సబ్ ఫీచర్

పిల్లల మాటలు విందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్న లాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ ‘విసిగించకు’ అంటూ కసిరే కసురులు.. అమ్మ వంటింట్లో పనిచేసుకుంటూ ‘డిస్ట్రబ్ చేయొద్దు నాన్నా.. పనిలో ఉన్నా.. ఆఫీసుకు లేటయిపోతుంది..’ అంటూ అమ్మ విసుగ్గా చెప్పే విన్నపాలు.. ఇక అమ్మమ్మ, తాతయ్యల ఊసే లేదు. ఆ చిన్నారికి ఏం చేయాలో తోచదు.. ఏ స్మార్ట్ఫోన్‌ముందో, టీవీ ముందో కాలం గడిపేస్తాడు.. ఇదీ ఇప్పటి తరం పరిస్థితి. దీనికి మనలాంటి పెద్దవాళ్లు.. ఆఫీసు పని ఎక్కువగా ఉందనో, సమయం లేదనో.. సాకులు ఎన్నిచెప్పినా.. నేటి తరాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేని బాధ్యత మాత్రం పెద్దవారిదే.. ‘అదేంటి.. నేను మా పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో వేశాను.. వాళ్ళే అన్నీ నేర్పిస్తారు’ అని గొప్పలకు పోతున్నారా? అన్నీ బడిలో నేర్చుకున్నా.. సంస్కారం మాత్రం ఇంటి నుండే మొదలవ్వాలి.
వందల మంది ప్రేక్షకుల ముందు అనర్గళంగా అపన్యసించవచ్చు. కానీ ఓ పసివాడి మనసుకు హత్తుకునేలా మాట్లాడటం మాత్రం చాలా కష్టం. కారణం.. పెద్దల దగ్గర పదాల గారడీ చేయవచ్చు. ఉపమానాల్ని అరువు తెచ్చుకోవచ్చు. నానా విన్యాసాలూ చేయవచ్చు. పిల్లల విషయంలో అలా కుదర్దు. పిల్లల దగ్గర మనం మనలా ఉండాలి. మనలానే మాట్లాడాలి. గుడికెళ్లినప్పుడు, చెప్పుల్ని బయట వదిలిపెట్టినట్లు.. పిల్లలతో మాట్లాడేటప్పుడు మనకే అన్నీ తెలుసన్న అజ్ఞానాన్ని, అహాన్ని వదిలేసుకోవాలి. అప్పుడే పిల్లలు మనల్ని నమ్ముతారు. ప్రేమగా మన మాటల్ని ఆలకిస్తాడు. అయినా ఇప్పటి తల్లిదండ్రులకి అంత ఓపిక, తీరిక ఎక్కడిది? వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు, స్మార్ట్ఫోన్లు తండ్రుల నోళ్లనూ, టీవీ కార్యక్రమాలు, కొలువులు తల్లుల నోళ్లను కట్టిపడేస్తున్నాయ. మనలాంటి కెరీర్ జీవుల్ని, డబ్బు మనుషుల్నీ నమ్ముకుని పసివాళ్లు ఈ భూమీదికొచ్చింది.. కాదు కదా.. అందుకే రోజూ కాసింత సమయం తీసుకుని పిల్లల మాటలు విందాం..
* పిల్లలకు మూడు, మూడున్నర సంవత్సరాలు వచ్చేటప్పటికి మాటలతో పాటు ప్రశ్నలనూ తల్లిదండ్రుల పైకి స్పందిస్తుంటారు. అదేమిటి? ఇదేమిటి? ఎందుకు? ఎలా?.. ఇలా ఆ బుజ్జి బుర్రలనిండా ఎన్నో సందేహాలు.. వీటిని తీర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. తెలిసో తెలియకో కన్నవారు విసుక్కుంటే ఆ వికాస ద్వారం మూసుకుపోయినట్టే. వీలైనంతగా పిల్లల ప్రశ్నల్ని స్వాగతించాలి. వీలైనంత ఎక్కువ సంభాషణను ప్రోత్సహించాలి.
* మనం ఏం చెప్పినా తలాడించే బుజ్జిశ్రోత దొరికాడని మురిసిపోకూడదు.. ఏకబిగిన ఉపన్యసించి మన నోటి దురదను తీర్చేసుకోకూడదు. సంభాషణ సంభాషణలాగే ఉండాలి. మనం తక్కువ మాట్లాడి వారిని ఎక్కువ మాట్లాడనివ్వాలి. మాటల వల్ల దగ్గరితనం పెరుగుతుంది. ఇష్టాయిష్టాలూ, అభిరుచులూ అర్థం అవుతాయి. ఎదిగే క్రమంలో ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో చిన్న చిన్న తేడాలుంటే సరిదిద్దే వీలూ ఉంటుంది.
* పిల్లల ముందు జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్లో సహోద్యోగితో సంభాషిస్తున్నప్పుడూ చాలా చాలా ఎరుకతో వ్యవహరించాలి. పిల్లల ముందు ఏం మాట్లాడాలి? వారికి ఇబ్బందులు తెలియకూడదు కాబట్టి అప్పుల గురించీ, ఆర్థి సమస్యల గురించీ చర్చించకూడదు..
* చావు తీవ్రమైన విషయం కాబట్టి మరణాల ప్రస్తావన వద్దు.
* శరీర వ్యవస్థకు సంబంధించో, లైంగికతకు సంబంధించిన ప్రస్తావన వస్తే.. వెంటనే చర్చ ఆపేస్తాం.. ఇలా ఎంతకాలమని నిజాల్ని గుప్పిట్లో దాచి ఉంచుతాం? ఎన్ని రోజులని సమాజాన్ని చూడకుండా చుట్టూ తెరకట్టి కాపాలా కాస్తాం.. సిద్ధార్థుడి తండ్రిలా..! ఎప్పుడో ఒకప్పుడు వాళ్లు ఈ చేదు నిజాల్ని తెలుసుకోవాల్సిందే.. కఠిన వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సిందే.. వయసును బట్టి, సందర్భాన్ని బట్టి, వారి మానసిక పరిణితిని బట్టి పెద్దలు, పిల్లలతో క్రమక్రమంగా చర్చించడంలో తప్పులేదు.
* కన్నవారు కొన్ని విషయాలను మాట్లాడటం మానేస్తే, పిల్లలూ కొన్ని విషయాలు చెప్పడం ఆపేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినా అబద్ధం చెబుతారు. డొంక తిరుగుడుగా వ్యవహరిస్తారు. పెద్దయ్యాక కూడా ఆ డొంకతిరుగుడు తనమే కొనసాగుతుంది. సూటిగా మాట్లాడలేరు. స్పష్టంగా ఆలోచించలేరు.
* అమ్మానాన్నలు నిజాయితీగా ఉంటే.. పిల్లలు కూడా నిజాయితీగా ఉంటారు.
* పెద్దలు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే పిల్లలు కూడా తప్పులను ఒప్పుకుంటారు.
*