సబ్ ఫీచర్

వసివాడని కుసుమం వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక తెలుగు కవితా ప్రక్రియలలో వచన కవిత్వానికి ఉన్న స్థానం ఎంతో విశిష్టమైంది. అద్భుతమైన ప్రక్రియ వచన కవిత్వం. ప్రజాస్వామ్యయుగ కవితా వాహికగా వచన కవిత్వం అభివర్ణింపబడింది. కుందుర్తి చెప్పినట్టుగా ఒక బలమైన ఉద్యమంగా వచన కవిత్వం బహుముఖంగా వ్యాపించింది.
పద్య కవిత్వానికి సమాంతరంగా ప్రారంభమైన ప్రక్రియగా వచన కవిత్వం గురించి చాలామంది విశే్లషకులు చెప్పుకొచ్చారు. ఆధునిక భావాలను సమర్ధవంతంగా చదువరులకు చేరవేయడంలో వచనమే సరైందని భావించే పరిస్థితి కనిపించి ఆ ప్రక్రియ బలిమిని పెంచింది. ఛందోబద్ధమైన పద్య నిర్మాణంగానే కాకుండా నిత్య వ్యవహార పదాలతో కవిత్వం రాసే వచన కవుల సంఖ్య క్రమంగా పెరిగింది. వర్తమాన ఆలోచనా ధారతో సామాన్యుడిని సైతం ఆకట్టుకునే ప్రక్రియగా వచన కవిత్వం పేరొందింది. ఆధునిక యుగపు ప్రతిబింబంగా వచన కవిత్వాన్ని మార్చే దిశగా లెక్కకు మించిన రచనలు ఈ ప్రక్రియలో వచ్చాయి. వర్తమాన అంశాలే వచనానికి ప్రాణలక్షణం కావడంతో చదువరుల ఆదరణ కూడా క్రమంగా పెరిగింది.
వచన గేయాన్ని ఆంగ్లంలో ‘ఫ్రీవర్స్’అని ఫ్రెంచి భాషలో ‘వర్స్‌లిబ్రే’అని చెబుతారు. ఫ్రెంచి భాషలో ఈ ప్రక్రియ ప్రారంభంకాగా ఆ కవుల ప్రభావంతో ఇంగ్లీషు కవులు ముందడుగేసి రాశారు. వాల్ట్‌విట్‌మన్, ఆర్నాల్డ్ వంటి కవులు గొప్ప వచనాన్ని వెలయించారని సినారె ఒకచోట వ్యాఖ్యానించారు. తెలుగులో ఫ్రీవర్స్‌ను వచన గేయం, వచన పద్యం, ముక్తచ్ఛందం, స్వచ్ఛంద కవిత్వం అనిబద్ధ కవిత్వం అని చెప్పినప్పటికీ సర్వేసర్వత్రా వచన కవిత్వమనే పేరు స్థిరపడిపోయింది. స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించేందుకు తోడ్పడే ప్రక్రియగా వచన కవిత్వానికి ఎంతో ఆదరణ దక్కింది. వ్యవహారికశైలి వచన కవిత్వానికి ప్రత్యేకతగా నిలిచింది.
విభిన్న దృక్కోణాలు, దృక్పథాలతో అనేకమంది వచన కవిత్వాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నంచేశారు. శ్రీశ్రీ, పఠాభి, ఆరుద్ర, కుందుర్తి, చేరా, అరిపిరాల విశ్వం, కెవి రమణారెడ్డి, రోణంకి అప్పలస్వామి, సినారె వంటి వారు నిరాడంబరత, నిరలంకారత వచన కవిత ప్రదానమైన లక్షణాలుగా చెప్పారు. సారళ్యం, సూటిగా హృదయానికి తాకే కూర్పు, శబ్దక్రమం, నుడికారాల వినియోగం, రసపోషణ, సంభాషణల స్థాయిని అందుకునే తీరు కనిపించడం వచన కవితలోని విశేషమని తెలిపారు.
వచన కవిత్వం విస్తృతమైనది, వైవిధ్యంతో కూడుకున్నదన్నది స్పష్టమవుతున్నది. వచన కవితా నిర్వచనం కవినిబట్టి, కవితనుబట్టి మారుతుందని సుప్రసిద్ధ విమర్శకులు టిఎల్ కాంతారావు అభిప్రాయపడ్డారు. విశాలమైన పరిధికలది వచన కవిత్వమని అనేకులు చెప్పారు. సమగ్రంగా-శాస్ర్తియంగా ఆలోచిస్తే వచన కవిత్వంలో అనేక అంశాల కదంబాన్ని గమనించవచ్చు. ముద్దుకృష్ణ రచించిన ‘తురాయి’ తెలుగులో దొరికిన మొదటి కవిత అంటూ ఆరుద్ర ఉదాహరించారు.
కవికొండల వెంకటరావు రాసిన నక్కాసామిగాడు కృష్ణాపత్రికలో వన కవితగా ప్రచురితమైంది. 1939లో పఠాభి ‘్ఫడేలు రాగాల డజన్’ మొదటి గ్రంథమని కొందరు, 1938లో వెలువడిన శిష్ట్లా ఉమామహేశ్వరరావు ‘నవమి చిలుక’, విష్ణ్ధునువు మొదటిదని మరికొందరు వ్యాఖ్యానించారు. వచన కవులలో ముద్దుకృష్ణ, నారాయణబాబు, శ్రీశ్రీ, పురిపండా, పాలగుమ్మి పద్మరాజు, పఠాభి, జరుక్‌శాస్ర్తీ, సంపత్, సింగరాచార్య, అజంతా, బైరాగి, కాళోజీ, దాశరథి, శేషేంద్ర, సినారె వంటి ఎందరెందరో వచన కవితల వెలుగును విస్తరింపజేశారు. దిగంబర కవులు, పైగంబర కవులు, చేతనావర్త కవులు, అనుభూతివాద కవులు, స్ర్తివాద, దళితవాద కవులు, నూతన ప్రక్రియల కవులు వచన కవిత్వానికి జవజీవాలు కల్పించి గౌరవాన్ని పెంచారు. సినారె ‘విశ్వంభర’ జ్ఞానపీఠం పొంది వచన కవిత్వాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్ళింది. ఎందరో ప్రవర్థమాన, వర్థమాన కవులు వచన కవిత్వంలో సరికొత్తదనాన్ని జోడిస్తూ ముందుకు సాగుతున్నారు. శిల్పం, అభివ్యక్తిలో ప్రత్యేకతను సంతరించుకొని ఆదరణీయ ప్రక్రియగా వచన కవిత్వం కొనసాగుతున్నది.

- తిరునగరి శ్రీనివాస్ 8466053933