సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుందరం
ప్రకృతి శోభ ఏమిటి? దేవదేవుని శోభయే. అయితే మన కంటిముందు కదలాడేవన్నీ శాశ్వతం కావు. పూవులు వాడిపోతాయి. మబ్బులు చెదరిపోతాయి. భౌతిక దృష్టికి కనుపించే అందం అంతా క్షణభంగురం. కాని ఆయన దివ్య సౌందర్యం శాశ్వతమైనది. పరిపూర్ణమైనది. అద్భుతమైనది.
సుందరమే సత్యం. ఏ కాలంలోనైనా అది మారదు. ఏ స్థలంలోనైనా అది మారదు. సుందరమే శివం. అంటే, మంగళకరం.
మనిషిని పక్కదోవ పట్టించేది తాత్కాలికమైన శారీరక సౌందర్యాన్ని గురించిన వ్యామోహమే. అది యిచ్చే ప్రమోదం ఎంత కొంచమో, అది తెచ్చి పెట్టే ప్రమాదం అంత ఎక్కువ.
ఆడంబరం తగదు
దైవారాధనలో కూడా ఈనాడు పెక్కుమంది ఆడంబరమునే ప్రదర్శిస్తున్నారు. పటాన్ని అలంకరించినప్పుడు ముఖము కూడా కనిపించని రీతిలో పూలమాలలు ఒకటిపైన ఒకటి వేస్తారు. దేవాలయంలో విగ్రహంయొక్క సుందర శిల్పమే కనపడదు. వీరుచేయు అలంకారములన్నీ విశ్వప్రీతికే కాని, విశే్వశ్వర ప్రీతికి కాదు. నైవేద్యం మొదలైన విషయాలలో కూడా ఇంతే! మన సత్యసాయి సంస్థలు ఇట్టి ఆడంబర పద్ధతులను అనుసరించకూడదు.
లోభత్వం
భారత యుద్ధంలో కౌరవులు పూర్తిగా నశించిపోయారు. నూర్గురు పుత్రులు కలిగినా, చివరకు ధృతరాష్ట్రునికి పిండం విడవడానికి కూడా ఒక్కడైనా మిగల్లేదు. దీనికి కారణం కౌరవుల లోభత్వమే! కనుక, ఎవరి అధికారాన్ని వారికి ఇవ్వాలి. ఇతరుల సంపదనూ, సొమ్మునూ, రాజ్యాన్నీ అధికారాన్ని స్వీకరించి దానికి మనమే నిజమైన అధికారులమని భావించరాదు.
అగ్ని సీత
అవతార పురుషులు వేసే ప్రతి అడుగూ అగ్ని సంబంధం. అంతేకాదు, రాబోయే సంఘటనలకు అది అద్దంపడుతుంది. రావణుని రాకకు నాంది శూర్పణఖ ప్రవేశం. రాముడు సీతను అగ్నిలో ప్రవేశించి సమయం వచ్చిందాకా అందులోనే వుండమన్నాడని ఒక కథ వుంది. అంటే, మాయా సీత అసలు సీతకు బదులుగా పర్ణశాలలో వుంది. రావణునిచే చెరబట్టబడింది ఆ మాయా సీతే! రావణవధ తర్వాత అగ్ని పరీక్ష సమయంలో వెలువడి రాముని మళ్లీ చేరుకొంది. ఇంతకాలమూ శక్తి రూపంలో సీత రామునిలోనే వుంది. ఇది దేవ రహస్యం!
రావణుని తపశ్శక్తి అమోఘం. అది క్షీణించి, అతడు శక్తిహీనుడుకానిదే అతడిని జయించటం సాధ్యంకాదు. ఏదో దారుణమైన పాపం చేస్తేనే కాని అతని శక్తి క్షీణించదు. అతడు శక్తిహీనుడు కాడు. అతని బలహీనత కామం. అందుకే సీతాపహరణం. అదే అతని పతనానికి నాంది.
పథ్యం నీకోసమే
నీకు ఆకలిలేనప్పుడు భగవంతుడు నీకెందుకు ఆహారం పెట్టాలి? ఆకలి ఉండి ఆహారం తీసుకుంటే అది ఉపయోగపడుతుంది. కాని, ఆకలి లేనప్పుడు ఆహారం తింటే అజీర్తి పట్టకుంటుంది. ఒక్కొక్కసారి నీకు ఆకలైనా భగవంతుడు అన్నం పెట్టడు. అది కేవలం నిన్ను నియమ నిగ్రహాలతో ఉంచడం కోసమే. నువ్వు ఆసుపత్రిలో ఉన్నావనుకో. నువ్వడిగిందల్లా వాళ్ళు ఇవ్వరు. పథ్యం, పానం వుంటాయి. ఆహారం యివ్వటానికి తగిన కాలము, తగిన పద్ధతి ఉంటాయి. ఆ ఏర్పాట్లన్నీ నీ ఆరోగ్యం కోసమే.
నీకు ఆధ్యాత్మికానుభవాన్ని కూడా భగవంతుడు ఒక్కొక్కప్పుడు కలుగనివ్వడు. భగవంతుడు ఏమిచేసినా మనిషి మేలుకోరియే చేస్తాడు. మనిషికి దుఃఖం కలిగించడానికి ఎప్పుడూ ఏమీచేయడు. ఆ విశ్వాసాన్ని నీవు కలిగియుండాలి.
ఆహారం నియమం
మాంసాహారాన్ని భుజించడం చేత మనలో పశుభావాలు కలుగుతుంటాయి. ఎట్టి ఆహారమో అట్టి భావము.
అంతే కాదు, మన పూర్వీకులు దినమునకు రెండు పర్యాయములు మాత్రమే భుజించేవారు. మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించేవారు. కనుకనే, దినమునకు ఒక్క పర్యాయం భుజించేవానిని యోగి అని, రెండు పర్యాయములు భుజించేవానిని భోగి అని, మూడు పర్యాయములు భుజించేవానిని రోగి అని అన్నారు. కాని, ఈనాడు మూడు పర్యాయములే కాదు. ‘మధ్యేమధ్యే పానీయం సమర్పయామి’ అన్నట్లు కాఫీలు, టిఫిన్లు ఎన్నోసార్లు వేస్తుంటారు. ఇంక అజీర్ణ వ్యాధి సంభవించక ఏవౌతుంది!
సృష్టి నియమబద్ధం!
నియమాలు, నిష్ఠలూ చూసి చిరాకుపడకు. అవన్నీ నీ మేలుకే ఏర్పరచబడ్డాయి. సృష్టి అంతా నియమబద్ధమే. సముద్రాలు చెలియలి కట్ట దాటవు. వాయువు, అగ్ని తమతమ పరిధులను అధిగమించవు. శరీరమో! నార్మల్ ఉష్ణోగ్రతలోనే వుంటుంది. గుండె నిముషానికి యిన్నిసార్లు అనే లెక్కప్రకారం కొట్టుకుంటున్నది. ఇక సత్యసాయి సంస్థ ఏ నియమాలూ, నిబంధనలూ లేకుండా ఎలా పనిచేస్తుంది?
ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.