సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్తకి-కీర్తన
నర్తకి వలె వచ్చి మాయ నిన్ను మోహంలో పడవేస్తుంది. నీవందులోంచి బయటపడాలంటే ‘న-ర్త-కి’ని ‘కీ-ర్త-న’గా తారుమారు చేయి. నామ సంకీర్తన చేసి ముక్తి పొందు.
కలహ యుగం
కలియుగంలో ప్రేమతత్వం ఎక్కడా కనిపించదు. ఎక్కడ చూసినా అసూయ, అహంకారం, ద్వేషం, భయం, దురాశ కనిపిస్తున్నాయి. ప్రేమను అణచి వేస్తున్నాయి. అందువల్లనే ఇది కలహయుగమైంది. తల్లీకూతుళ్ల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురుశిష్యుల మధ్య, అన్నాదమ్ముల మధ్య, ఎవరిమధ్య చూసినా కలహమే. ఈ దుష్టప్రవృత్తిని దూరంచేసి మనస్సును పవిత్రమొనర్చి ప్రేమతో నింపగలది కృష్ణనామ సంకీర్తనమే.
పిలిస్తే పలుకుతా
పిలిచేవారిలో చిత్తశుద్ధి పెరిగితే, పలికేవానిలో తొందర కలుగుతుంది. పిలుపు పెదవులపైనుండి కాదు. ఆర్తితో నిండిన గుండెనుండి రావాలి.
వంటింట్లో ఓప్రక్క దేవతార్చన పెడతావు. నామాలు చదువుతుంటావు. కాని ధ్యాసంతా పొయ్యిమీదున్న కుక్కర్‌పై వుంటుంది. పాన్‌లోని వేపుళ్ల గుబాళింపుపై వుంటుంది. దైవచింతనలో వుండాల్సిన నీ మనస్సును కలుషితం చేస్తున్న ఆ వాసనలు విష వాసనలు. నీ నోటి వెంట వస్తోంది నామం. నీ చేతలో కనిపిస్తోంది కామం. రెంటిమధ్యా ఎంత వ్యత్యాసం! నీ సాధనకు అంతేమిటి? సాధిస్తున్నదో, కొంతే మరి! రెంటిమధ్యా ఎంత అగాధం!
ప్రతి వాడూ తిండీ బట్టా తేలిగ్గా, సుఖంగా సంపాదించుకొనేందుకు చూసుకుంటున్నాడు. సుఖం, సౌకర్యం-ఇవేనా జీవితంలో ప్రధానం?
కొందరు చిన్నా, కొందరు పెద్దా, కొందరు ఉన్నవారూ, కొందరు లేనివారు. కొందరు చదువుకున్నారు. కొందరికి చదువురాదు. అయినా అందరికీ ఆకలీ, దప్పీ వొకటే. ఆశ, నిరాశలు సమానమే. రోగం, నొప్పీ మామూలే. అలాటప్పుడు అబద్ధాలతో, అన్యాయాలతో మనసుకు మకిల పట్టించుకోడం ఎందుకు? తప్పుడు మాటలతో నాలుకను తాటిపట్ట చేసుకోడం ఎందుకు?
గుట్టంత పత్తిమీద ఒక్క నిప్పురవ్వ పడితే చాలు. బూడిదై కూచుంటుంది. భగవన్నామాన్ని స్మరించండి! పాపాలను క్షణంలో భస్మీపటలం చేయగల నిప్పురవ్వ అది! పొద్దెక్కిన కొద్దీ పొగ మంచు విడిపోయినట్లు, భగవన్నామాన్ని భక్తితో పలికితే పాపాలన్నీ పటాపంచలవుతాయి.!
మోక్షపురికి ప్రయాణం
దేహం ఒక సత్రం. మనస్సో కాపలావాడు. జీవి యాత్రికుడు. అతని యాత్ర ఎక్కడకు? మోక్షపురికి. అందుకతని ప్రయాణ సాధనం ఏమిటి? పరమాత్మ నామస్మరణే! ఆ నామ మాధుర్యంవల్ల అతనికి ఆయాసం, అశాంతి, అలసట కలగవు. ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా యాత్ర సాగుతుంది. అయితే ఇందుకతనికి సద్భావం అన్నవిత్తం వుండాలి. పాపభీతి లేక అది కలగదు. భయంవల్ల భక్తివల్ల భగవదారాధన అలవడుతాయి.
ఆశ్చర్యం
ప్రస్తుతం ప్రపంచం ఎలా వుంది? వానకై ఎదురుచూసే బీటలుబాసిన నేలలా వుంది. కరవు కాటకాలతో వేసారిన మనిషి కడుపునిండా తిండికోసం ఎదురుచూస్తున్నట్లు ఎదురుచూస్తూవున్నది. నిరాశానిస్పృహలతో వున్నది. కన్యాకుమారినుంచి హిమాలయాలదాకా నేను చూశాను. వేలాది జనం దర్శనం, స్పర్శనం, సంభాషణంకోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఇంతమంది వస్తున్నందుకు ఆశ్చర్యంలేదు. ఇంకా వేలాది మంది ఈ అదృష్టానికి నోచుకొనటంలేదే అన్నదే ఆశ్చర్యంకలిగించే విషయం.
ప్రతి హృదయంలో ధర్మాన్ని ప్రతిష్ఠించటమే యిప్పుడు చేయవలసిన పని. వేదాంతాన్ని పునరుద్ధరించటంవల్లనే యిది సాధ్యం. ఈ అవతార లక్ష్యం అదే! ఇందుకు కృషి ప్రేమను పెంపొందించటంద్వారా జరగాలి. ఆ కృషిని నామయజ్ఞంతో ప్రారంభించు.
మహోద్యమం
అందరికన్నా నీకు దగ్గర ఎవరు? భగవానే! ఆయనే నీకు తల్లీ. తండ్రీ, తోడూ, నీడ. ఉదయంనుంచి సాయంత్రందాకా ఆయన సాంగత్యంలోనే ఉండు.
అందుకే నేను అందరికీ బ్రహ్మముహూర్తంలో లేచి నగర సంకీర్తన చేయవల్సిందిగా చెబుతుంటాను. అది ఒక ప్రేమ ఉద్యమం. నామ యజ్ఞం. అందులో కుల, మత, జాతి, లింగ, ప్రాంత, వయోవివక్షత లేకుండా అంతా పాల్గొనవచ్చు. భగవన్నామాన్ని కీర్తిస్తూ లోకులకు సుప్రభాతం పలకటం ఎంత చక్కని సేవ! ఈ పవిత్ర యాత్ర నిన్ను క్రోధ ద్వేషాలనుండి దూరంచేస్తుంది. నీవు తరిస్తూ యితరులను తరింపచేసే దారి యిది. భక్త శిఖామణులైన జయదేవుడు. గౌరాంగుడు, తుకారాం, కబీరు వంటివారు, నడచిన త్రోవ ఇది. అనాదిగా దీనిని మనవారు ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఒక సాధనంగా ఉపయోగిస్తూ వచ్చినందున ఇది మనకేమీ కొత్తది కాదు.
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది