సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి వెల ఎంత?
ప్రపంచంలో ఎక్కడ చూసినా, యిప్పుడు ధరలు పెరిగిపోతున్నాయన్న ఆదుర్దే కనిపిస్తున్నది. ధరలను తగ్గించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. మంచిదే. కాని మరొక సంగతి వుంది. దానిని ఎవరూ పట్టించుకోడం లేదు. అదేమిటంటే, మనిషి విలువ తగ్గిపోవటమే. మనిషి అమూల్యమైనవాడు. ఆ సంగతి గ్రహించాలి. చిల్లరమల్లర నట్టోబోల్టో కాడతను. అతనికి జీవితంలో సాధించాల్సిన పరమార్థం వుంది. తాను నాశన రహితమైన ఆత్మనని అతడు గ్రహించాల్సి వుంది. తాను అజేయుడనని అతడు తెలుసుకోవలసి వుంది. ఈ శరీరం ఆ ఆత్మకు కేవలం ఒక వాహనం మాత్రమేనని అతడు అర్థంచేసికోవాల్సి వుంది. అప్పుడే అతని విలువ హెచ్చుతుంది.
ఉపవాసం
ఉపవాసం అంటే ఏమిటి? నీ ఆలోచనలు, చేతలు, మాటలు అన్నీ ఆనాడు భగవత్పరం కావాలి. ఆ రోజంతా ఆయనకు దగ్గర కావాలి. ఆయనకోసమే గడపాలి. ఆయనలో లీనం కావాలి. నిత్యం చేసే పనులనన్నింటినీ పక్కకు నెట్టి ధ్యానాన్నీ, జపాన్నీ చేయాలి. అన్నం మాని, ఫలహారాలూ, టిఫిన్లూ తినటాన్ని నేడు ఉపవాసంగా భావిస్తున్నారు. ఎంత అజ్ఞానం!
అరుదైన అవకాశం
మనిషి వొక్కడే ఆధ్యాత్మిక సాధనవల్ల తన్ను తానుద్ధరించుకోగలడు. ఏ జంతువూ అలా చేయలేదు. సర్కసువాళ్లు పెద్దపులిని తెచ్చి అనేక ఫీట్లు అద్భుతంగా చేసేలా ట్రెయినింగు యిస్తారు. కాని దానితో మాంసాహారం మాన్పించి, గడ్డిని తినిపించగలరా?
మనిషి నియమనిష్ఠలను పాటించి తన గుణాన్నీ, స్వభావాన్నీ, మార్చుకోగలడు. తన మనస్సును నిగ్రహించి చెడు ఆలోచనలు కలగకుండా చేసుకోవచ్చు. అందుకే ‘మనుష్య జన్మం దుర్లభం’ అన్నారు. అరుదుగా లభించే ఈ అదృష్టాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి! ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆత్మదర్శనం చేసికోండి!
నామ యోగం
షడ్రసోపేతం
నేను ప్రసంగం చేసేటప్పుడు ముందుగా ఒక పద్యం చదివి ప్రారంభిస్తాను. నామావళితో ముగిస్తాను. మధ్యలోనే చెప్పదలచుకున్నదేదో అది చెబుతాను. అప్పుడే ప్రసంగం చక్కటి పుష్టికరమైన భోజనంలాగా వుంటుంది. ఇదంతా దేనికి? నామస్మరణలో గల మాధుర్యాన్ని ప్రజలు తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం.
హరి చింతనం
‘సర్వదా సర్వ లోకేషు సర్వత్రహరి చింతనం’- అంటే అన్ని కాలాలలో, అన్నిచోట్లా, అన్నివేళలా హరినే చింతించు- ఇదే నీవు చేయాల్సిన పని. మూడుపూటలా జపమాల తిప్పుతూ కూచోటం కాదు. నిరంతరం నామజపం చేయాలి. నీ బుద్ధిని జాగృతంచేసి నిర్విరామంగా ఆత్మవికాసంకోసం కృషిచేయాలి.
స్వర్ణయుగం
కృత, త్రేత, ద్వాపరయుగాల కన్నా కలియుగం విశిష్టమైనది. ఎందుకంటే కలియుగంలో ముక్తికి ఎంతో సులభమార్గాలు చెప్పబడ్డాయి. కేవలం నామస్మరణతో, భగవచ్చింతనతో ముక్తిని పొందవచ్చును. స్మరణ అంటే నిరంతరం దేవుని తలచుకొనడం. చింతన అంటే ఆయన ప్రశస్తిని గురించి నిరంతరం విచారం చేయటం. కాని కొందరికి కలియుగం అంటే తగని భయం. కలిలో ప్రళయం సంభవిస్తుందని వారి నమ్మకం. కాని ముముక్షువులకు ఇదే స్వర్ణయుగం.
నామ స్మరణ
అంకితభావాన్ని పెంపొందించుకొనే ప్రక్రియ నామస్మరణం. ఏ ఇబ్బంది కలిగినా, నీవు యింకా దృఢంగా నామస్మరణకు అంకితం కావాలి. ఇబ్బంది కలగ్గానే నీ విశ్వాసం సడలిపోరాదు. మీదుమిక్కిలి అది మరింత గట్టిపడాలి. జబ్బు వచ్చినప్పుడు మందు అవసరం. అంతే కాని సుస్తీ వచ్చినప్పుడు మందు మానేస్తారా ఎవరయినా? ఏ కాస్త ఎదురుదెబ్బ తగిలినా బేజారెత్తిపోయి రాముడినీ, కృష్ణుడినీ, సాయిబాబాను వదిలేస్తావు. అదే దయనీయం.
స్వార్థమే కారణం
ఈనాడు ఎక్కడ చూచినా అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణమేమిటి? స్వార్థమే దీనికి కారణము. కోర్కెలే దీనికి కారణము. కోర్కెలు ఫలించకపోవటంచేతనే ఈ విధమైనటువంటి దుర్మార్గములో ప్రవేశిస్తున్నారు. కనుక కోర్కెలను తగ్గించుకోవటానికి మనం భగవన్నామ స్మరణ ఎక్కువగా చేయాలి.

ఇంకా ఉంది