సబ్ ఫీచర్

‘ఒకే దేశం-ఒకే వేతన దినం’ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర కార్మిక, ఉపాధిశాఖల మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ ఇటీవల మాట్లాడుతూ, ‘ఒకే దేశం-ఒకే వేతన దినం’ విధానంలో కార్మికుల బ్యాంకు అ కౌంట్లలోకి నేరుగా జీతాలు వెళ్లేలా చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు ప్రకటించారు. ఈ యోచన పట్ల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నది. ఇది అమల్లోకి వస్తే- ప్రపంచ కార్మిక లోకం సర్వత్రా హర్షం వ్యక్తం చేయనున్నది. ఇప్పటికే కార్మికులకు అనుకూలమైన చట్టాలను అమలుచేస్తున్న చైనా, రష్యా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఒకే వేతన దినం విధానం పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో మహాకవి శ్రీశ్రీ- ‘ఓరోరి.. కూలీ.. ఔరా... హమాలీ.. పల్లెటూరు వదిలావు, పట్నానికి కదిలావు’అని తన అభ్యుదయ కవిత్వంతో కార్మికులను కదిలింపచేశారు.
బ్రిటీష్ బానిస చట్టాలు కాలగర్భంలో కలసిపోయి, స్వతంత్ర భారతంలో కొత్త చట్టాలు వచ్చినప్పటికీ.. ‘యజమానుల రాజరికం- కార్మికుల బానిసత్వం’ అనే ప్రక్రియ నేటికీ కొనసాగుతూనే వున్నది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వున్న దేశాలలోనే కాకుండా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వున్న కొన్ని దేశాలలో సైతం అనేక యాజమాన్య వ్యవస్థలు కార్మికులకు లాభాల్లో భాగస్వామ్యం కల్పించాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వున్న మన దేశంలో సగానికి పైగా కర్మాగారాల్లో, యాజమాన్య వ్యవస్థల్లో తప్పనిసరిగా కార్మికులకు భాగస్వామ్యం కల్పించవలసి వుంది. అయితే కార్మికుల భాగస్వామ్యం అనేది మన దేశంలో దాదాపు కలగానే మిగిలిపోయింది. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో నడుస్తున్న ఆర్టీసీ వంటి సంస్థల్లో, సహకార కర్మాగారాల్లో కూడా కార్మికులకు లాభాల్లో భాగస్వామ్యం కల్పించబడలేదు. పరిశ్రమలు స్థాపించే నల్లధన ప్రముఖులకు పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల పేరుతో వందల, వేలాది ఎకరాలు తక్కువ ధరలకు అప్పగించడం, విద్యుత్, నీరు, రవాణా, మార్కెటింగ్ రంగాల్లోనూ రకరకాల రాయితీలు కల్పించడం తెలిసిందే. నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు మాత్రం అరకొర జీతాలు, వ్యాధులు వస్తే తూతూ మంత్రంలా ఇ.ఎస్.ఐ. సౌకర్యాలు, చిన్నా చితకా బీమా సౌకర్యాలు మాత్రమే ఇప్పటివరకు అమలులో వున్నాయి. పనికి తగిన వేతనం, శ్రమకు తగిన ఫలితం కూడా ఆశించిన స్థాయిలో లేవు. తగిన వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇస్తున్న జీతాలు కూడా నెల మధ్యలోనో, నెలాఖరులోనో కొన్ని సంస్థలు ఇస్తుండగా, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలవంటివి మూడు నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నాయి.
గతంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయ ఈ వేతన చట్టాలను, కార్మిక చట్టాలను కొంతమేర కార్మికులకు అనుగుణంగా తీసుకొచ్చారు. ఇండ్లలో పనిచేసే ఆయాలకు సైతం ఏడువేల రూపాయలు, కిరాణా షాపులలో గుమాస్తాలుగా పనిచేసేవారికి ఎనిమిది వేల రూపాయలు కనీస వేతనం వుండాలనీ, తప్పనిసరిగా ఈ వర్గాల కార్మికులకు పీఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించాలని అప్పుడు చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. యాజమాన్యాలు చెల్లించే పీఎఫ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత శాతం పీఎఫ్ మొత్తం చెల్లిస్తున్నది. ఆయాలకు, గుమాస్తాలకు నేటికీ సరైన విధంగా వేతనాలు రాకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ వాటా పీఎఫ్ మొత్తం చాలామంది ప్రైవేట్ ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతున్నది. నేటి కార్మిక ఉపాధి శాఖల మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ మరో అడుగుముందుకేసి నేడు ‘ఒకే దేశం- ఒకే ప్రజ- ఒకే చట్టం’ అనే నినాదానికి అనుగుణంగా జీఎస్టీ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఆయా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఆదాయపు పన్ను ఎలా వసూలుచేస్తున్నారో ఇప్పుడు కార్మికులను, చిన్నపాటి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ‘ఒకే దేశం- ఒకే వేతన దినం’ అనే పద్ధతిని తీసుకురావాలని యోచించడం చాలా అభినందనీయం. దీని ద్వారా సమాజంలో చాలావరకు ఆర్థిక అసమానత్వం తొలగిపోయి, అనేక వర్గాల మధ్య అంతరాలు దూరమై అభ్యుదయంతో, అభిమానంతో, అభివృద్ధితో కూడిన బంధాలు దగ్గరై, ప్రగతి పథంలో ముందుకెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకే రోజు వేతనం చెల్లింపచేసే చట్టంతోపాటు కార్మికుల భాగస్వామ్యం కూడా తప్పనిసరిగా అమలయ్యే విధంగా సంబంధిత చట్టాలలో మార్పులు తీసుకువస్తే మరింత బాగుంటుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు