సబ్ ఫీచర్

చరిత్ర సృష్టించిన హినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హినా మునావర్.. పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రభావిత స్వాత్ జిల్లాలో ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కమాండింగ్ అధికారిగా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. స్వాత్ సహా ఖైబర్ పంఖ్తూంఖ్వాలోని ఎక్కువ జిల్లాలపై గత కొంతకాలంగా మిలిటెంట్ ఘటనల ప్రభావం తీవ్రంగా ఉంది. మిలిటెంట్లకు, సైనికులకు మధ్య పోరాటం జరిగినప్పుడు పౌరులు, ఇతర సైనిక సిబ్బంది, అధికారులు టార్గెట్ అవుతున్నారు. ఇప్పటివరకూ నలుగురు ఫ్రంటియర్ కానిస్టేబులరీ పోలీసు అధికారులు సహా మొత్తం 360 మంది సైనికులను లక్ష్యంగా చేసుకున్నారు. 1915లో బోర్డర్ మిలిటరీ పోలీస్, సమానా రైఫిల్స్‌ను కలిపేసి ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీని ఏర్పాటుచేశారు. ఈ దళాలు ఆంగ్లేయుల కాలం నుంచీ సరిహద్దులను కాపాడే విధుల్లో ఉన్నాయి. ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ దళాలను ప్రధానంగా ఖైబర్ పంఖ్తుంఖ్వా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటుచేశారు. వీరిని పాకిస్తాన్‌లోని వివిధ భాగాల్లో మోహరించారు.
పంజాబ్ ప్రాంతంలోని ఫైసలాబాద్‌కు చెందిన హినా మునావర్ స్వాత్‌లోని ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో తనను నియమించడం గర్వంగా ఉంది అంటోంది. ఎంఫిల్ పూర్తిచేసిన హినా తర్వాత సీ ఎన్ ఎస్ పరీక్ష పాసయ్యింది. మొదటినుంచీ ఆమె పోలీసు సేవలకే ప్రాధాన్యం ఇచ్చింది. పాకిస్తాన్ పోలీస్ సేవల్లో ఆఫీసర్‌గా నియమితురాలైంది. తన బాధ్యతలు పూర్తిచేయడంతో పాటు స్వాత్ ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో పనిచేసే సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని అనుకుంటోంది హినా. ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆమె అహర్నిశలు కృషి చేస్తోంది. ఒక మహిళగా తనకు ఈ విధులు నిర్వహించడం ఏమాత్రం కష్టంగా లేదని చెబుతోంది హినా. పాకిస్తాన్‌లోని సీ ఎన్ ఎస్ పరీక్ష పాసై పోలీసు సేవలకు ఎంపికైన ఏడుగురు మహిళలను ఏడాదిపాటు ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో నియమించనున్నారు. వారిలో ఇద్దరి ఖైబర్ ఫఖ్తూంఖ్వాలో, నలుగురిని ఇస్లామాబాద్‌లో, ఒకరిని గిల్గిత్‌లో నియమించారు. ఈ మహిళలు ప్రధానంగా ఏ ఎస్పీ ర్యాంక్‌వారు. అయితే ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో వీరిని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లేదా కమాండింగ్ ఆఫీసర్ అంటారు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడంతో పాటు క్రమశిక్షణకే ప్రాధాన్యం అంటున్నారు. పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా స్వాత్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈమె పరిస్థితిని ఎంతో మెరుగుపరిచింది. ముందు ముందు అక్కడి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అంతేకాదు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కూడా చెబుతోంది.
హినాకు పెళ్లైంది. ఒక పాప కూడా. తన వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు ఇంటినీ, కుటుంబాన్ని కూడా ఎంతో బాధ్యతాయుతంగా బాలెన్స్ చేసుకుంటోంది హినా. ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ ఒక సంప్రదాయ పోలీసు దళంగా ఉంది. గిరిజన ప్రాంతాలు, శరణార్థుల మధ్య ఉన్న సరిహద్దుపై నిఘా పెట్టడం వారి ప్రధాన విధి. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో మహిళలు ఉన్నత పదవుల్లోకి రావడం వల్ల దాని పనితీరు మెరుగు పడుతుందని అక్కడందరూ ఆశాభావంతో ఉన్నారు. మహిళలు రికార్డులు చూసుకోవడమే కాకుండా, ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కార్యాలయ పనితీరును కూడా మెరుగుపరుస్తున్నారు. ఎఫ్‌సీలో ఇప్పటివరకూ మహిళా సిబ్బంది లేరు. కానీ ఇప్పుడు మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పోలీస్ డ్యూటీ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో వారు చాలా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా మహిళలు అన్ని రకాల ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తూ అందలాలనెక్కుతున్నారు. *