సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామ మననం
ప్రేమతో మనసును పునీతం చేసికో. మాయ తొలగిపోతుంది. అసూయా, ద్వేషాలు అంతరిస్తాయి. అహంకారం నశిస్తుంది. ప్రేమలేకుండా ఏ పని చేసినా వుత్తదే.
ఇక్కడికి ఏటేటా వేలాది జనం వస్తుంటారు. భజనలు చేస్తుంటారు. ప్రసంగాలు వింటుంటారు. కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంటారు. వచ్చినప్పుడెలా వున్నారో అలాగే వుంటుంటారు.
భావం పలకాలి, నామంకాదు. అప్పుడే అది గుండెను తాకుతుంది. భగవన్నామాన్ని మననం చేయటం ఎలా? చిలక పలుకుల్లాకాదు. అందులో భగవానుని పట్ల నీ ఆరాధనాభావం వెల్లడవ్వాలి. నీ వినయం, అహంభావ రాహిత్యం తేటతెల్లం కావాలి. ఆయన మహిమలను తలచుకొని నీ మనసు పొందిన పులకింత అందులో ద్యోతకంకావాలి. ఆయన లీలలకు నీవు పొందే అద్భుతమైన అనుభూతి నీ ఉచ్ఛారణలో తొణుకుతూ వుండాలి!
కర్తవ్యం
మానవ జన్మ బుద్భుదప్రాయం. దేవుడొక్కడే నిత్యుడు, శాశ్వతుడు. అందుకే ఆయనను ధ్యానించు. అనిర్వచనీయమైన ఆయన ప్రశస్తిని కీర్తించు. ఆయన నామాన్ని భజించు. నీ మనస్సును ఆయన పుణ్యగాథలతో విస్తరించుకో! నీ ఆత్మనిండా ఆయన దివ్యకాంతులను నింపుకో! ఈ యుగంలో ప్రధానమైన కర్తవ్యం ఇదే!
స్వామి నామం స్మరించటమే తరణోపాయం. ఆయన ఆనందమయుడు. ఆయనే ఆనందం. ఆ ఆనంద మాధుర్యాన్ని రుచిచూడాలంటే ఆయన నామస్మరణే మార్గం. అదే సత్-చిత్-ఆనందం.
రామ, సాయి, కృష్ణ అనే చిన్న మాటలు సంసార సాగరాన్ని దాటించగలవా అని సందేహించకు. సముద్రం ఎంత విస్తారంగావున్నా చిన్న నావతో దాటే వాళ్లున్నారు. ఎంత దట్టమైన కీకారణ్యాల గుండా కూడ చిన్న దివ్వెతో దారి చూసుకొని వెళ్లే వాళ్లున్నారు.
భగవన్నామం చిన్నమాటే కావచ్చు. ప్రణవం అంతకన్నా చిన్నది కావచ్చు. అయినా వాటి శక్తికి అంతులేదు. నావ ఎక్కడైనా సముద్రమంత వుంటుందా?
అద్భుత విభూతి
భగవంతుని వర్ణించగల భాష ఏది? ఆయనను దర్శించిన అనుభూతే నీ జీవన పరమార్థం. మనిషికి ఆయన విభూతులనుచూస్తే అద్భుతం, భీతి కలుగుతాయి. తమతమ మానసిక స్పందనలనుబట్టి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలలో తనకనువైన దానిని భక్తుడెంచుకుంటాడు.
ఉదయం పనిపాటలకు పోయేముందు కాసేపు దేవుడిని తలుచుకో! రోజంతా గడిచిన తర్వాత, నీ పనంతా పూర్తిచేసుకొని ఏ గుళ్లోనో, మందిరంలోనో నలుగురూ కలిసి కృతజ్ఞపూర్వకంగా దేవుని భజించండి! ఆయన నామసంకీర్తన సాగించండి! ఆయనను ధ్యానించండి! కర్మపథంలో మీరు నిజమైన కర్మయోగులు కండి!
వాచిక తపస్సు
‘నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువ వలె’నన్నాడు ప్రహ్లాదుడు.
మన నాలుక చేయవలసిన ముఖ్యమైన పని అదే. మంచి మాటలే మాట్లాడాలి.
సత్యం బ్రూయాత్ (సత్యం చెప్పు)
ప్రియం బ్రూయాత్ (ప్రియమైన మాట చెప్పు)
నబ్రూయాత్ సత్యమప్రియం (అప్రియమైన సత్యాన్ని పలకకు)
ప్రియంచ నానృతం బ్రూయాత్ (ప్రియంగా మాట్లాడటంకోసం అబద్ధం చెప్పకు)
ఏష ధర్మ స్సనాతనః (ఇదే సనాతనమైన ధర్మం)
ఇలా మాట్లాడటం, నామజపం చేయటం ఇదే వాచిక తపస్సు.
నాలుక ప్రాశస్త్యం
ఆత్మ స్తుతీ, పరనిందా తగదని పెద్దలు చెప్పారు. అందరియందూ వున్నది భగవానే అయినప్పుడు, ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్లే కదా!
నాలుక అన్నిటినీ రుచి చూస్తుంది. ఆ పదార్థం మంచిదైతే జీర్ణాశయానికి పంపుతుంది కాని తాను అనుభవించదు. అట్టి త్యాగ గుణం నాలుకది.
సహనంలో నాలుకను మించినది లేదు. పదునైన దంతాలు ముప్పది రెండింటి మధ్య నేర్పుగా మెలుగుతూ వుంటుంది.
నాలుకను పవిత్రంగా వుంచుకో, తరించే దానికి సాధనంగా మలచుకో.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది