సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళీయ మర్దనం
కాళింది మడుగు ఎక్కడో లేదు. మీ మనసే ఆ మడుగు! ఆ మడుగులో ఆరు తలల పాముంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరూ ఆ పాము పడగలు. మీరు చేసే భగవన్నామమో? మనసనే మడుగు అడుగున ఎక్కడో దాక్కున్న ఆ పామును బయటికి లాగి భంగపరచే బాలకృష్ణుడు!
కృష్ణుడు కాళీయుని పైకెక్కి, పడగలపై నాట్యంచేశాడు. అప్పుడు కాళీయుని గర్వం నశించింది. మీలోని పరమాత్మను కూడ కామక్రోధాదుల పడగలపైకెక్కి, ఆడమని వేడండి! అప్పుడుగాని, ఆ పాము తన విషాన్ని కక్కివేసి, సాత్వికమై కూచోదు.
రామ నామం
ఒకసారి అగస్త్యులవారి తల్లి ‘మా అబ్బాయి సముద్ర జలాలను ఒపోసన పట్టాడు.’ అన్నదిట. వెంటనే ఆంజనేయుని తల్లి ‘మా అబ్బాయి సముద్రాన్ని యిట్నించి అటు యిట్టే గెంతి దాటేశాడు’ అన్నదిట. అప్పుడు రాముని తల్లి కౌసల్య ‘మీ అబ్బాయి సముద్రాన్ని లంఘించాడంటే మా అబ్బాయి పేరు జపించటం వల్లనే’ అన్నదిట.
నామస్మరణలో అంతటి శక్తి వుంది. ఊహించలేని బలాన్నీ, శక్తినీ అది ప్రసాదిస్తుంది. ప్రేమతో, విశ్వాసంతో నామస్మరణ చేయండి! ముక్తినే అనుగ్రహించగల్గిన నామానికి, లౌకిక వరాలొక లెక్కా!
నామ దీపం
ఇంటి బయటా, లోపలా వెలుతురు కావాలంటే గడప పైన దీపం పెట్టవలసి వస్తుంది. అట్లే నీలోనూ, నీ వెలుపలనూ శాంతి ప్రకాశం ప్రసరించవలెనంటే నీ జిహ్వాగ్రమనే గడపయందు నామమనే దీపమును నిలుపుకో. ఈ దీపము ఏ గాలికీ, వానకూ ఆరునది కాదు. ఈ నామ దీపము నీకేగాక యావత్ ప్రపంచానికి కూడా శాంతి తేజమును ప్రసాదిస్తుంది.
నామం- నిరంతరం
నామస్మరణ ఖర్చులేని పని. దానికి సరుకులూ, సామాగ్రీ అక్కరలేదు. ఫలానాచోట చేయాలనీ, ఫలానా సమయంలో చేయాలని నియమం లేదు. పాండిత్యంతో పని లేదు. ఆడామగా, కులం, గోత్రం అనవసరం.
ఒక యినుప ముక్కను తీసికొని ఒక రాయి మీదవేసి రుద్దండి! వేడి పుడుతుంది. కావాల్సిందల్లా గట్టిగా రుద్దటం. పైపైన రుద్దినా, ఆపి ఆపి రుద్దినా అది వేడెక్కదు. భగవంతుని మనసు కరిగేంత వేడి పుట్టాలంటే ‘రామ, రామ, రామ’ అని నామాన్ని విడువకుండా జపించాలి! మనః స్ఫూర్తిగా జపించాలి. అప్పుడు దేవుడు కరుణిస్తాడు.
భక్త మీరా
నామస్మరణ వల్ల దైవానుగ్రహాన్ని పొందవచ్చు. రాణీ మీరాబాయి గిరిధర గోపాలుని స్మరిస్తూ తన సిరిసంపదలను, హోదానూ అన్నిటినీ త్యజించింది. ఆమె పద్ధతి నచ్చక ఆమె భర్త విషం తెచ్చి ఆమెకు తాగమని యిచ్చాడు. కృష్ణ నామం జపిస్తూ ఆమె సంతోషంగా ఆ విషాన్ని సేవించింది. కృష్ణ నామ ప్రభావంవల్ల ఆ విషం అమృతంగా మారింది. మీరాబాయిని ఏమీ చేయలేక పోయింది.
బతుకు భగవాన్‌దే
‘కళ్లెందుకు?’ అనడిగాడు భక్త పురంధర దాసు. దానికి ఆయనే ‘దేవుని దర్శించటానికి’ అని జవాబిచ్చాడు. ‘నిన్ను చూడనోచని కన్నులు కన్నులా, కావు, నల్ల గోలికాయలు’. ‘నీ కీర్తనలు వినని చెవులు, చెవులా? కావు. కొండ చరియలో నక్కలు తోడిన బొరియలు’. ‘నీ నామాన్ని భజించమని నాలుక నాలుకా, కాదు కప్ప నాలుక’అన్నాడాయన.
సుఖ దుఃఖాలు
మన సంచితాలను దహించేవి సుఖ దుఃఖాలు. మనసు వాసనలతో నిండినప్పుడు. ఆ మంటలు రగులుతాయి. వాసనలను వదిలివేస్తే? ఆ మంటలు చల్లారిపోతాయి,
వాసనలు కిందటి జన్మవి కావచ్చూ. రుూ జన్మవీ కావొచ్చు. మన మనసుల్లో కలిగే కోరికలతో, రాగ ద్వేషాలతో అవి ముడిపడి వుంటాయి. వాటిని తొలగించటం యోగం ద్వారా సాధ్యం. అంతకన్నా సులభ మార్గం. లేకపోలేదు. అదే భక్తి! వాసనలను నశింపజేసి, తరింప జేసేందుకు, నామస్మరణ చాలు; త్రేతాయుగంలో ‘సీతారామ’అని స్మరిస్తే సరిపోయేది. ద్వాపరంలో ‘రాధేశ్యాం’ అంటుంటే ముక్తి దొరికేది. కలియుగంలోనో, అన్ని పేర్లూ ఆయనవే. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు!
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల: రూ. 100/-లు.
ఇంకా ఉంది