను కూడా ప్రభావితం చేసింది.
ఒకప్పుడు హిందూ జాతి ప్రపంచానికి మార్గదర్శనం చేసింది. మనిషి మనిషిగా బతకడం ఎలాగో నేర్పించింది. మానవత్వపు పరిమళాలను వెదజల్లింది. విశ్వగురువుగా వెలుగొందింది. ఇప్పుడు మళ్లీ రామజన్మభూమి ఆందోళన పుణ్యమాని వచ్చిన చైతన్యం ద్వారా హిందూ జాతి మళ్లీ అదే పనిలో నిమగ్నమైంది.
వైజ్ఞానిక రంగం: గతంలో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్నా విదేశాలకు వెళ్లి పంపిస్తూ ఉండే భారతదేశం రామజన్మభూమి ఆందోళనతో సంభవించిన స్వాభిమానపు తరంగాల ప్రభావపు స్పర్శ వైజ్ఞానిక రంగానికి కూడా తగిలింది. ఎంతగానంటే.. ఒక్క రాకెట్టుతో వందలకొలదీ ఉపగ్రహాలను ఆకాశంలో పంపగలిగేంతగా. చంద్రమండలంపైకి వెళ్ళగలిగే అంతగా పట్టుదలను రేకెత్తించింది.
సామాజిక రంగం: గతంలో సామాజికంగా అణచివేయబడిన వర్గాల ప్రతినిధులే రాష్టప్రతి, ప్రధానులుగా బాధ్యతలు చేపట్టి సామాజిక న్యాయం అందిపుచ్చుకుని దేశానికి నాయకత్వం వహించారు. సామాజిక అంతరాలను దూరం చేసుకుని ‘మనమంతా హిందువులం, బంధువులం భరతమాత బిడ్డలం’ అనే సందేశానికి బద్ధులై దేశ ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దారిచూపింది. సామాజిక జీవనాన్ని మలుపుతిప్పి సామాజిక ఐక్యత ద్వారా భారత్ ఉన్నత శిఖరాల అధిరోహణం వైపుప్రస్థానం చేస్తున్నది అనడంలో సందేహం లేదు.
రాజకీయ క్షేత్రం: అద్భుత విజయాలతో హైందవ భావపరంపరా పథగాములే నాయకత్వం వహించడం, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలనే సంకల్పంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్న దేశభక్తుల సమూహం.. వారందిస్తున్న విజయాలను నేడు దేశం అనుభవిస్తున్నది సత్యమే కదా. ఇటువంటి స్వాభిమాన పూరితుల నేతృత్వంలోనే అభివృద్ధి సాధ్యం.
ఆర్థిక రంగం: స్వాభిమానంతో కూడిన దేశీయ ఉత్పత్తుల కారణంగా దేశ సంపత్తి పెరిగింది. బంగారం కుదువపెట్టిన స్థాయి నుంచి ఎదిగి, అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాలకు సాయం చేసేంతలా.
ఈ దేశంలో పుట్టిన ప్రజలు ఎప్పుడూ ఇతరుల ఆరాధనా పద్ధతి చూసి అసహ్యించుకోలేదు. అది వివిధత్వము లేదా వైవిధ్యము అని మాత్రమే భావిస్తారు. దేశ సరిహద్దులకు, సార్వభౌమత్వానికి, హిందూ ధర్మానికి హాని కలగనంతవరకు- వందలాది దేవతలను పూజిస్తున్న హిందువులు ఇతరులకు స్థానం లేదనే సంకుచితులు కానేకారు.
హిందువులు ఎవరి పూజావిధానాన్ని కూడా అగౌరవపరచరు, అణచివేయరు. ఈ భావన మన దేశం గొప్పతనం. ముస్లిం అయినప్పటికీ దేశభక్తుడైన అబ్దుల్‌కలాంను రాష్టప్రతిగా భుజాలపై ఎక్కించుకున్నారు. అది కూడా రామజన్మభూమి ఆందోళనకు నాయకత్వం వహించినవారే అనే విషయాన్ని మరువవద్దు. గనుక శత్రుదేశాలు భారతదేశం పట్ల చేసే దుప్ప్రచారాన్ని నమ్మవద్దు. విదేశీ ఆక్రమణకారుడైన బాబర్‌ను, మన పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాది అఫ్జల్‌గురు, భారత సైనికులను హత్యచేసిన బుర్హాన్ వని వంటి వారని ‘తమవారు’ అంటున్న దేశ వ్యతిరేక శక్తుల విద్రోహపూరిత ప్రచారాలను అస్సలు నమ్మరాదు.
ప్రపంచ ప్రజల ఆలోచనల్లో మార్పు:
ఇప్పటివరకు ఎడారి మతాల ప్రభావానికి లోనైన ప్రజాసమూహాలు కూడా హిందుత్వం మతం కాదు, అది ఒక జీవన విధానం అని గుర్తించారు. భారతీయ ప్రసాదిత ఆనందపు వైభవాన్ని రుచి చూస్తున్నారు. పలు దేశాల్లో జగన్నాథ రథయాత్ర వంటి భక్తి, ధార్మిక యాత్రలనే కాకుండా.. తమ సుఖమయమైన ఆనందకర జీవితానికి భారతీయ ధార్మిక, ఆధ్యాత్మిక ప్రపంచంలో దారులు వెతుక్కుంటున్నారు. పరమతమంటేనే గిట్టని వ్యక్తులుగా పేరొందిన వారు తమ ఆరోగ్యాలను కాపాడే భారతీయ ప్రసాదితమైన ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యోగ, ప్రాణాయామం వంటి వాటిని సాదరంగా స్వీకరిస్తున్నారు. అష్టాంగ యోగ భారతీయుల పేటెంట్ అయినా ప్రపంచమంతా ‘యోగా డే’ను జరుపుకుంటూ ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తులందరూ రామజన్మభూమి ఆందోళనతో ప్రభావితులై స్వాభిమానంతో పనిచేస్తున్న వారే. రామజన్మభూమి ఆందోళన భారతదేశంలోని సాధారణ ప్రజాజీవితంలో ఒక మైలురాయి. భారత ప్రజలకే కాదు, ప్రపంచంలోని హిందువులందరిలో శ్రీరాముని పట్ల, రామజన్మభూమి పట్ల ఉన్న అచంచలమైన భక్తి- వారికి అనేక విజయాలను సాధించి పెడుతుంది. ప్రపంచ ప్రజలందరి ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. తమ వాళ్లకు, తమ మతం వాళ్లకు మాత్రమే సుఖం లభించాలని కోరుకోకుండా...
సర్వేపి సుఖిన: సంతు-సర్వేసంతు నిరామయ
సర్వే భద్రాణి పశ్యంతు- మాకశ్చిత్ దుఃఖ మాప్నుయాత్‌॥
- అని భావించే హిందూ జీవనమూలాల భావాలన్నీ సాకారమవుతాయి. ఇందుకు నిదర్శనంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం తథ్యం. ఇందుకు మరికొంత సమయం పట్టవచ్చు. కానీ- రామజన్మభూమిలో మందిర నిర్మాణాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు.

-ఆకారపు కేశవరాజు (వీహెచ్‌పీ నేత, పాట్నా)