సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచరణ
ఊరకే పారాయణం చేసి ప్రయోజనం ఏమిటి? అందులో కొంతయినా ఆచరణలో పెట్టలేకపోతే ఆ చదువెందుకు? దండగే!
మీరిప్పుడు నాకు మాట యివ్వనక్కరలేదు గాని, మీకు నచ్చిన మంచి పనులు ఏవైనా కొన్ని ఆచరించే ప్రయత్నం చేయండి! దానివల్ల మీకు తృప్తి, శాంతి కలుగుతాయి. నామస్మరణకన్న దైవత్వాన్ని మేలుకొలిపే సాధనం ఏముంది? దానితో ప్రారంభించండి!
తరుణోపాయం
సంసార సాగరాన్ని దాటించే నౌక ఎలా చిక్కుతుంది? దానికి సాధన కావాలి. విశ్వాసం, క్రమశిక్షణ వుండాలి. చిత్తశుద్ధి ఏర్పడాలి. భగవంతుడు మనకు పుట్టుక నిచ్చింది ఎందుకు? ఆయువునిచ్చింది ఎందుకు? ఇందుకే! నీ శరీరాన్ని మోక్షసాధనకు సాధనంగా చేసుకోమనే. భగవచ్చింతన చేయి. సదా ఆయన రూపాన్ని ‘సత్యం, శివం, సుందరం’లో దర్శించు. ఆయన నామాన్ని స్మరించు. ఇవన్నీ తారకాలే. (తరింపజేసే వుపాయాలే!).
పండుగ రోజున...
ఉగాది వంటి పవిత్ర పర్వదినాలలో దైవ చింతనకు పునరంకితం కావాలి. అందుకడ్డుగా వుండే అన్ని అలవాట్లనూ మానుకోవాలి.
ప్రకృతిని తిలకించండి! పచ్చదనాలు వొలికిస్తుంటుంది. మనిషో! బూజు పట్టిన భావాలతో, తాతలనాటి తగాదాలతో రోత కంపు కొడుతుంటాడు.
కృతయుగంలో తపస్సు, ధ్యానం చేసి తరించమన్నారు. త్రేతలో యజ్ఞం, ధర్మం, ద్వాపరంలో అర్చన. కాగా కలియుగంలో సేవ, నామస్మరణలు శరణ్యం. ఆ దేవదేవుని ఎల్లప్పుడూ స్మరించండి! భజించండి! ఫలితం సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, కరుణామయుడయిన ఆ పరమాత్మకి వదిలేయండి!
కొత్త పంచాంగం నక్షత్రాలూ, గ్రహాలూ ఎలా సంచరించేదీ చెబుతుంది. రాముని దయవుంటే దుష్టగ్రహాల ప్రభావం ఏమీ చేయలేదన్నారు త్యాగరాజస్వామి. మీరు అభివృద్ధిచెందాలి. పండుగకు కొత్త బట్టలు వేసికొని, అందరినీ కలుసుకొని కళకళ్లాడుతారుగదా! ఆ కొత్త బట్టలు యివే!
కోతే నయం!
మనసు కోతిలాటిది అంటుంటారు. కాని నిజంగా అది అంతకన్నా ఘోరం! కోతి ఒక కొమ్మనుండి మరో కొమ్మపైకే దూకగలదు. మనసా? హిమాలయ శిఖరంనుండి అధఃపాతాళానికైనా దూకుతుంది. కాలంలో అటూ యిటూ పరుగెడుతుంది.
దానిని నామస్మరణతోనే మచ్చిక చేయాలి. రామదాసు చేసినట్లు దానిని భద్రాచలంలా స్థిరంగా చేసుకోండి! మీకు నేను చెప్పే పని అదే!
మీ హృదయాన్ని రామనామంతో అయోధ్యగా మార్చుకోండి! అయోధ్య అంటే యుద్ధంలో జయించరానిదని అర్థం. నీ స్వభావం అదే! ఇది మరిచిపోతే. ఇంతే సంగతులు! రామనామాన్ని నీ మనసులో ప్రతిష్ఠించుకో. ఏ శక్తీ నినే్నం చేయలేదు.
మైమరపించు మధుర నామం
సేతువును నిర్మించే సమయంలో వానరులు ‘రామ, రామ’అంటూ బండరాళ్లను మోసికొని వచ్చారు. ఆ నామ జపంలో మైమరచిన వానరులకు బండరాళ్లు బరువనిపించలేదు. ఆ రాళ్లపై ‘రామ’అని వారు రాసేవారని చెబుతారు. ఆ రాళ్లు నీళ్లలో మునిగేవి కావు. ఒక పనిని చేస్తున్నట్లుకాక స్వామి పూజ చేస్తున్నట్లే వారు భావించారు.
రాముని పేరు మీరూ స్వీకరించండి. సంసారభారాన్ని తేలికచేసికోండి!
సంకీర్తన
నామ సంకీర్తనం చేసేటప్పుడు, శివుని పైన కీర్తన పాడటం కాగానే రాముని పైనా, కృష్ణుని పైనా-అలా ఆయా దేవతలపైన వరుసగా కీర్తనలను గానంచేస్తూ రావాలి. లేకపోతే శివుని ఇష్టదైవంగా కొలిచేవాళ్లూ, రాముని ఇష్టదైవంగా కొలిచేవాళ్లూ తమ తమ దైవాలపై కీర్తనలు రాలేదని బాధపడతారు. నీవు పొరపాటున వదిలేసినా, వాళ్లు తమ దైవాన్ని నీవు కావాలనే ఉపేక్షించావనుకుంటారు. భజనలో ‘నా దేవుడు, వాళ్ల దేవుడు’అన్న మూఢమైన గొడవలు రానీయకూడదు. ఇదే నా సలహా: ఏ పేరున పిలిచినా ఆయననే పిలుస్తున్నాము. ఇది గ్రహించాలి.
అసలు దారి అది!
ఉపవాసాలూ, జపాలూ, నామస్మరణలూ, యాత్రలూ, పురాణ పఠనాలూ ఏళ్లతరబడి చేసినా వాటిని మొక్కుబడిగానో, ప్రదర్శనకోసమో చేస్తే అవి ఆత్మదర్శనానికి మార్గం చూపవు. అందుకు కావలసింది చిత్తశుద్ధి. అది వుంటే, శ్రవణ స్మరణాది మార్గాలు ఫలిస్తాయి.
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది