సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌన మహాత్మ్యం
వౌనం బంగారమని ఎందుకన్నారు? వౌనేన కలహం నాస్తి!(వౌనం వల్ల తగాదా ఉండదు) మిత్రులు లేకపోయినా కనీసం శత్రువులుండరు. అంతే చాలు! వౌనంగా వుంటే తీరిగ్గా ఆలోచించుకోగల్గుతాడు. తన లోపాలు తాను గ్రహించగల్గుతాడు. ఇతరుల లోపాలెంచాలనే ఆసక్తి వుండదు.
కాలుజారితే, కాలు విరగొచ్చు. కొంత కాలానికి ఆ దెబ్బ నయమవుతుంది. నోరుజారితే మరొకరి మనసు విరుగుతుంది. నమ్మకం వమ్మువుతుంది. ఆ గాయం యిక మానదు. ఎప్పటికీ కెలుకుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండాలి. హితంగా, మితంగా, మధురంగా మాట్లాడితే నీకూ, లోకానికి కూడా మంచిది.
సాధన
దేవుడొక్కడే, ఆయన అంతటా వున్నాడు. నిజమే. కాని సర్వాంతర్యామిపై మనసు నిలపటం ఎలా? అందుకే, ఏదో ఒక ప్రతీక అవసరమయింది. ఆయన అన్నివేళలా, అంతటా వున్నాడన్న యదార్థాన్ని గ్రహించేందుకు సాధన అవసరం. సాధన ఆత్మశోధనకూ, ఆత్మశుద్ధికి ఉపయోగిస్తుంది. ఆత్మ దర్శనానికి దారితీస్తుంది.
విగ్రహారాధన
తమిళ సాధువు తిరు తొండన్ మానసిక శుద్ధికోసం విగ్రహారాధన చేస్తున్నానని అంగీకరించారు. పదార్థం, రూపం విడదీయరానివి. రాతి విగ్రహంలో విగ్రహం, రాయి రెండూ వుంటాయి. సాధకుడు రూపంపైనే తన మనస్సును కేంద్రీకరిస్తాడు. గాని ఆ విగ్రహం ఏ పదార్థంతో చేయబడిందో ఆ పదార్థంపై కాదు.
మనసే సాధనం
నీవు బాగుపడ్డా, చెడిపోయినా కారణం నీ మనసే. మూర్ఖుడికి మనసు అజేయమైన అడవి జంతువు. తెలిసినవాడికి అది దేవత. మనసు నానాభయాలతో నిండి వుంది. నిర్మలమైన మనస్సు కంగారుపడదు. ఇల్లూవాకిలీ లేని యతిని చూడండి! ఎంత స్థిమితంగా వుంటాడో! మనసును నిర్మలంగా చేసికొని, సాధనకు ఒక సాధనంగా మలచుకోటం వేదం నేర్పుతుంది.
పరులకు కీడు
మానవుడు పరులకీడు కోరితే- ఆ సంకల్పము, ముందు ఎదుటివానికి కొంత కీడు చేసినప్పటికీ, అంతకంటే పదింతలుగా వచ్చి తిరిగి తనకే కీడు చేస్తుంది. మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక పరులను దూషించడం, హింసించడం వంటి చర్యలలో ప్రవేశిస్తుంటాడు. హింసాద్వేషాలకు దూరంగా వుండాలి.
ఎందుకీ బ్రతుకు?
మనిషి. ఈ భూమిపై యినే్నళ్లు ఎందుకూ బ్రతకటం? ఇంతింత బియ్యం, పప్పూ గోధుమలూ ఖర్చుచేయటానికేనా? దానివల్ల ఎవరికి సంతోషం? ఎవరికి శాంతి? తనకా? ఇతరులకా? పెట్రోమాక్స్ లైటు ఎప్పుడు కాంతిగా వెలుగుతుంది? దానిలోకి నీవు గాలి కొడితేనేకదా! అంటే, నీవు బాగా సాధన చేయాలి అని అర్థం. నీ బుద్ధిని ప్రకాశింపచేసికోవాలి అని అర్థం.
తారుమారు
ముందు భగవాన్, తరువాతనే లోకం, ఆఖరున నేను. ఇదీ సాధకుడు అనుసరించాల్సిన క్రమం. సాధకుడు కానిదెవరు? ఇవాళ కాకపోతే రేపయినా నీవు సాధకుడివి కాక తప్పదు. జనన మరణ చక్రంనుండి తప్పించుకోవడానికి సాధన చేయాలి. అయితే తన స్వలాభం ఏదో ఎరగని మనిషి ఆ క్రమాన్ని తారుమారు చేసేశాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ‘నేను’ముందు, తరువాత లోకం, ఆఖర్న దేవుడట! ఆఖర్న దేవుడిని పెడితే నీ పనీ ఆఖరే!
అలాకాదు, దేవుడినే అంటిపెట్టుకొని వుండు. నీకు భద్రం కలుగుతుంది.
నిరంతర సాధన
బస్సు కదలిపోతున్నంతసేపు, దుమ్ము దానివెనుక రేగుతూ, గాలిలో కలిసి కొట్టుకొనిపోతూ వుంటుంది. బస్సు తటాలున నిలిచెనా, ఆ దుమ్మంతయు వచ్చి బస్సును, బస్సులోని ప్రయాణికులను కప్పివేస్తుంది. అట్లే, సాధన సాగుచున్నంత వరకు బాహ్య ప్రపంచ విషయాలు నీ వంకకు రావు. సాధనను నిలిపివేశావా, బాహ్య విషయాలు ఒక్కుమ్మడిగా ఆ దుమ్మువలె నీలో ప్రవేశించి నీ హృదయాన్ని కప్పివేస్తాయి.
ఎన్ని జన్మలు కావాలి?
జీవితం నీకేం బోధించింది? దుఃఖం లేకుండా కేవలం సుఖం వుండదన్న సంగతి; సుఖదుఃఖాలు అటుయిటూ క్షణక్షణం మారుతుంటాయి. అవి కూడా నీ మానసిక స్థితినిబట్టి ఆధారపడి వుంటాయి. ఈ కాస్తా గ్రహించటానికి నీకు ఇన్ని జన్మలు సరిపోలేదా?

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది