సబ్ ఫీచర్

ఆరోగ్యసిరి ఉసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసం వచ్చేసింది. ఉసిరికాయలూ వచ్చేశాయి. ఆమ్లా అనీ, ఇండియన్ గ్రూస్బెర్రీ అని పిలుచుకునే దీనిలో పోషకాలు అధికం. శరీరానికి మేలుచేసే కాయల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మరి ఉసిరికాయ ఎలాంటి పోషకాలను అందిస్తుందో, దాంతో శరీరానికి జరిగే మేలేంటో ఒకసారి చూద్దామా..
* ఉసిరికాయ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఉసిరికాయ తినడానికి కాస్త వగరుగా, పుల్లగా అనిపించినా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.
* ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఐరన్ కూడా ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల దీని తరచూ తీసుకుంటుంటే ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు.
* ఉసిరికాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది.
* ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఏ కూర

గాయలో, పండులో లేనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి.
* కలబందను, ఉసిరికాయ జ్యూస్‌ను సమానమైన నిష్పత్తిలో తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.
* ఉసిరికాయ రసం శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది.
* ఉసిరికాయను తరచుగా తినడం వల్ల ప్రొటీన్ సింథసిస్ ఫ్యాట్‌ను దరిచేరకుండా చేస్తుంది.
* శరీరంనుంచి విషపదార్థాలను తొలగించి, శక్తిసామర్థ్యాలను పెంచుతుంది.
* ఉసిరికాయ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉసిరికాయను తరచూ తీసుకోవడం వల్ల బౌల్ మూమెంట్ చురుగ్గా మారుతుంది. ఇందులో పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల బౌల్ మూమెంట్ మెరుగ్గా పనిచేసి పెద్దపేగులోని విషపదార్థాలను చురుగ్గా బయటకు నెట్టేస్తుంది.
* ఉసిరికాయ రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అవాంఛిత విషపదార్థాలను బయటకు పంపిచేస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. మొత్తంగా ఉసిరికాయ నాచురల్ డీటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది.
* ఉసిరికాయ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి కంటి కండరాలను స్ట్రాంగ్‌గా మారుస్తాయి.
* ఉసిరికాయ గుండెకు కూడా చాలా మంచిది. శరీరంలో ఉండే చెడు కొవ్వును ఇది తొలగిస్తుంది. ఫలితంగా గుండెకు సరఫరా అయ్యే రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.
* ఉసిరికాయలో అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
* ఉసిరికాయల్లోని విటమిన్ సి ఆహారపదార్థాల్లోని కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది.
* ఉసిరికాయ జ్యూస్‌ను తేనెతో కలిపి తీసుకుంటే ఆస్త్మా దూరమవుతుంది.
* ఉసిరికాయ జ్యూస్ ఆస్త్మానే కాదు శ్వాససంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది.
* హెయిర్‌ఫాల్, తెల్లజుట్టు, చుండ్రు వంటి అనేక సమస్యలకు దివ్యౌషధం ఉసిరి.
* ఉసిరికాయ మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే క్రోమియం కంటెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి మేలు కలిగించే దివ్య ఔషధం ఉసిరి.
*