సబ్ ఫీచర్

రాజ్యాంగం గొప్పదే.. ఆచరణే అసలు సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం’ అంటూ ఈనెల 26న- 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంపీలు ఎంతో ఉత్తేజకరంగా ఉపన్యాసాలు ఇచ్చారు. అదే రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ ఎస్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మహారాష్టలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సంచలన తీర్పు ఇచ్చింది. జస్టిస్ రమణ ఆమధ్య కర్నాటకలో రాజకీయ అస్థిరత్వానికి కారణమైన ‘్ఫరాయింపు ఎమ్మెల్యేల’ను అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. అయోధ్యలో ‘మందిర్-మసీదు’ వివాదంపై పదవీ విరమణకు ముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ అధ్యక్షతన అయిదుగురు సభ్యుల ధర్మాసనం విలక్షణమైన తీర్పును ఇచ్చింది. మన రాజ్యాంగం గొప్పదనం గురించి ప్రధాని మోదీ మాటల తీరును, ఈమధ్యకాలంలో సుప్రీం కోర్టు వెలువరించిన మూడు ప్రధాన తీర్పులను గురించి పరిశీలిస్తే.. భారత రాజ్యాంగం ఎంతో విశిష్ఠమైనదని మరోసారి నిరూపితమైంది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం విషయంలో తీర్పు వెలువరించిన సందర్భంగా జస్టిస్ రమణ మన రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు సవ్యంగా వుండాలని ఉద్ఘాటించారు. అవును.. ఈ విధంగా అమలుచేసేవారు లేనందుకే మన రాజ్యాంగం, చట్టాలు అనేక సందర్భాలలో కొంతమందికి చుట్టాలుగా మారాయి. ఈ కారణంగానే అయోధ్య స్థలవివాదం దశాబ్దాలకు పైబడి నానుతూ వచ్చింది. మన రాజ్యాంగానికి శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖ అనేవి రెండు కళ్లు వంటివి. దురదృష్టం కొద్దీ అడుగడుగునా మన దేశంలో శాసన నిర్మాణశాఖకు అధిపతులుగా వున్న ప్రజాప్రతినిధులదే పైచేయి అవుతున్నది. వీరి రిమోట్ కంట్రోల్ ఆధారంగానే సివిల్ సర్వెంట్లు పనిచేసే దుస్థితి నెలకొన్నది. ఇందులో భాగంగానే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆకస్మికంగా బదిలీ చేశారు. ఇలాగే ఫిరాయింపుల నిరోధక చట్టం అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో వచ్చినప్పటికీ, కొంతమంది ఎంపీలు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లినప్పటికీ లోక్‌సభ స్పీకర్ వారిని ఏమీ అనకుండా అలాగే ఐదు సంవత్సరాలు కొనసాగించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది ఎమ్మెల్యేలు గోడ దూకి వేరే పార్టీలోకి వచ్చినప్పటికీ నాటి స్పీకర్ వారికి కావలసిన రాచమర్యాదలు కొనసాగించారు. తెలంగాణలో మొన్నటి అసెంబ్లీలో, ప్రస్తుత శాసనసభలో యథాతథంగా గోడ దూకిన ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు. ఇలాగే, మైనార్టీ ప్రజలను బుజ్జగించడానికి మెజార్టీ ప్రజల హక్కులను కాలరాస్తూరావడం కూడా మన దేశంలో ఆనవాయితీగా కొనసాగుతున్నది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని లక్ష్యాల కోసం తీసుకొచ్చిన చట్టాలు అడుగడుగునా దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు ఎన్నో కనబడుతున్నాయి. ఇందులో భాగమే మహిళా చట్టాలకున్న ప్రత్యేకతను, అట్రాసిటీ చట్టానికి వున్న ప్రాధాన్యతను కొంతమంది స్వప్రయోజనాలకు వాడుకుంటున్న వైనం. ఇదే సందర్భంలో కొన్ని వర్గాలకు జరగవలసిన న్యాయం జరుగకుండా సమస్యలు సజీవంగా కొనసాగుతూనే ఉన్నాయి.
చుండూరులో దళితులను సామూహికంగా హత్యచేసిన దోషులకు ఏ విధంగానూ శిక్ష పడకపోవడం గమనార్హం. చుండూరు మారణకాండ కేసుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ వారి ఆధారాలు సరిగ్గా లేవని భావించి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చుండూరు కేసు ఇప్పటికీ సుప్రీం కోర్టులో విచారణలో వుంది. కారంచేడులో దళితుల మీద మారణకాండ 1985-89 మధ్య జరిగింది. చుండూరు ఊచకోతలు 1990-93 మధ్య జరిగాయి. అప్పటి నుంచీ ఇప్పటివరకు అసలు దోషులెవరో తేల్చలేదంటే- సామాన్యులకు, బలహీనవర్గాలకు మన చట్టాల మీద ఎలా నమ్మకం ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించాలి. నేటి సుప్రీం కోర్టు తీర్పుల తరహాలో 1985-86లో షాబానో అనే మహిళ ముస్లిం స్ర్తిలకు కూడా హిందూ మహిళల తరహాలో మనోవర్తికావాలని కోరగా ఈమె డిమాండ్ న్యాయసమ్మతమేనని ముంబయి హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును చట్టరూపంలో తీసుకురావడానికి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నించగా- తమ ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని మైనారిటీ సంస్థలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. ముస్లింలను ఓటు బ్యాంక్ రూపంలో బుజ్జగించడానికి తాను చేసిన ప్రయత్నాన్ని రాజీవ్ గాంధీ ఉపసంహరించుకున్నారు. అయితే, ఇటీవల ప్రధాని మోదీ త్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దుచేసి షాబానో ఆశయాన్ని నెరవేర్చారు. ఎలాగైతేనేమి.. 70వ రాజ్యాంగ దినోత్సవానికి అటు ఇటుగా కొన్ని తీర్పులు ఆశాజనకంగా రావడం సంతోషదాయకం. ఇదే తరహాలో ‘ఒకే చట్టం.. ఒకే దేశం.. ఒకే ప్రజ..’ తరహాలో నికార్సయిన ప్రజాస్వామ్య వ్యవస్థగా, అసలైన లౌకిక వ్యవస్థగా, తారతమ్యాలు లేని సామ్యవాద వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందాల్సి ఉంది.

-తిప్పినేని రామదాసప్పనాయుడు