సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేం చదువు?
మిసిసిపీ నది పొడుగెంత? వెసూవియస్ పర్వతం ఎత్తెంత? ఇదీ మన పిల్లలకు నేర్పే లోకజ్ఞానం! వారికి ఎప్పుడూ ఉపకరించని రుూ సమాచారంతో వాళ్ల బుర్రలు వేడెక్కించటం ఎందుకు? దానికన్నా, వాళ్లకు ఆత్మబలాన్ని కలిగించే టానిక్ యివ్వటం మంచిది. ఆ టానిక్ ఏమిటో తెలుసా! నామస్మరణ! నామజపం!
లోగడ పిల్లలకు రామనామం చెప్పేవారు. అక్షరమాల నేర్పేటప్పుడే ‘శుద్ధ బ్రహ్మపరాత్పర రామ!’అంటూ కీర్తనలు చదివించేవారు. ఆ తరువాత వారికి ఓనమాలు అంటే ‘ఓం నమశ్శివాయ!’దిద్దించి చదవటం రాయటం నేర్పేవారు. ఇప్పుడో? ‘డింగ్ డాంగ్ బెల్! పుస్సీఇన్ ది వెల్!’-ఇదీ వాళ్లతో అనిపించేది! దీనికేమన్నా అర్థంపర్థం వున్నాయా? ఈ రకమైన చదువులే యిప్పుడంతటా అల్లుకొనిపోయాయి! శాంతినీ, సంతోషాన్ని చెడగొడుతున్నాయి.
రాధే శ్యాం!
భగవంతుడు కృష్ణుని రూపంలో తమముందు ప్రత్యక్షంగా తిరుగుతూ వున్నా, బృందావనంలోని కొందరికి ఆ సంగతి తలకెక్కలేదు. కృష్ణుడంటే ఏదో గారడీ వాడన్న చులకనభావం వారికుండేది. మనలో మాట! అలాటి పెద్దమనుషులకు ఈనాడు కూడ కొదవేం లేదు!
సరే! వాళ్లంతా కలిసి రాధకు ఒక పరీక్ష పెట్టారు. చిల్లులు పొడిచిన కుండను ఆమెకిచ్చి దీనితో నీళ్లుపట్టుకొని రమ్మన్నారు. రాధ ఆ కుండ తీసికొని బయలుదేరింది. ఆమెకు కుండా, చిల్లులూ యివేవీ పట్టలేదు. ఆమెకు అంతా కృష్ణమయం. ‘కృష్ణా! కృష్ణా’అని భక్తి తన్మయత్వంతో నామజపంచేస్తూ కుండను నీటిలో ముంచింది. ఆమెచేసిన నామజప మహాత్మ్యం చూడండి! కుండకున్న చిల్లులన్నీ పూడిపోయాయి. కృష్ణుని పట్ల ఆ అమాయక భక్తురాలికి వున్న నమ్మకం అంత గట్టిది!
కుండ వంటి జడవస్తువు కూడ కృష్ణనామ ప్రభావంలో పడింది. వెక్కిరించిన వెంగళప్పల నోటికి తాళం పడింది.
చక్కని చెట్టు
బంగారం విలువైనదే కాని నగలు చేయించుకుంటేనే దానిని ధరించటానికి వీలవుతుంది. నిరామయమైన దైవం బంగారంలాటిదే. సగుణదైవం వేరు. నామాన్ని స్మరించగలుగుతావు. రూపాన్ని పూజించగలుగుతావు. మనసులో నిల్పుకొని ఆరాధించగలుగుతావు. ఆ సంతోషాన్నీ, ఆనందాన్నీ అనుభవించగల్గుతావు. జయదేవుడు. గౌరాంగుడు, రామకృష్ణ పరమహంస వంటి భక్తులు తాము చీమలుగానే వుంటూ పంచదార మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుకున్నారు. కాని పంచదారగా వుండాలనుకోలేదు.
నామాన్ని నీ హృదయంలో విత్తు. భగవత్కృప నీపై వర్షించినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. పెరిగి అందమైన మొక్కవుతుంది. చక్కని చెట్లయి చల్లని నీడనిస్తుంది.
ఒక్కడివేకదా వచ్చింది!
నగర సంకీర్తనలో బజార్ల వెంకట కీర్తనలు పాడుతూ వెళ్లటానికి కొంతమందికి ఎవరేమనుకుంటారో అన్న బెరుకు వుంటుంది. అందుకని వాళ్లు నగర సంకీర్తనకు రారు.
మీరుచేసే పని మంచిదయినప్పుడు మీకెవరేమనుకుంటారో అన్న భయం ఎందుకు? ఏ కారణం చేతనయితేనేమి మిగిలినవారు రాకపోతే, నీవొక్కడివే వెళ్లు. భగవంతుని మహిమను కీర్తించు. ఒక్కడివే అన్న సంకోచం ఎందుకు? నీవీ లోకంలోకి వచ్చింది ఒంటరిగానేకదా! పిల్లాజెల్లా సంసారం అంతా తరువాతనే కదా తయారయింది! తిరిగి వెళ్లేటప్పుడు వారందరినీ వదిలి నీ వొక్కడివే కదావెళ్లవలసింది!
గాన మాధురి
నాగస్వరం వూదుతూ, సర్పం ఆ గాన మాధురిలో మైమరచి వుండగా, దానిని పట్టుకోవచ్చు. దాని కోరలు పీకేయవచ్చు. విషాన్ని పిండేయవచ్చు. ‘నామస్వరం’(రామ సంకీర్తన)తో మైమరచి వుండగా, మనిషిలోని విషయ వాసనలనే విషాన్ని కూడా అలాగే పిండేయవచ్చు. విషాన్ని అమృతంగా మార్చుకోవచ్చు.
నాలుకపై నర్తన
కృష్ణుడు అడవులలో ఆవులను మేపుకొంటూ వేణువునూదే గోపబాలకుడు మాత్రమేకాదు. దేవకీ గర్భంలో జన్మించి, యశోద వొడిలో పెరిగిన దివ్య మూర్తి. అవతార పురుషుడు.
కృష్ణ, కృష్ణ అన్న పలుకును మీ నాలుకపై నాట్యం చేయనీయండి! కాళీయుని పడగలపై ఆడిన ఆయన పాదాలు ఆ సర్పరాజు విషాన్నంతా కక్కించినట్లు, ఆయన నామం మీ వాచాదోషాలనూ పాపాలనూ పోగొడుతుంది.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది