సబ్ ఫీచర్

అసహిష్ణుతకు మారుపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం ప్రజాస్వామిక దేశం కావచ్చు. ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా విహంగాలై తమ వైయక్తిక జీవనాన్ని గడుపుతూ సభ్య సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయ. దీనిని ప్రతి పౌరుడు గుర్తెరిగి తోటి వారి మనోభావాలను కించపరచని రీతిలో, సమాజాన్ని విచ్ఛిన్నపరిచే పద్ధతిలో వ్యవహరించకుండా రాజ్యాంగం ప్రసాదించిన సర్వహక్కులను సంపూర్ణంగా పొందేవారు మాత్రమే గౌరవనీయులు. సమాజ హితైషులు.
భారతదేశం లౌకిక రాజ్యం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే సమాజం. ప్రతి అంశానికి వక్రభాష్యం చెప్పి తాము చేసే తప్పిదాలను సమర్ధించుకొనడం అప్రజాస్వామికం. లౌకిక రాజ్యంలో పుట్టిన వారు తమకు నచ్చినవి చేయడం సముచితమైనవి కాజాలవు. చోటామోటా సాహిత్యకారుల నుండి వివిధ రంగాలలో అధికారులుగా పనిచేస్తున్నవారి వరకు అత్యుత్తమ స్థానాన్ని అధిరోహించినవారు కూడా పూర్వాశ్రమంలోని వాసనలు వదులుకోక తన స్థానాన్ని మరచి దేశ విదేశాలలో తమ దేశంలో అసహిష్ణుత పెరిగిపోతున్నదని పేర్కొనం దేశానికి హానికారకం.
వేయి సంవత్సరాలకు పూర్వం మన దేశంపై దండయాత్ర చేసిన అరబ్బులు మన దేశంలో ఇస్లాం మత రాజ్యస్థాపన చేయాలనే నెపంతో హిందువులకు శ్రద్ధాకేంద్రాలైన దేవాలయాలను ధ్వంసం చేశారు. హిందువులను ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నంలో భాగంగా హిందువులు పవిత్రంగా భావించి పూజిస్తున్న ‘గోమాత’లను చంపి వాటి మాంసం హిందువుల నోటిలో బలవంతంగా కుక్కి వారు హిందుత్వాన్ని కోల్పోయినారనే భ్రమను కల్పించి ఇస్లాం మతస్థులుగా మార్చేవారు. వామపక్షీయులు అత్యధికంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అవమానపరిచే పద్ధతిలో ఉండటం దురదృష్టకరం.బీఫ్ ఫెస్టివల్ అసహిష్ణుతను ప్రోత్సహించడం కాదా? ఈ దేశంలో ఎవరికిష్టమైన ఆహారాన్ని వారు తినే హక్కును ఉపయోగించుకుని వారి ఇష్టాలను అనుసరించి తింటున్నారు కదా? వారినెవరైనా ప్రశ్నిస్తున్నారా? అలాంటప్పుడు మీరు ప్రత్యేకించి విద్యాలయాలలోనే బీఫ్ ఫెస్టివల్ చేయడం అవసరం లేదు కదా! మన పొరుగున ఉన్న శత్రుదేశమైన దాయాది దేశం పాకిస్తాన్ ఆటంకవాదుల మిలాఖత్‌తో మన దేశంపై దాడులు చేయడానికి సన్నద్ధమైన తరుణంలో బీఫ్ ఫెస్టివల్‌పై మాట్లాడే బుద్ధిజీవులకు దేశాన్ని రక్షించుకునే బాధ్యత లేదా?
గతంలో ఎన్నడూ చర్చకు రాని ఇటువంటి అసహిష్ణుతపై రాద్ధాంతం చేయడం అనవసరం. దేశ, జాతి భవితవ్యంపై దృష్టి కేంద్రీకరించే వారికి ఇటువంటి ఆలోచనలు రావు. దేశహితం కోసమే జీవితాలను ధారబోసే విధంగా విద్యార్థులు రూపొందాలి. పొరుగు దేశాలనుంచి వస్తున్న సవాళ్లనుంచి దేశం బయటపడే విధంగా వీరు తమ చేయూతనివ్వాలి. దేశ విశాలహితం దృష్టిలో ఉన్నప్పుడు ఇటువంటి చిన్న సమస్యలు సమస్యలే కావు.
ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలు మేధావులు భారతదేశంలోని యువకుల మేధస్సును వారి శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ వారి దేశం యొక్క అభివృద్ధికి మన దేశ యువకుల సహాయ సహకారాలు పొందాలని ఎదురుచూస్తున్న తరుణంలో దేశ సమగ్రతకు భంగం కలిగించి అసహిష్ణుతకు దారితీసే కార్యక్రమాలు మానుకోవాలి. సమర్థవంతమైన నాణ్యతతో కూడుకొనిన నైపుణ్యంగల విద్యావంతులను సమాజానికి అందించే ప్రయత్నంలో నిమగ్నమై దేశ హితైషులుగా యువకులు రూపొందాలి. సమాజోద్ధరకులుగా సహిష్ణుతకు మారుపేరుగా భావిభారత పౌరులుగా దేశానికి ఉత్తమమైన మార్గ నిర్దేశం చేయగల వారిగా కావాలని కోరుకుందాం.

- బలుసా జగతయ్య