సబ్ ఫీచర్

ఆవేశం అనర్థదాయకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావోద్వేగాలలో సంతోషం, దుఃఖం, ప్రేమ, చిరాకు, కోపం, ఛీత్కారం వంటివి మనుషుల్లో సాధారణమే. అయితే ఈ భావోద్వేగాలు అదుపులో ఉన్నంతవరకే సంతోషం, సుఖం. వీటిలో ఏది ఎక్కువైనా కష్టమే. భావోద్వేగాలలో మనిషి తనని తాను ఖచ్చితంగా నిత్రించుకోవాల్సిన భావోద్వేగం కోపం, ఆవేశం. కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే పెద్దలు కోపం గురించి కొన్ని మంచి విషయాలను అందించారు. అలాగే సుమతి శతకారుడు వాక్రుచ్చిన ‘తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకి మిత్రుడు దయంభవు సుమితి’! ఎల్లకాల్లోనూ ఉపయోగపడుతుంది అనడంలో సంహం లేదు.
కోపం ఏమిటో ఓసారి చూద్దాం. షడ్గుణాలలో ఒకటైన క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం- మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతికానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడి చేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుంది. అందుకే క్రోధం కలిగినపుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. కోపం, అహంకారం ఎక్కువగా వుండే వ్యక్తులకు కెరోటిడ్ రక్తనాళాలు ముందుగా మారిపోవడంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు కోపం ఎక్కువ అయితే అధిక రక్తపోటు వచ్చే అవకాశం వుంది. అధిక రక్తపోటు అనేక అనర్థాలకు దారితీస్తుంది అని తెలిసిందే. కోపం ప్రకృతిపరమైన సహజ ఉద్వేగం. అయితే దాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే మాత్రమే చూపించాలి. ఎక్కువ కోపం అన్నివేళలా అనర్థదాయకం.
మనకు ఎదురైన సవాలు పెద్దది అయినపుడు లేదా తన శక్తికి మించినపుడు భయంతో దూరంగా పారిపోవాలని చూస్తారు. అదే సవాలును తాము చక్కదిద్దగలం అనుకున్నపుడు, తన స్తాయి తక్కువ అయినపుడు దబాయింపు లేదా దౌర్జన్యానికి దిగుతారు. ఈ దబాయింపులో భాగంగా అవసరం అయితే పోరాటం చేస్తారు. ఆ విధంగా భయం, పిరికి, దబాయింపు అనే ప్రవర్తనలు మనుషుల మనుగడ కోసం నిరంతరం మారుతూనే వుంటాయి. ఇది మనుషులకే కాదు జంతువులలో కూడా వుంటాయి. కాకపోతే వ్యక్తంచేసే తీరు మాత్రం వేరేగా వుంటుంది. కోపాన్నీ, భయాన్ని పుట్టించే కేంద్రం మెదడులోపల ‘లింబిక్ లోబు’లో వుంటుంది. సందర్భాన్ని బట్టి ఈ రెండింటిలో ఏ ఉద్వేగం కలిగినా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయత్తపరచే అడ్రినలిను, నారడ్రిలను హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల బీపీ పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్ళూ చేతులకు రక్తప్రసరణ ఎక్కువ కావటం, ఊపిరి ఎక్కువగా తీసుకోవడం లాంటి లక్షణాలు కనపడతాయి. అలా కోపం వచ్చినా, భయం వచ్చినా శరీరంలో జరిగే మార్పులు, కనపడే లక్షణాలు ఒకేలా ఉంటాయి.
మెదడులో భయం, కోపానికి సంబంధిచిన కేంద్రాలు పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు నిరంతరం పనిచేస్తూనే వుంటుంది. అయితే వాటిని భయపడనీయకుండా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ అవసరం అసరమైనచోట కోపాన్ని ప్రదర్శిస్తూ మరికొంత అణచివేస్తుంటాం. ఈ భావోద్వేగం కూడా ‘లింబిక్ లోబు’లోనే ఉంటుంది. ఈ కేంద్రాన్ని సడలిస్తే కోపం బయటకు వస్తుంది. ఎంత సడలింపు జరిగితే ఆ మేరకు కోపం వస్తుంది. అయితే ఈ సడలింపును అణచివేత కేంద్రం తనకు తానుగా ఇవ్వదు. మానవులలో సామాజిక అంశాలను పర్యవేక్షించే ‘ప్రీ ప్రాంటల్ కార్టెక్సు’ ఆదేశాలను అందుకొని దాని ప్రకారం సడలిస్తుంది. ఈ ఆదేశాలవలనెనే మనిషి ఉద్రేకం చెందుతాడు. తన కళ్ళఎదురుగా జరిగే సంఘటనల వలన కోపం తెచ్చుకొని ఘర్షణకి దిగుతాడు. కోపాన్ని తెప్పించే సంఘటన జరిగినపుడు దాని తీవ్రతను బట్టి సడలింపు ఆదేశాలను ఇస్తుంది. దానివల్లనే ఉద్రేకం ఎక్కువై ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటాము. దీన్ని మన విల్ పవర్ అంటే నియంత్రణ శక్తితో తగ్గింవచ్చు.
మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమైన సహజ పరిస్థితుల (ప్రాణాపాయం, మనుగడ) కంటే సామాజిక పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం తదితర అంశాలకు భంగం వాటిల్లినపుడు కోపంపై వున్న అణచివేత వైదొలుగుతుంది. మనిషికి వచ్చే కోపాన్ని ప్రదర్శించడంలో కూడా వైవిధ్యం కనపడుతుంది. మిగతా జీవులు పోరాటం, పలాయనం అనే ఆదిమ పద్ధతుల్లో మాత్రమే కోపాన్ని వ్యక్తీకరిస్తాయి. మనుషులు మాత్రమే అరవటం, తిట్టడం, అవమానర్చటం, చెయ్యి చేసుకోవడం, దాడి చేయడం, వస్తువులు పగలగొట్టడం లాంటి చురుకు కోపపు (యాక్టివ్ అగ్రెసెన్) రూపాలతో పాటు, వౌనపోరాటం, నిరాహారదీక్ష, అలగటం, సహాయ నిరాకరణ లాంటి మెతక కోపపు (పాజిటివ్ యాగ్రెసెన్) రూపాలలో కూడా చూపుతారు.
కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమష్టి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు కూడా వుంటాయి. బంద్‌లు, ధర్నాలు, పెన్‌డౌన్ లాంటి కార్యక్రమాలు ఉమ్మడిగా కోపాన్ని ప్రదర్శిచటమే. అలాగే ఒక జాతి లేదా వర్గం ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి సామూహికంగా చూపే ఉమ్మడి కోపమే సత్యాగ్రహం, విప్లవ పోరాటం, ఉగ్రవాదం లాంటి రాజకీయ పోరాట సిద్ధాంతాలవుతాయి.
ఏదిఏమైనా కోపం ఒక సామాజిక ప్రయోజనం కోసం నలుగురి మంచి కోసం కోపాన్ని, నిరసనను శాంతియుత పద్ధతుల్లో వ్యక్తీకరిస్తే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగత కోపాన్ని మనిషి నియంత్రించుకోనంత కాలం అన్ని బంధాలకి దూరం అవుతాడు. కోపిష్టిగాను, అహంభావిగాను నలుగురిలో చులకనవుతాడు. అందుకే తన కోపమే తనకి శత్రువు తన శాంతమే తనకు రక్ష’. ఈ విషయాన్ని మనుషులే కాదు దేశాలు, ఖండాలు గుర్తుంచుకొని ముందడుగువేస్తేనే సుఖ సంతోషాలతో ముందుకు సాగుతారు.

-పుష్యమీసాగర్