సబ్ ఫీచర్

ముందు ఇల్లును చూడండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంకరణే మీ ఇంటికి వనె్న తెస్తుంది. డ్రాయింగ్‌రూమ్, లివింగ్‌రూం, డ్రస్సింగ్‌రూం, డైనింగ్‌రూం, కిచెన్, పిల్లల గది అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. ఇంట్లోని హాల్ అందం పెరగడానికి దివాన్ సెట్లని అందంగా తీర్చిదిద్దుతుంటారు. ఇంటికి వచ్చిన అథిథులు కూర్చోడానికి, కాస్త నడుం వాల్చడానికైనా ఇవి సౌకర్యంగా ఉంటాయి. ప్లెయిన్, వర్క్, డిజైన్స్ , ప్రింటింగ్ కలిగి ఉన్న బెడ్‌షీట్స్ వీటిమీదికి బాగానే ఉన్నా ఇప్పుడవి అవుట్ డేటెడ్ ఫ్యాషన్ అయిపోయాయి. ఇంటికి వచ్చిన వారికి ఇల్ల మరింత అందంగా కనబడాలంటే వాడే బెట్ సెట్ స్టైల్ ని కాసత మార్చి చూడండి.
గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్నప్పటికీ వాటి మధ్య సారూప్యం ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంటి అలంకరణ మీరేంటో, మీ వ్యక్తిత్వమేమిటో సమాజంలో మీకు గల స్థానమేమిటో తెలియజేస్తుంది. ఈ కాలానికి అనుగుణంగా డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లు , ఇంటీరియర్ డిజైనర్లు సరైన ప్రమాణాలు పాటిస్తూ ఇంటిని అలంకరిస్తున్నారు. ఇటి అలంకరణకు మరింత వనె్న తెచ్చేది గోడలకు వేసేరంగు, గోడలకు వేసే వాల్ పేపర్లు, గోడకు వేసిన పెయింట్ కలర్‌కి పూర్తి వ్యతిరేక రంగులో ఉండే వాల్ పేపర్స్ తో హాలు, బెడ్‌రూం అలంకరించుకోవాలి.
ఫ్యామిలీ ఫోటోలు, గోడలకు పెట్టడం అందరూ చేసేదే. అందుకు కాస్త వైవిధ్యాన్ని జోడించి కొత్తగా డిజైన్ చేయించిపెట్టాలి. వచ్చిన అతిథులు చూపు తిప్పుకోలేరు. లోపలి గోడలకు వేసే రంగులు లైట్ కలర్ మనుసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆ లైట్ కలర్స్‌కి మ్యాచ్ అయ్యేలా నేచురల్ వాల్‌పేపర్స్‌ని పెట్టాలి.
ఎంత పెద్ద ఇల్లైనా ఎంత చిన్న ఇల్లైనా ఇంట్లో అలంకరణ వస్తువులు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్‌లో అందుబాటులో ఉండేవివిధ వస్తువులను తక్కువ ఖర్చుతో ఇంటి అలంకరణకు వినియోగించే వివిధ వస్తువులను తెచ్చుకుని అలంకరించుకోవచ్చు. పూలతొట్టెలు, గోడ గడియారాలు, జంతువులు, అలంకరణ వస్తువులు తెచ్చుకుని మనకు నచ్చిన రీతిలో అలంకరించుకోవచ్చు. ఇప్పుడు అనేక హంగులు గృహాలంకరణలో నిత్యమై పోయాయి. ఇంటి సౌందర్యంలో భాగంగా ఇల్లుకట్టుకునే విధానం ఇంటికి వేసే రంగులు ఇంట్లో అమర్చుకునే ఫర్నిచర్ మీదే ఆధారపడి ఉంటుంది. పాత ఫర్నిచర్, షేడ్ అయిపోయిన గోడలకు రంగులు ఇవన్నీ కూడా ఇంటిని అందవిహీనంగా కనబడేలా చేస్తాయి. కనుక వీటి తగిన మెళుకువలు పాటించినట్లయితే ఇంటి అందంగా ఆకర్షణీయంగా మళ్లీ కొత్త ఇల్లగా చేసుకోవచ్చు. గదుల గోడలకు అందమైన ప్రకృతి దృశ్యాలు, వాల్ పేపర్లను అతికించినట్లయితే బాగుంటాయి. గది తలుపులన్నీ మూసేసి చీకటిగా చేయకుండా వీలైనంత సూర్యరశ్మి వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి పెట్టండి. ఆర్గంజా, సాటిన్ సిల్క్ వంటి పలుచటి కర్టెన్లను వాడండి. వాటికి లేసులు కుట్టించండి. పగటిపూట కిటీకీలను, లేదా తలుపులను తెరిచి ఉంచడం ఆరోగ్యానికి మంచిది. గదికంతటికీ ఎదురెదురుగా రెండు ట్యూబ్‌లైట్స్ అమర్చాలి. వాటికి తోడు గోడలకు లేదా గది మూలల్లో క్రిస్టల్ లైట్‌స్టాండ్ అమర్చినట్లయితే ఆ గదికే కొత్త అందం వస్తుంది.
యాంటిక్ ఫోటోలు, పెయింటింగ్‌లకు కాంబినేషన్ గా యాంటిక్ ఉడ్ వర్క్ చేసిన సోఫా సెట్ షెల్ప్‌లు, టీపాయ్ లు అమర్చితే బాగుంటుంది. పోటోప్రేమ్స్ కూడా ఉడెన్‌వి అయితే మంచి లుక్ వస్తుంది. తంజావూర్ పెయింటింగ్స్ ట్రెడిషనల్ లుక్‌ని ఇస్తాయి. అతిథులు కూడా సాదరంగా ఆహ్వానిస్తున్న భావనకు లోనవుతారు. సోఫాసెట్ మోడరన్ గా ఉన్నట్లయితే డ్రాయింగ్ రూమ్‌లో గ్లాస్ పెయింటిగ్స్, గ్లాస్ షోకేసులు బాగుంటాయి. షోకేసులలో స్వరోప్‌స్కీ టాయ్స్ అలంకరించుకోవాలి. వాటిలాలిత్యం కంటికి హాయిని ఇంటికి ఫ్యాన్సీ లుక్ ఇస్తాయి. కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే గోడ ఇతర ఫర్నిచర్ లైట్ కలర్ లో ఉంటే షో పీస్ లు బ్రైట్‌గా ఉండాలి. అప్పుడే చూపురల దృష్టి వాటిమీద పడుతుంది. గదిలో ఏదో ఒక మూల కుండీల్లో మొక్కలు పెట్టి చూడండి. వాటిని చూస్తుంటే మనసుకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో మీకే అర్థం అవుతుంది. ముదురు రంగు గల సోఫాసెట్స్ మీద బ్రైట్ కలర్ కుషన్లు అమర్చాలి. డార్క్ బ్రైట్ రంగులు చూసేందుకు ఎంతోబాగుంటాయి. పెయింటింగ్ చేసిన వస్త్రంతో తయారయిన ల్యాంప్ షేడ్స్ గదిలో ఒక మూల అమర్చి లైట్ ఆన్ చేసి చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. టైల్స్ రంగు వెలసి పోయి డల్‌గా కనిపిస్తున్నట్టయితే వాటి మీద రంగు రంగుల డిజైన్ కార్పెట్లగానీ, అందమైన డిజైన్లతో ఉన్న చిన్న సైజు రగ్గులుగానీ పరచండి. డైనింగ్ టేబుల్ మీద గానీ లేదా ఇంటి మొత్తానికి ఉండే సెంటర్ టేబుల్ మీద గానీ చిన్న చిన్న దీపాలను పెట్టడంతో ఆ ఇల్లు మెరుపు కళలతో నిండి ఉంటుంది.
ఇల్లుఅందంగా కనిపించాలని అనుకుంటే సరిపోదు. ఇంట్లో ఉన్న అన్ని గదులను సౌకర్యవంతంగా, అందంగా అమర్చుకోవాలి. కేవలం అందంగా కనిపించినా ఉపయోగం లేదు. కేవలం సౌకర్యవంతంగా ఉంటేనూ సరిపోదు. ఎంత అందంగా సౌకర్యవంతగా అమర్చుకున్నా వాటిని ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అమర్చుకున్నాం కదా అని నాలుగురోజులు వదిలేస్తే వాటిపైన దుమ్ము ధూళి పట్టి చూడడానికే అసహ్యం వేస్తుంది. కనుక ప్రతిరోజు వాటి పైన దుమ్మును చిన్న మెత్తని టవల్స్‌తో తుడుస్తూ ఉండాలి. ఇంటి మొత్తంలో ఎక్కడా చెత్త లేకుడా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు గదిలో ఉండే వస్తువుల పైన, గదిగోడలపైన దుమ్ము, బూజు వేలాడకుండా చూసుకోవాలి. శుభ్రతకే చూసేవారు మార్కులు ఎక్కువ వేస్తారు. ఈ పరిస్థితిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అక్వేరియం , వాటర్ ఫౌంటెన్స్ వంటివి ఉన్నట్లు అయితే వాటిలోని నీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో వాసన రాని పరిశుభ్రమైన నీటినే మారుస్తూ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
ఇల్లంతా అందంగా అమర్చుకుని టాయిలెట్స్ ను పట్టించుకోకపోతే ఆ ఇంటి అందం అంతా కళావిహీనంగా మారిపోతుంది. కనుక వాటిని కూడా పట్టించుకోవాలి. టాయిలెట్స్ ల్లో ఎప్పుడూ నీటి వసతి ఉండేవిధంగా చూసుకోవాలి. శుభ్రత కే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అక్కడ వాడే టవల్స్, ఇతరత్రా వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి. అరిగిపోయిన సబ్బులు, అయిపోయిన షాంపు బాటిల్స్ ల్లాంటి వాటిని తీసేస్తూ ఉండాలి. దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రాతురూమ్ గోడలకు వేసే కలర్స్ పైనకూడా జాగ్రత్త వహించాలి.
డైనింగ్ హాల్‌లో రోజూ తాజాపూలను అలంకరిస్తే చాలా బాగుంటుంది. దీనికోసం పూలను ప్రతిరోజు కొనకుండా ఇంట్లోనే ఒక కుండీలో గులాబీలులేదా మల్లెలు లాంటి లేదా ఏదైనా క్రోటన్ ల్లాంటివి పెంచుకుని వాటిని డైనింగ్ టేబుల్ పైన కానీ డైనింగ్ రూమ్‌లో ఏ కార్నర్‌లోనైనా అమర్చితే మనుసు ఆహ్లాదంగా ఉంటుంది.
లివింగ్‌రూమ్‌లో పూలను అమర్చుకునే టపుడు కళాత్మకంగా ఆలోచించి ఎండిపోయిన పూలతో కూడా మంచి డెకరేషన్ ఐటమ్‌చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా మీ ఆలోచనకు తగ్గట్టు పాత వస్తువులను కళారూపాలుగా అమర్చుకుని పెట్టుకొంటే అతిథులు మిమ్ములను మెచ్చుకోక మానరు.

-సాయి ఆదిత్య వైనతేయ 8008577834