సబ్ ఫీచర్

కళలతో మానసికోల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెమలికి నేర్పిన నడకలివీ.... నిజమే మనిషి పుట్టిన ప్పటినుంచీ అనుకరణతోనే ముందుకు వెళ్తుంటాడు. పెరిగి పెద్దవుతూ ఉన్నపుడే ప్రకృతి ప్రేమికుడుగా మారుతాడు. పక్షిని చూసి పక్షిలాగా ఎగరాలనుకొన్నాడు. విమానాన్ని కనిపెట్టాడు. నెమలిలాగా నృత్యం చేయాలనుకొన్నాడు. నృత్యం నేర్చుకున్నాడు. దీనికి ఉదాహరణే ధింసా నృత్యం. ఇప్పటికీ నెమలీకలు కట్టుకుని అద్భుతమైన నృత్యం చేస్తుంటారు. కోయిలను చూసి గొంతు సవరించుకున్నాడు. పులిలా గాండ్రిస్తాడు, ఏనుగులా ఘీంకరిస్తాడు. దుప్పిలా జింకలా చెంగుచెంగున ఎగురుతాడు. నక్కలా కాచుకుని ఉండి శత్రువులను ఎదురుదెబ్బకూడా వేస్తాడు. గుహలను చూసి ఇళ్లు కట్టుకున్నాడు. ఇలా మనిషి ఎదుగలలో ప్రకృతి ఎంతో సహాయకారిగా ఉంది.
ఇక్కడ మనిషి అంటే ముఖ్యంగా జానపదుడే.జనపథంలో నివసించేవారు జానపదులన్నారు. జానపదులకు అమాయక జీవులు. వారు ప్రకృతి ప్రేమికులు. ఉరుము ఉరిమినా, మేఘం కారునలుపు పూసుకొన్నా, మేఘం తెల్లని రూపం ఎత్తినా, గాలి వీచినా, ఆకు కదలకపోయినా, పండు పండినా, చిలుకలు జామకాయలు కొట్టి కిందపడేసినా సరే వారి మనస్సు స్పందించినపుడు అలవోకగా ఏ శాస్త్రాలను అడ్డుపెట్టుకోకుండా మనస్సు స్పందించినట్లు పాటలు పాడుతారు. ఆటలు ఆడుతారు. వారి పాటకు సరియైన ధ్వని కలగాలనుకొన్నపుడు వారి వృత్తి లోని పనిముట్లను వారి పాటకు అనువైన వాయిద్యాలుగా కూడా మార్చుకుని ఆ వాయిద్యాలను మోగిస్తూ తమ పాటలను వినసొంపుగా రంజుగా పాడుతుంటారు. డప్పువాయిస్తూ అద్భుతమైన కథలను చెప్తారు.
ఆ పాటకు తగిన చిందు కావాల్సిన పుడు ఆట కూడా ఆడుతారు. అట్లా పుట్టినవే జానపద నృత్యాలు.
ఇంకా ఈ పాట ఆటతో పాటుగా హృదయ విదారకమైన దృశ్యాలు చూసినపుడు లేదా హృదయాన్ని కదిలించే కథనాలు వారు చూసినపుడు వెనువెంటనే వారు కథాగేయాలను కూడా అల్లుకుని ముందుకు సాగుతారు. అట్లాంటివే కథాగేయాలు. వాటిలో వీరరసాన్ని ఒలికించే వీరగాధాగేయాలు కూడా ఉంటాయి.
ఈకథాగేయాల్లో ఎక్కువగా కథాసహిత గేయాలు ఉంటాయి. ఈ కథల్లో ఒక వీరుని జీవితాన్నంతా కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. ఈ జానపద కథాగేయాల్లో ఒకరి జీవనం గురించి చెప్పేటపుడు ఆ గేయం కేవలం వీరరసాన్ని లేదా శృంగార రసాన్ని ఒలికించడమే కాదు ఆ జాతి అప్పటి ఎన్నో సాంస్కృతికాంశాలను వెలువరిస్తుంది. ఎన్నో ఆచారాలను, సంస్కృతులను వెల్లడిస్తుంది. జానపద ప్రదర్శనా కళారూపాల ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలుసుకునే వీలు ఉంటుంది.
వారి జీవనం ఇబ్బందులుపడేటపుడు వారికి అండగా నిలిచి వారితో పాటు కష్టపడి వారిని ఓ దరి చేర్చినపుడు ఆ చేర్చినవారు వీరికి అద్భుత వీరులుగా కనిపిస్తారు. అందుకే వీరి పాటల్లో ఆ వీరశిఖామణుల గురించి కథాగేయాలను ఆలపిస్తారు.
ఇట్లాంటి జానపదులు కేవలం ఏదో ఒక నుడుగో అరనుడుగో పాటలు పాడుతారు అంటే పప్పులోకాలేసినట్లే. ఈ ఆటలు, పాటలు, కథాగేయాలు, నృత్యాలు, వీధిభాగోతాలు, తోలుబొమ్మలాటలు,రుంజ, కడ్డీతంత్రీవాయిద్యాలు, కినె్నర, అందులో నానారకాలు, 12మెట్లకినె్నర, చిలుక కినె్నర లాంటివి, యక్షగానాలు, బుట్టబొమ్మలు, తప్పిట గుళ్లు, చిరుతలు, కత్తిసాము, కర్రసాము, కొమ్ము బూర, కోలాటం, (వివిధ రకాలు) బొడ్డెమ్మపాటలు, బతుకమ్మ చిత్రాలు, గరిడి, బుడిగ జంగాలు, ఒగ్గుకథలు, చెక్కబొమ్మలాట, చెక్క్భజన, చిందుభాగోతం, జిక్కి, డప్పులు, గొల్లసుద్దులు, పటం కథలు, ధింసా, పులివేషాలు, బోనాలు,లంబాడీ ఇలా రాస్తు పోతే ఎన్నో జానపద ప్రదర్శనా కళారూపాలుంటాయి.
వీటిని ప్రదర్శించడానికి వారు ఒక్కోసారి రెండు మూడు రాత్రులనుకూడా ఉపయోగిస్తారు అంటే అతిశయోక్తికాదు.
శాస్ర్తియ నృత్యానికి, శాస్ర్తి య సంగీతానికి కూడా కొరుకుడు పడని గీతాలను, గేయాలను, కీర్తనలను కూడా జానపదులు చక్కని తెలుగు పదసొంపునుపయోగించి చక్కని రాగంతో చూపరులను ఆకట్టుకొనేవిధంగా ఆహుతులను, ప్రేక్షకులను, శ్రోతలను కట్టిపడేసేటట్టు గానం చేస్తారు. నృత్యం చేస్తారు. నాటకం ఆడుతారు. అందుకే జానపదుడు అలవోకగా ఆడిన ఆటలు,పాడిన పాటలు, వేసిన నృత్యాలు ఆడిన నాటకాలు, వారి వంట, వారి వైద్యం, వారి సామెతలు, వారి నమ్మకాలు, వారి జాతర్లు, వారి దైవం వారి ఆరాధన ఇలా ఏదైనా సరే చదువుకున్నవారు వాటినన్నింటిని కలిపి జానపద విజ్ఞానం ఇది వౌఖికమే కానీ తవ్వినా కొద్దీ తట్టలుతట్టలుగా వస్తూనే ఉంది. దీన్ని భద్రపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని బిరుదురాజు రామరాజుగా దీని అవసరాన్ని దీని గొప్పతనాన్ని గుర్తించి సేకరించడం ఆరంభించారు. ఆనాటి నుంచి నేటి దాక ఇంకా పరిశోధకుల పరిశోధనలకు ఇబ్బడిముబ్బడిగా ముడిసరుకునుజానపద విజ్ఞానం అందిస్తూనే ఉంది. ఈ సంగతి తెలుసుకొన్న మన ప్రాచీనులు అంటే పాల్కురికి సోమన తన పండితారాధ్యుని చరిత్రలో నాటి నృత్యకళకు సంబంధిచిన శాస్ర్తియ, సాంకేతిక పదజాలమును, సానపద నృత్య వైఖరులను తెలిపారు. వెడయాట, చిందు, కోడంగియాట, పేరణి, పక్షుల ఆటలు గడాటలు, దొమ్మరాటలు, బొమ్మలాటలు, పగటివేషాలు ఇలాంటివెన్నో ప్రజాదరణ పొందిన జానపద నృత్యాలను, బ్రహ్మవీణ, కైలాస వీణ, సారంగ వీణ, కూర్మ వీణ , తిపిరి, సకనె, వళి, విచిత్రక, గుంభిక, విపంచిక సరవీణ, వరవాదివీణ , మ ల్లరి కోలాష్టి, సర్వమండలము, ఘోషావతి, ఔదుంబరి, తంత్రిసాగరము, అంబుజవీణ ఇలాంటి వీణలగురించి వీటిని ఉపయోగించిన ఆటే నాట్యాల గురించి వివరించి ఉంది. ఇవేకాదు పండితారాధ్యుని చరిత్రలో ఎన్నో జానపదుల గురించిన అంశాలు ఉన్నాయ.శ్రీనాథుని క్రీడాభిరామంలో జానపదుని ఆటల గురించి కూడా వివరించబడి ఉంది. ఆ ఆటల్లోనూ జానపదుని వివేకవిచక్షణాలు ప్రజ్ఞ బయటపడుతాయని శ్రీనాథుడు వివరించడం జరిగింది.
వాటిని నేటి ఆధునికులు తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఆ విజ్ఞానం మనకే కాదు మన తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతివారిపైన ఉంది జానపద ప్రదర్శన కళలు వల్ల కలిగే ప్రయోజనం అంతా ఇంతా అని చెప్పలేము. జానపద ప్రదర్శన కళల వల్ల లాభాలు ఒక్కటో రెండోకాదు. భ్రష్టు పట్టిపోతున్న సమాజాన్ని సుసమాజం చేయాలన్న సమసమాజం చేయాలన్న కేవలం జానపద ప్రదర్శన కళరూపాలుంటే చాలు.
దుండుగులు, సమాజ వ్యతిరేకులు, ఉన్మాదులు, పిచ్చి పట్టిన వారు సైతం జానపద ప్రదర్శనా కళరూపాలా చూసినట్లయితే వారంతా వారి మానసిక శారీరిక రుగ్మతలను దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
కళను ప్రదర్శించేవారు సైతం రాత్రంతా నృత్యాలు చేసినపుడు, కథాగేయాలను ఆడిపాడినపుడు రాత్రులంతాకూడా వీటిని ప్రదర్శించినా కూడా పక్కరోజు ఎవరి పనికి వారు హాయిగా వెళ్లి పనులు చేసుకొనేవారు. అంటే ఈ నృత్యాల్లో గానీ, వాయిద్యాల సహాయంతో ప్రదర్శించే కళ ద్వారా కళాకారులకు శారీరిక వ్యాయామం, మానసికోల్లాసం కలుగుతోందని వేరుగా చెప్పనక్కర్లేదు.
ఉదా: కోలాటం వేసేటపుడు కోలలు లయబద్దంగా తిప్పినపుడు చేతులకు , వాటికి అనుగుణంగా కాళ్లద్వారా పాదాల అడుగులను ముందుకు వస్తూ వెనక్కు వెళ్తూ వేస్తున్నపుడు ఆ కళాకారులకు ఎంతో శక్తి వస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి అతని మనస్సే చాలా ముఖ్యం. కనుక ఏర్పడిన మానసికోల్లాసంతో హృదయం నిర్మలంగా మారి ఆరోగ్యవంతుడు అవుతాడు. దేశభక్తి ప్రబోధించడానికి దేశమంతా ఒకే తాటిమీద నిలబడడానికి ఈ జానపద కళారూప ప్రదర్శనలు ఉపయోగపడుతాయి. ఇక్కడ కూడా తరతరాలుగా వచ్చే సంప్రదాయాలు, వైద్యసలహాలు కూడా భవిష్యత్తు తరాలకు అందివ్వచ్చు.
ఆ ప్రదర్శనా కళలు పునర్జీవింపచేస్తే సమాజానికి పట్టిన రుగ్మతలు దూరమవుతాయి. అందరి మనుష్యుల మనస్సులు రాగరంజితం అవుతాయి. కళలు చూడడం వల్లనే మనిషి మానసిక వికాసాన్ని పొందగలడు. ఎప్పుడైతే మానసిక వికాసం కలుగుతుందో ప్రపంచంలో కెల్లా ఆ మనిషి ఉన్నతుడుగా కీర్తించబడుతాడు. మనుష్యుల మధ్య ఐకమత్యం సానుకూల ధోరిణి, సౌభాతృత్వం ఉండాలంటే ఉన్నది పెరగాలంటే కేవలం జానపద ప్రదర్శనా కళలను ప్రదర్శించడమే ఉపాయం. సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న నేటి గడ్డుసమస్య బాలికపై అత్యాచారాలు, పెళ్లిళ్లల్లో వరకట్ల వేధింపులు,అత్తకోడళ్లు, మామఅల్లుళ్ల మధ్య విరోధ భావాలు లేకుండా చేయవచ్చు. ఈ జానపద కళలనే వాహిక ద్వారా దూరం చేయవచ్చు. ప్రజలంతా ఒక్కటేనన్న సమైక్యభావాన్ని వృద్ధి చేయాలన్న మతం విద్వేషాలను రూపుమాపాలన్నా, కులచిచ్చులను ఆర్పాలన్నా అన్నింటికీ సాధనం జానపద ప్రదర్శన కళారూపాలే.

- వాణీ ప్రభాకరి