సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివరాత్రి
శివరాత్రి విశేషం ఏమిటి? వెంటనే మీరంటారు: ‘స్వామి ఉదరంనుండి లింగం వెలువడుతుంది’ అని.
ఈరోజు బహుళ చతుర్దశి చందమామ దాదాపు కనిపించనట్లే. కనిపించినా, ఎంతసేపు? క్షణంలో సగం!
కోరికలూ, ఉద్రేకాలూ అన్నీ కలిగేది మనసులోనే. చంద్రుని ప్రభావం మనస్సుపై వుంటుంది. ఈరోజు చందమామ లేనట్లే. కనుక మనసుకు ఉద్రేకాలు అంతగా వుండవు. ఆ సమయంలో రాత్రంతా జాగరణ చేసి మనసును దేవుని మీద లగ్నంచేయాలి. అలా చేస్తే, మనసును జయించగలుగుతాం. మనిషి ముక్తి సాధించగలుగుతాడు.
జాగరణ ఒక సాధన. ఆ సమయాన్ని భజనలతోనో, పవిత్ర గ్రంథాలను చదువుకొంటూనో గడపాలి.
అంతేకాని, సినిమాలు చూచి రాత్రంతా నేను జాగారం చేశానంటే ఇది జాగారమవుతుందా! జా-గరణ అనగా ఏమిటి? దైవచింతనతో వచ్చింది జాగరణ అవుతుంది. జ-అనగా పుట్టటము. గరణ అనగా దైవత్వముతో గూడిన భావము. దానితో ఈనాడు జాగరణ చేయాలి. మన కర్మలన్నీ కూడనూ దైవముతో కూడి ఉండాలి. మనయొక్క భావములు దైవముతో చేరినవై ఉండాలి. అది నిజమైన జాగరణ.
సాత్విక భాషణ
కొన్ని జంతువులకు సొగసైన గిట్టలున్నాయి. అందమైన కోర పళ్లున్నాయి. కొన్నిటికి కొమ్ములున్నాయి. మరి కొన్నిటికి ముక్కులూ, తొండం మొదలయినవి వున్నాయి. కాని మనిషికో? మాట వుంది. అదే మనిషికి అలంకారం.
జంతువులు కొమ్ములు చూపి, కాళ్లు నేలకు తాటించీ, కోరపళ్లు బయటపెట్టి, తొండం వూపి బెదిరిస్తాయి. కాని మనిషి తన మృదుమధుర భాషణంతో అవతలి వారిని వశపరచుకోగలడు. ఆ మాధుర్యమే మనిషిని ‘పశుపతి’ని చేస్తుంది. క్రౌర్యం మనిషిని పశువును చేస్తుంది. బయటికి తీయగా మాట్లాడి లోపల కుటిలంగా వుండటం కపటం అవుతుంది. చిత్తశుద్ధితో సాత్విక భాషణ చేయటానే్న వాచిక తపస్సు అంటారు. నీ మననసు నిండా మంచితనం, ప్రేమ నిండి వుంటే మాటలో అమృతం జాలువారుతుంది.
మానవ సరోవరాన్ని శుభ్రం చేయి. మాలిన్యం అంతా తొలగించు. అది దైవ నివాసానికి యోగ్యం అవుతుంది.
ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు మాటను అదుపుచేయటం.
అనుద్వేగకరం వాక్యం
నీ అంతఃకరణంలో రెండు నేత్రాలు ఉంటున్నవి. ఒకటి సత్యం. రెండు అహింస. అవి రెండూ నిన్ను గమ్యానికి చేర్చగలవు. అంతర్ముఖంగా అవి రెండు జ్యోతులు. సూర్యచంద్రులు. పలుకులో సత్యాన్ని ఎలా పాటించాలో తెలుసుకోవాలి అంటే నీవు గీతను చూడు. ‘అనుద్వేగకరం వాక్యం’అని గీత చెబుతోంది. మాట అనే వాడిలోనూ, వినే వాడిలోనూ కూడ ఉద్వేగం కలగరాదు.
మాట- మన్నన
నోరు మంచిదైతే వూరు మంచిదౌతుంది- అని చెప్పారు పెద్దలు. మాటకు చాలా పదునుంది. పటిమ వుంది. మాట మంచిదైతే అంతా మిత్రులే. మాట పరుషమైతే అంతా శత్రువులే.
మంచిగా మృదుమధురంగా మాటలాడటం నేర్చుకో-ఒక మనిషి ఎలాంటివాడు అన్నది అతని మాటలనుబట్టే తెలుసుకోవచ్చు. కొంతమంది మాట్లాడుతుంటే వినేవాళ్ల మనసు గాయపడుతుంది. కొంతమంది మాటలు నిరాశానిస్పృహలను కలిగిస్తాయి. కొంతమందికి నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంటాయి. టేప్‌రికార్డర్ పైన రికార్డ్ అయినట్లు యివన్నీ వినే వాడి మనసుపై చెరగని ముద్రవేస్తాయి.
అందుకే సాధకుడు బాగా అర్థం చేసికోవాల్సినదేమిటి? ‘నాలుక రెండు విధములుగా సామర్థ్యం కలిది. మానవుని ‘‘పశువా’’!అనిపించుటకును, ‘పశుపతి’యనిపించుటకును కూడ అది తగినది’అని.
మృదు భాషణం
మీరు ఎవరితో మాట్లాడినా నెమ్మదిగా, మృదువుగా మాట్లాడండి! కాకి అరుపు మీకిష్టమేనా? అదరుస్తే చాలు. మీకు చికాకేసి, అదిలిస్తారు. దాని అరుపు కర్ణకఠోరం. కోయిల కూత మీరు వినే వుంటారు. కోకిల కూడ కాకిలానే వుంటుంది. నిజానికి, కోకిల పిల్లలు కాకి గూటిలోనే పెరుగుతాయి. కాకే తన పిల్లలతోపాటు వాటికీ తిండి పెడుతుంది. నోరు తెరిస్తే, కాకి కాకే, కోకిల కోకిలే.
అందరికీ కోకిల రవం వినాలనిపిస్తుంది. కోకిలనెవరూ వెళ్లగొట్టరు. దానిలా మృదువుగా, మధురంగా మాట్లాడండి! అంతా మీరంటే కూడ యిష్టపడతారు.
ఇంకా ఉంది