సబ్ ఫీచర్

ఇ-షాపింగ్‌తో.. జర జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంప్యూటర్ యుగంలో ఈమధ్య ఇ-షాపింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఇంటర్నెట్‌లో వస్తువులను కొనే పద్ధతి వచ్చాక వినియోగదారులు ఎంత వేగంగా కొంటున్నారో అంతే వేగంతో మోసపోతున్నారు. బాగా చదువుకున్నవారు సైతం జాగ్రత్తలు తీసుకోనందుకన మోసాలకు గురవుతున్నారు.
వస్తువులు కొనుగోలులో నేరుగా ఎదుర్కొనే మోసాలు ఒకరకమైతే, ఇ-షాపింగ్‌లో జరిగే మోసాలు మరోరకంగా ఉంటున్నాయి. ఇ-షాపింగ్ ఘరానా మోసంగా తయారైంది. ఇ షాపింగ్‌లో జాగ్రత్తలు తుచ తప్పదు. ఇ షాపింగ్‌లో వస్తువును బుక్ చేసుకునో, ఆక్షన్ వేసో కొంటారు. బిడ్‌లో గెలిచిన తరువాత వినియగదారుల క్రెడిట్ కార్డు నుంచి వస్తువు ఖరీదును ఆ వస్తువుల ఉత్పత్తిదారులు తీసుకుంటారు. వస్తువును రెండు మూడు వారాల్లో డెలివరీ చేస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన టైంకి వస్తువు డెలివరీ కాదు. మనం మాత్రం ముందుగానే వేల రూపాయలను కట్టి ఉంటాం.
ఎంత టెన్షన్‌గా వుంటుందో ఆలోచించాలి. ఎక్కువగా ఇంటర్నెట్ షాపింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వస్తువులను కొంటారు. ఒక వస్తువు కొంటే మరో వస్తువు ఉచితం అనే ప్రకటనలు ఇంటర్నెట్‌లో కూడా చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల కూడా ఆసక్తి ప్రదర్శిస్తారు. కానీ ఆ తర్వాత మెయిల్‌లో మీరు కొన్న వస్తువు వస్తుంది. ఉచితం అని చెప్పిన వస్తువు మాత్రం ఉండదు. ఇటువంటివి జరిగినపుడు ఇ షాప్ వాళ్ళు కాని, ఇంటర్నెట్ నిర్వాహకులు కాని బాధ్య తీసుకోవడానికి ముందుకు రారు. ఇలాంటివి ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువుల షాపింగ్‌లోనే జరుగుతుంటాయి.
మరో విషయమేమంటే ఇ షాపింగ్ వస్తువును బొమ్మలో మాత్రమే చూస్తాం. కాని దగ్గరగా చూడం. దాంతో ఆ వస్తువులో ఏదైనా లోపాలున్నా తెలిసే అవకాశం ఉండదు. నాణ్యత విషయమూ తెలియదు. ఇలాంటి ఇ షాపింగ్ మోసాలను అరికట్టడానికి యుకెలో వినియోగదారులకు ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవడానికి ఏడు రోజుల సమయాన్ని ఇస్తారు. ఏ కారణం లేకుండా కూడా ఏడు రోజుల్లో ఆ వస్తువుని వెనక్కి ఇచ్చే సౌలభ్యం కూడా ఉందక్కడ.
ఒకసారి ఇ షాపింగ్‌లో వస్తువు ఆర్డర్ చేసిన తర్వాత వినియోగదారుడికి ఆర్డర్ క్యాన్సిల్ చేసే పద్ధతిని, గ్యారంటీ లేదా వారెంటీల వివరాలను డెలివరీ తేదీని, వస్తువులు వెనక్కివస్తే పోస్టేజీ ఎవరు ఇస్తారు అనేటువంటి వివరాలన్నీ తెలియజేస్తారు. ఇలాంటి జాగ్రత్తలే కాకుండా ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా వేరొక వస్తువు డెలివరీ చేస్తే వస్తువుకు చెల్లించాల్సిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. మన దగ్గర ఇలాంటి సౌకర్యలేవీ లేవు. కాబట్టి వస్తువులను కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా మనమే తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. లేకపోతే డేంజర్‌లో పడక తప్పదు.

-కంసుడు 94926 66660