సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్విధ పురుషార్థాలు
ఎవరో హేళన చేసినంత మాత్రాన సాధకునికి కలిగే యిబ్బంది ఏదీలేదు. హిమాలయాన్ని ఎంత తుఫానయినా ఏంచేయగలదు? నీ గమ్యాన్నిగాని, నీవు అనుసరించాల్సిన మార్గాన్ని గానీ మరచిపోరాదు.
ఎన్ని యిబ్బందులు వచ్చినా, ఏం జరిగినాసరే నిబ్బరంగా నిలబడు. అవన్నీ ఏ కాసేపో, చందమామను కప్పివేసే మబ్బుల్లాటివే. నిరాశ, నిస్పృహలకు గానీ, సంశయాలకు గానీ తావివ్వకు. నీ జీవిత భవనాన్ని నాలుగు స్తంభాలపై నిర్మించుకో. ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్న నాలుగు పురుషార్థాలే ఆ స్తంభాలు. ఇవి ఒకదానితో ఒకటి దృఢంగా, భద్రంగా అనుసంధించబడి వున్నాయి. ప్రాచీన ఋషులు చెప్పినది ఇదే!
కత్తిపై సాము
‘దేవుడొక్కడే!’అని బోధించిన మహమ్మదు ప్రవక్తను అనేక విధాలుగా జనం అవమానించారు. వేధించారు. ఆఖరుకు చంపబోయారు. ప్రేమ ఆలంబనగా మానవాళిని తీర్చిదిద్దటానికి ప్రయత్నించిన ఏసుక్రీస్తును శిలువ వేశారు. ఎందుకు? తమ కుత్సితాలూ, కుతంత్రాలూ, కక్కుర్తిచేష్టలూ ఆయనముందు సాగవని. సత్యం తప్ప మరో పలుకు పలకని హరిశ్చంద్రుడు ఎన్ని యిబ్బందులుపడ్డాడు?
సత్యానే్వషణ చేసే వారి మార్గం చాలా దుర్గమం. క్షురకుని పదునైన కత్తి అంచుపై నడవటం వంటిది. అవమానాలనూ, అన్నిరకాల వేధింపులనూ, చిత్రహింసలనూ సాధకులు తట్టుకోవాల్సి వుంటుంది.
జగన్నాటకం
ఉదయం మీరు నిద్ర లేవగానే, దేవుడు మీకిచ్చిన పాత్రను నటించేందుకు స్టేజి పైకి ఎక్కుతున్నామనుకోండి! మీకిచ్చిన పాత్రను మీరు చక్కగా పోషించాలి! అది చూసి దేవుడు మెచ్చుకోవాలి! అందుకోసం ఆయనను ప్రార్థించండి! రాత్రికి పడుకోబోయేముందు రంగస్థలంపైనుండి గ్రీన్‌రూంలోకి వెళుతున్నామని అనుకోండి! మీ పాత్ర యింకా పూర్తికాలేదు. ఉదయం మళ్లీ స్టేజీపైకి ఎక్కాల్సి వుంటుందిగదా! కనుక డ్రెస్ వుంచుకోవాలో, వద్దో, ఆయన కొదిలేయండి! ఆయనకంతా తెలుసు! ఆయనే్దగదా రచన! ఈ జగన్నాటకాన్ని ఎలా నడపాలో, ఏ అంకం ఎలా ముగించాలో ఆయనకు తెలుసు. మీరు చేయాల్సిందల్లా యిచ్చిన పాత్రను చక్కగా నటించటం; అయిపోగానే నిష్క్రమించటం! అంతే!
ప్రణవోపాసన
అంతిమ క్షణంలో ఓంకారాన్ని స్మరిస్తే చాలు. ముక్తినిస్తానని భగవానులు గీతలో చెప్పారు. అప్పుడాయన ఆడ, మగ తేడా చెప్పలేదు. ప్రణవోపాసనకు ఆడా, మగా అంతా అర్హులు అన్నది గీతాచార్యుని అభిప్రాయం.
ఆత్మను దర్శించేందుకు రాచమార్గం ఉపాసన. ఆ దారిలో నడిచేందుకు అందరికీ అర్హతా, హక్కూ వున్నాయి.
మోక్షం
మోక్షం అంటే ఏమిటి? సత్యాన్ని గ్రహించటమే ముక్తి. మాయను తొలగించుకోవటమే మోక్షం. అది ఎవరో కొందరి సొత్తుకాదు. ఎవరో కొందరు సాధకుల గుత్తకాదు. మోక్షానికి అందరికీ అధికారం వుంది.
గోదావరి సముద్రంలో కలిసినప్పుడు ఏం జరుగుతుంది? దాని పేరు. రూపం, రుచి అన్నీ సముద్రంలో కలిసిపోతాయి. అలాగే మోక్షం సిద్ధించినప్పుడు నీ నామరూపాలూ, భావాలూ, ఆశలూ, అనురక్తులూ అన్నీ దైవత్వంలో కలసిపోతాయి. కరిగిపోతాయి. నీవంటూ వేరే మిగలవు.
దృష్టిని పెంచుకో
ఇరవై నాలుగ్గంటలూ నీవుచేసే పనేమిటి? వంటిపైన శ్రద్ధ, జబ్బులు రాకుండా చూసుకోడం, కండలు పెంచటం. లోపల వున్న ఆత్మను గురించి ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నావా? దేవుడు నీ హృదయ మందిరంలో వేంచేసి వుంటే పట్టించుకుంటున్నావా?
బరువు తూచుకొనే మెషీన్ మీద నిలుచుంటావు. ఇన్ని కిలోలున్నానని సంతోషిస్తావు. ఆ మెషీన్ ఏమంటుందో విను. ‘ఏం చూసి రుూ మిడిసిపాటు?’ అంటోంది. అక్కడ మృత్యువు పొంచున్నాడు. ఏ క్షణాన్నైనా ఎగరేసుకుపోవాలని. నీవెంత బరువున్నా అతనికొకటే. ఆ సంగతి గ్రహించావా? అందుకే దేహాన్ని పెంచటంకాదు, దృష్టిని పెంచుకో. దేహంపై కాదు. దేహిపై నీ దృష్టిని కేంద్రీకరించు.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల - కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది

గొడ్డుమాంసం తినాల్సిన అవసరం లేదు

బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614

గాంధీ అహింసమీద విశ్వాసం వున్నవాడు. మృత్యుముఖంలో వున్న భార్యకు నయం చేయడానికి కూడా మాంసాహార టీ ఇవ్వని, అనారోగ్యంతో వున్న కుమారుని వైద్యానికి కూడా గుడ్లు తినడానికి అంగీకరించని వ్యక్తి. అటువంటిది చెప్పుల తయారీకి జంతువులను చంపడానికి ఎలా ఒప్పుకుంటాడు? కానీ ఆయనకు తోలు కావాలి.
సహజ మరణం పొందిన పశువుల చర్మం మాత్రమే ఉపయోగించాలని ఆయన నిర్ణయించాడు. అలాంటి తోలుతో చేసిన చెప్పులు, బూట్లను ‘అహింసా పాదరక్షలు’ అనేవారు. మృతకళేబరాల చర్మాన్ని పదునుపెట్టడం (చెప్పులు కుట్టేందుకు వీలుగా తయారుచెయ్యడం)కంటే, వధించిన జంతువుల చర్మాలకు పదునుపెట్టడం సులభం. అందుకే తోళ్ళ పరిశ్రమలవాళ్ళు ‘అహింసా తోలు’ సరఫరా చేసేవారు కాదు. అందువల్ల గాంధీ తోలుకు పదునుపెట్టే పని నేర్చుకోక తప్పలేదు.
ప్రతి యేటా 9 కోట్ల రూపాయల విలువైన ముడి తోళ్ళను భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్నారని గాంధీకి తెలిసింది. విదేశాలలో ఆ తోలుకు శాస్ర్తియ పద్ధతుల్లో శుద్ధిచేశాక కోట్లాది రూపాయల తోళ్ళ వస్తువును భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల కేవలం డబ్బు నష్టమే కాకుండా తోళ్ళను శుద్ధి చెయ్యడంలోనూ, మంచి తోలు వస్తువులు తయారుచెయ్యడంలోనూ మనకున్న నైపుణ్యలకూ, తెలివితేటలకూ విలువ లేకుండా పోతోంది. నూలు వడికేవారు, నేతపనివారిలాగ, అనేకమంది తోళ్ళను శుభ్రం చెయ్యడం, తోలు వస్తువులు తయారుచేసేవారు వారి జీవనోపాధి కోల్పోయారు. తోళ్ళను శుభ్రం చెయ్యడం అనేది నీచమైనపని ఎప్పటినుంచి అయ్యిందా అని గాంధీ ఆశ్చర్యపోయాడు. ప్రాచీన కాలంలో అది నీచనమైన పని అయ్యుండే అవకాశం లేదు.
కానీ ఇప్పుడు దాదాపు పది లక్షలమంది తోలును శుభ్రం చేసే పనిచేస్తూ, అంటరానివారుగా పరిగణింపబడుతూ ఉన్నారు. ఉన్నత వర్గాలవారు వీరిని హీనంగా చూస్తారు. చదువు, కళ, పరిశుభ్రత, గౌరవాలకు దూరంగా వీళ్ళు బతుకులు ఈడుస్తున్నారు. తోలు పనివారు, చెప్పులు కుట్టేవారు, పారిశుద్ధ్య పనివారు ఉపయోగకరమైన పనులు చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ కులాల పట్టింపుగల జాతిలో కొంతమంది దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇతర దేశాల్లో ఏ మనిషీ తోలుపని, చెప్పులు కుట్టే పని ఎంచుకోవడంవల్ల పేదవాడు, నిరక్షరాస్యుడు, అంటరానివాడు కాడు.
ఈ గ్రామీణ పరిశ్రమను పునరుజ్జీవింపచేసేందుకు గాంధీ అనేక బహిరంగ విజ్ఞప్తులు చేశాడు. వేగంగా అంతరించిపోతున్న గ్రామీణ తోళ్ళ పరిశ్రమకు జీవం పోయడానికి ఆయన రసాయన శాస్తవ్రేత్తల సలహాలు కూడా తీసుకున్నాడు. తోళ్ళ పరిశ్రమను సంస్కరించడం ద్వారా చనిపోయిన పశువుల మాంసం తినే అలవాటును రూపుమాపవచ్చని గాంధీ భావించాడు. చనిపోయిన పశువును చర్మకారుల ఇంటికి తెచ్చినపుడు అక్కడ పండగ వాతావరణం ఉండేది. ఆ మాంసంతో ఒక రోజు విందు చేసుకోవచ్చని అంతా సంతోషించేవారు. కళేబరాన్ని కత్తులతో చీలుస్తున్నపుడు పిల్లలు చుట్టూ మూగి గెంతులు వేసేవారు. ఎముకలను, మాంసం ముక్కలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ అల్లరిచేసేవారు. ఆ దృశ్యం గాంధీకి ఎవగింపు కలిగించేది.
‘‘చచ్చిన గొడ్డుమాంసం తినడం మీరెందుకు మానరు? మీరు ఆ అలవాటు మానకపోతే నేను మిమ్మల్ని తాకుతాను గాని సాంప్రదాయవాదులంతా మీ సాన్నిహిత్యాన్ని బహిష్కరిస్తారు’’ అని ఆయన హరిజన చర్మకారులతో వాదించేవాడు. ‘‘మేము చచ్చిన గొడ్లను తొలగించాలన్నా, వాటి చర్మాలను ఒలవాలన్నా వాటి మాంసం తినే అలవాటును మానుకోవడం సాధ్యంకాదు’’ అని వారు జవాబిచ్చేవారు. ‘‘ఎందుకు సాధ్యంకాదు? తోళ్ళ పరిశ్రము పెట్టినంత మాత్రాన చచ్చిన గొడ్డుమాంసం తినాల్సిన అవసరం ఏమీ లేదు. పారిశుద్ధ్య పనినీ, తోళ్ళ పనినీ కూడా ఆరోగ్యకరంగా, పరిశుభ్రంగా నిర్వహించవచ్చని నేను అనుభవపూరవకంగా చెప్పగలను’’ అని గాంధీ వాదించేవాడు. సబర్మతీ, వార్ధా ఆశ్రమాలలో గాంధీ తోళ్ళ విభాగాలను ప్రారంభించాడు. ఇవి మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైనా, తర్వాత తోళ్ళను నిల్వ ఉంచేందుకు పక్కా భవనాలు కావాల్సిన స్థాయికి పెరిగాయి.