సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ యజమాని వెంట నడు
సాయిని కొలుస్తున్నావు. కాని తోటి మానవులను నీచంగా చూస్తున్నావు. నీకు అనుగ్రహం ఎలా లభిస్తుంది. నీవు వేసుకొన్న దుస్తులు నడచే నడత నీవెటువంటి వాడివో చెబుతాయి. ఇతరుల పట్ల నీవెలా ప్రవర్తిస్తావో దానిని బట్టి నీ మంచితనం వెల్లడవుతుంది. ఎప్పుడూ మృదు మృధురంగా మాట్లాడటం అలవర్చుకో. పవిత్రమైన వాటి వంకే చూడటం పెట్టుకో. నిరాడంబరంగా శుభ్రంగా ఉండే దుస్తులు వేసికో. ఫ్యాషన్లకై పాకులాడకు. అందుకకోసం వారినీ వీరినీ అనుకరించకు. సామాన్య మానవుడికి దూరంగా పోతూ అతినకి నీవు సేవ ఎలా చేస్తావు. నీ యజమాని వెంటనే నీవు నడు. నీ యజమాని ఎవరు? నీ అంతరాత్మే!
కాలాన్ని వృథా చేయకు
ఇంటి పనులను చేసేటపుడు ఆ పనులన్నిటినీ భగవదర్పితంగా భావించి చేస్తూండు. గంటల కొద్దీ ధ్యానం చేసేదాని కన్నా అదెంతో నయం. ఈ పనులను చేయటానికి కూలివాడిని పెట్టి చేయించడం ఎందుకు?
కాలాన్ని వృథా చేయడం తప్పు. ఒక విషయ వ్యామోహం నుండి మరొక దానికి దూకుతుండటమేనా జీవిత లక్ష్యం? అవి ప్రయోజనం లేని పనులు. అవి నిన్ను నీ గమ్యానికి దూరంగా తీసుకొని పోతాయే కానీ దగ్గరకు చేర్చవు. సుఖసంతోషాలను పంచు. ధైర్యం చెప్పు. ఆసరా ఇవ్వు. ఆర్తులను ఆదుకో. కుంటివారికీ, గుడ్డివారికీ దారి చూపు. ప్రయోజనకరంగా మనిషి తన కాలాన్ని వెచ్చించే విధానం.
ఎవరి పని వారిదే
ప్రశాంతి నిలయాన్ని చూడండి. ఎంత శుభ్రంగా ఉందో? ఏమిటి కారణం? ఈపని కోసం ఎంతమంది స్వీపర్లను పెట్టి ఉంటారు? ఎంతమంది కూలీలు పని చేసి ఉంటారు? అని మీరాశ్చర్యపోవచ్చు. కానీ ఒక్కర్ని కూడా పెట్టలేదు. ఇదంతా ఎవరు శుభ్రం చేశారు? ఎవరికి వారే! తామున్న ప్రదేశాన్న పరిసరాలను కూడా శుభ్రం చేసుకొంటున్నారు. పైసా ఖర్చులేకుంటా పారిశుద్ధ్యాన్ని కాపాడుట కోవటం జరుగుతున్నది ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ప్రశాంతి నిలయంలోవలె అతి తక్కువ ఖర్చుతో వనరులను ఇంత ప్రయోజనకరంగా వినియోగించుకొనే స్థలం ఇంకొకటి లేదు అని చెపపవచ్చు.
వేడుకల నిర్వహణ
శివరాత్రి, నవరాత్రి, జన్మదినోత్సవం, ఏ పండుగను జరుపుకున్నా సరే ప్రశాంతినిలయంలో దుబారా, ఆడంబరాలూ కనుపించవు. దసరా వచ్చిందంటే ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని కొందరనుకొంటారు. కానీ వచ్చే వారంతా మనస్ఫూర్తిగా సేవ చేయాలని వచ్చేవారే కానీ నయాపైసా అడిగేవారు కాదు. యజ్ఞాలు చేయించే ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నారే కానీ ఏదో ఆశించి కాదు. వారికున్న ప్రేమ , విశ్వాసాల కొద్దీ వారు వస్తున్నారు. వారికి కావలసిన సౌకర్యాలను సేవాదళ్ వారూ, వాలంటీర్లు చూస్తారు. ఇందుదేనికీ ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన పని ఉండదు.
మీ మధ్యనే
మీరెక్కడ పనిచేస్తున్నారో నేనూ అక్కడే ఉంటాను. నేను మీ మధ్యనే ఉంటాను. మీతోనే ఉంటాను. మీ వెనకనే ఉంటాను. మీమీ ఊళ్లల్లో మీరు భజన చేస్తున్నా బీదలకూ, రోగులకూ పిల్లలకూ సేవ చేస్తున్నా నేనూ మీతోనే ఉంటాను. మీరు నాకోసం ఏర్పాటు చేసే ప్రత్యేక ఉన్నతాసనంలో ఎక్కడో విడిగా, దూరంగా కూచుంటానని అనుకోకండి. మీలో ఒకరిగా మీ కార్యక్రమాలల్లో పాల్గొనే వాడిగా నేను మీ మధ్యనే ఉంటాను. ఎందుకో తెలుసా? మీకు స్ఫూర్తి కావాలనుకొన్నపుడు అందించడానికి వీలుగా మీ వద్దనే ఉంటాను. ప్రతిమనిషిలోని ఉండే అంతరాత్మ భగవంతుడే కదా. మరి మీరూ, నేను అనేవిభజన ఎక్కడాలేదు. అందరూ భగవంతుని స్వరూపాలే. మీరు సేవ చేసేది భగవంతునికే సేవ చేయించేవానిలోను, చేయంచుకునే వానిలోను నేను ఉన్నాను.
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.