సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుని దూత
ఏసుక్రీస్తు పుట్టిన రోజు పవిత్రమైన రోజు. ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి అందించాడు. నిజానికి ప్రతి వ్యక్తీ ఈ లోకానికి ఆ పనిపైనే వస్తున్నాడు. మనిషి జన్మకు సార్థకత ఎలా కలుగుతుంది? జగత్పిత సర్వవ్యాపి. సర్వజ్ఞుడు, సర్వ శక్తివంతుడు అన్న సత్యాన్ని చాటటం వల్లనే. ఆయన ప్రశస్తిని గానం చేయటంవల్లనే మనిషి ధన్యజీవి కాగలడు. అంతేకాని, కేవలం తినటానికీ, తాగటానికీ, తిరగటానికీ ఎవరూ భూమిపై పుట్టటం లేదు. మానవజన్మ అంతకన్నా ఉత్తమమైన ప్రయోజనంకోసం ఉద్దేశించబడింది. జీవులన్నిటిలోనూ సత్యం, శివం, సుందరం అన్న గ్రహింపు వున్నది. వాటిని అవలోకించి ఆరాధించగలిగింది మానవుడొక్కడే!
ప్రతి మానవుడూ భగవంతుడు పంపిన దూతే. అయితే దూత అనగా ఏమిటి? భగవంతునియొక్క సందేశమును ప్రపంచములో ప్రచారంచేయటమే దూత యొక్క ప్రధాన కర్తవ్యం. కాని ఈనాడు భగవంతుని సందేశమును జగత్తుకు చాటేటటువంటి దూతలు చాలా కరువైపోయినారు. భగవత్ సందేశమునకు విరుద్ధమైన మార్గములలో ప్రచార ప్రబోధాలు చేసి, జగత్తును అనేక విధముల కల్లోలపరచే ‘యమదూతలు’ తయారవుతున్నారు. ప్రతి మానవుడూ అవధూత కావాలిగాని యమదూత కాకూడదు.
పూర్వజన్మ సుకృతం
పూర్వజన్మలో నీవు చేసిన సుకృతాలన్నీ యిప్పుడు యోగిస్తాయి. పూర్వజన్మ పుణ్యాలు లేకపోతే ఇక్కడ చెక్కు చెల్లదు. అంతేకాదు ఎవరి ఆకౌంటు వారిదే. అమ్మయినా, తమ్ముడయినా ఒకరు మరిఒకరి అకౌంటు నుండీ, భర్త భార్య అకౌంటునుండీ, భార్య భర్త అకౌంటు నుండీ డ్రా చేయటం వీలుపడదు. ఎవరు చేసిన కర్మవారే అనుభవించాలి. తప్పదు.
అనుగ్రహం
ఒక్కోసారి బ్యాంకువారు నీకు ఓవర్‌డ్రాఫ్ట్ అనుమతిస్తారు. దానివల్ల నీకు తాత్కాలికంగా కలిగే యిబ్బందులను తట్టుకోగల్గుతావు. నీవు నమ్మకస్తుడవా, కాదా అని చూసికదా, మేనేజర్ నీకు ఓవర్‌డ్రాఫ్ట్ యిస్తాడు? సత్కర్మ, సత్సంగ్, సచ్చింతన, నామ స్మరణాదులుచేస్తూ వుంటే నీకు లభించే స్వామి అనుగ్రహం అలాంటిదే.
యోగం, భోగం, రోగం
ఈరోజు మానవుని పరిస్థితి ఏమిటి? పొద్దుటే యోగం; రోజంతా భోగం. రాత్రికి, పాపం, రోగం! భక్తి అనేది ఏమిటి? అది మొక్కుబడి కాదు. నిరంతరం చేయాల్సిన సాధన. అదొక పవిత్ర మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఆలోచనాసరళి, పునీత జీవిత విధానం, మానావమానాలనూ, కలిమి లేములనూ, కష్టసుఖాలనూ లెక్కచేయక అంకితభావంతో అనుసరించాల్సిన దివ్యపథం! ఏమన్నాకానీ, ఏదైన జరగనీ, నీవుమాత్రం బాట విడవకు.
ఎవరిది పిచ్చి?
ఏ పనీ నీచం కాదు. అన్ని అవసరాలూ గమనించి, పని చేసుకొనిపోవాలి. పనెక్కువగా వున్నపుడు ధ్యానానికీ, జపానికీ సమయం చాలకపోవచ్చు. నగర సంకీర్తనకు వెళ్లటం కుదరకపోవచ్చు. అయితేనేం? బజార్లు పూడుస్తున్నా, మార్చురీలో శవాన్ని ఎత్తి, మోస్తున్నా, ఇబ్బందులు పడేవారి యింటికి సాయపడేందుకు వెళుతున్నా. వస్తున్నా. నీ నోట నామం పలుకుతూనే వుండాలి! అప్పుడు నీకేం లోటు!
కొందరు ‘నికిదేం పిచ్చి!’అని చూసి నవ్వవచ్చుగాక! పరవాలేదు! వారి పిచ్చి నీకు పట్టనందుకు నీవు సంతోషించు.
ప్రణవం
ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని పలికేందుకు ఒక పద్ధతి వున్నది. విమానం వచ్చేటప్పుడు ధ్వని చాలా తగ్గుస్థాయిలో వినబడుతూ క్రమంగా పెద్దదౌతూ వస్తుంది. విమానం మనకు దూరమయేటప్పుడు తిరిగి క్రమంగా ధ్వని తగ్గిపోతూ వుంటుంది.
ప్రణవ నాదాన్ని కూడా అలాగే నెమ్మదిగా అనటం ప్రారంభించు! క్రమంగా ధ్వనిని పెంచుకుంటూ పో! ఉచ్చస్థితికి చేరిన పిదప క్రమంగా తగ్గిస్తూ రా! ఆఖరుకు నిశ్శబ్దం. ప్రణవనాదం వలెనే, ప్రణవ నాదానంతరం కలిగే నిశ్శబ్దం లేక వౌనంకూడా ఉత్తేజం కలిగిస్తుంది. నాదం ఉచ్చస్థితికి చేరటం కైలాసాన్ని చేరుకోవడంగా భావించు.
నామ మాధురి
రామనామం వీనులకు విందుచేస్తుంది. అంతులేని మాధుర్యాన్ని వర్షిస్తుంది. భగవత్ప్రేమతో హృదయాన్ని నింపేస్తుంది. ‘రామ’అన్న పదం పెదాలపై దొర్లిన ప్రతిసారీ నవ్యనూతనమైన ఆనందం జాలువారుతుంది.
కొన్నిసార్లు పునరుక్తి తప్పదు. అజీర్ణం తగ్గినదాక మందు వాడాలి. ముఖం రోజూ కడుక్కోవాలి. ఈ పూట భోజనమయింది అంటే కథ కంచికి పోదు. మాపూరేపూ మళ్లీ భోం చేయాలిగా! అలాగే నామజపం మళ్ళీ మళ్ళీ చేస్తుండాలి.
ఇంకా ఉంది
*
- భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.