సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవే నీ ఏకైక కర్తవ్యం
ఈ ప్రపంచం అంతా భగవన్మమయమే. ప్రతి వ్యక్తీ భగవత్స్వరూపమే. విశ్వం, వ్యక్తి దైవం, ఈ మూడు త్రిమూర్తుల వంటివారు. బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు వేరు, వేరు నామరూపాలతో ఉన్నా నిజానికి ఆ ముగ్గురూ ఒక్టే. అదే పరబ్రహ్మం. ఏకం అన్న భావనను స్మరిస్తూ సమాజసేవ చేయడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన.
సమయం వృథా చేయకు
ప్రతిరోజూ కొంత సమయం నీవు సాధనకు కేటాయించాలి. ప్రస్తుతం క్లబ్బులకూ సినిమాలకు తిరిగి నీవు సమయాన్ని వృథా చేస్తున్నావు.. ఆ సమయాన్ని భగవచిక్చంతనలో గడిపితే ఈంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నీ మాతృభూమి నీకు అమూల్య సంస్కృతీ వారసత్వాన్ని ప్రసాదించింది. ప్రపంచం నలుమూలల నుండి ఎందరో ఆ సంస్కృతీ సంప్రదాయాలంటే ఆకర్షితులై వస్తున్నారు. నీవు అట్టి సంస్కృతిలో జన్మించినందుకు కృతజ్ఞుడివిగా ఉండు. సంస్కృతిని గురించి చక్కగా అధ్యయనం చేయి. అది నిర్దేశించే క్రమశిక్షణను పాటించు. దీనులనూ, పేదలనూ కష్టజీవులను సేవించు.
పరిణామ స్ఫోరకం
అనాదిగా భారతీయ సంస్కృతిలో ప్రేమతత్వం అంతర్వాహినిగా ఉంటున్నది తరతరాలుగా ఇక్కడ యువతకు పేదవారిని, నిస్సహాయులను, దీనులను, అంగవికలురను, నిరక్షరాస్యులను బళహీనులను,వృద్ధులను ప్రేమించవలసిందిగా బోధిస్తూ వచ్చాను. దానికి కారణం ఏమిటి? తనయందు ఏ బ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మమే వారి యందూ ఉన్నది. కనుక ‘ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపశ్యతి’ తనయందు నఖిలభఊతములందు నొక భంగి సమహితత్వంబున బరగుట’ ఇదీ దాని రహస్యం. ఇదీ సేవ అంతరార్థత. సేవ జాలికి పరిమితం కాదు. అదక ఉదాత్త ఉన్నత వేదాంత భావన. ముక్తికి సోపానం. మన విద్యావిధానం . ఈ విషయాన్ని విద్యార్థికి అవగాహన అయ్యేటట్టు చేయాలి.అ తనిలోని ప్రతిభు చక్కా వికసించచేయడంతోపాటు విద్య అంతనిలోని ప్రతిభను చక్కగా వికసింపచేయటంతో పాటు విద్యఅతనిలో నిస్వార్థ సేవా తత్పరతను రేకెత్తించగలగాలి. ప్రేమ తత్వాన్ని నిలపాలి. విద్య జ్ఞాన దాయకమే కాక పరిణామ స్ఫోరకంగా కూడా ఉండాలి.
సమాజ సేవకులకు సలహా
సమాజ సేవ చేసే వాళ్లందరూ గమనించాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. మీ మనసులను పరిశుద్ధం చేసుకోండి. అప్పుడే ఇంకొకరికి సలహా ఇవ్వగలుగుతారు. ముందు మీరు మనశ్శాంతిని సాధించి తరువాత ఇతరులకు చెప్పండి శాశ్వతానంద రహస్యం ఏదో ముందు మీరు గ్రహించండి. తరువాతనే ఇతరులకు శాశ్వతానందాన్ని పొందే భాగ్యాన్ని అందించండి.
పవిత్ర హృదయం
హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోడం చాలా ముఖ్యం. నిర్మలమైన మనస్సు, ధ్యానంకన్న జపం కన్నా ప్రధానమైంది. నీలోని దైవం గురించి అంటే క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుని గురించి నీకు నమ్మకం కలిగించేది పవిత్రత ఒక్కటే. అందరినీ సేవించు, ప్రేమించు. అదే భగత్పృపను కలుగుచేస్తుంది. అదే అర్చన. అదే ఆరాధన.
సేవయే దైవం
సేవయే దైవం. మనిషి దేహం, బుద్ధీ, మనసూ దేవుడెందుకు ఇచ్చాడు? మనసుతో ఆపన్నుల పట్ల సానుభూతి చూపు. బుద్ధితో ఇంకొకరికి సాయం పడడం ఎలా అని ఆలోచించక శరీరంతో దీనులకు సేవ చేయి. ఆపన్నులకు నీవు చేసే సేవ దేవునికే చేస్తున్నావు. అదే నీవు చేసే అర్చనం. అదే నీవందించే నివేదనం. సేవా పుష్పంతోనే ఆయనను అర్చించు. సత్యసాయి ప్రబోధిస్తున్న విషయాలను ఆచరణలో పెట్టు. నలుగురికీ చాడు ఆ ఆదర్శాలెంత గొప్పవో నీ ఆచరణలో నిరూపించు. కేవలం ఆర్భాటాలకు పోకుండా ఎంత సాయం చేయగలవో అంత చేసినా చాలు భగవంతుని మెప్పు లభిస్తుంది. కానీ కేవలం వూకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే మాత్రం అవి నీకు పనిచేయవు. ఇతరులకూ ఉపయోగపడవు.

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.