సబ్ ఫీచర్

పిల్లలకు తినే పద్ధతి నేర్పాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ముందుగా చేయాల్సింది, వారు ఆరోగ్యవంతమైన ఆహారం తినేవిధంగా చూడడం, రెండోది వారంతటవారే తినే పరిస్థితిని కల్పించడం. మూడోది టేబులు ముందు కూర్చొని, వారు ఏ విధంగా తింటున్నారో గమనిస్తూ పద్ధతులు నేర్పడం. టేబులు దగ్గర ఏవిధమైన గందరగోళం సృష్టించకుండా చక్కగా మంచి పద్ధతులు పాటించేలా చూడాలి. ఆ తర్వాత నెమ్మదిగా, తరచుగా, తినడానికి కూర్చున్న ప్రతిసారీ ఒక్కొక్కటిగా వివరిస్తూండాలి. వాటిని పాటించే విధంగా కొన్నాళ్ళు వాళ్ళ వెంట ఉండి పరిశీలిస్తుండాలి.
టేబులు దగ్గరకు రావడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కురావాల్సిందిగా పిల్లలకు గుర్తుచేయాలి.. ఆహారాన్ని హడావుడిపడకుండా నెమ్మదిగా నోటిని కదుపుతూ ఏవిధంగా నమలాలో వారికి చూపిస్తుండాలి. నోట్లో ఎక్కువ ఆహారాన్ని కుక్కినట్లు కాకుండా, నీట్‌గా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెల్లగా నమిలేలా చూడాలి. ఈ ప్రక్రియలు ఒక్కసారిగా నేర్చుకునేవికావు. ఒక్కొక్కకటిగా మళ్లీ మళ్లీ ప్రాక్టీసు చేస్తూ విభిన్నంగా తినే అలవాట్లు నేర్చుకుంటారు. ఈ చిన్న చిన్నవే క్రమంగా మంచి అలవాట్లుగా మారతాయి.
పిల్లలు మంచి భోజన పద్ధతులు నేర్చుకోవాలనుకున్నపుడు, వారికి నేర్పించాలనుకున్నపుడు అన్నీ ఒక్క రోజులో సాధ్యపడవు. అందుకు కొంత సమయం పడుతుంది. అది పిల్లల తత్వంమీద కూడా ఆధారపడి వుంటుంది. చెప్పింది చెప్పినట్లుగా ఆసక్తిగా అనుకరించే పిల్లలు కొందరుంటే, ఇంకొంతమంది పిల్లలు పదే పదే చెబుతుంటే కాని పాటించరు. కొన్నిసార్లు పిల్లలు మాట వినక ఎదురుతిరుగుతుంటారు. అపుడు కొంచెం ఓపిక పట్టాలి.
చెప్పిన పద్ధతులు, ప్రవర్తనల్ని వారు సరిగ్గా జీర్ణించుకుని, అర్థం చేసుకుని పాటించేదాకా సహనంగా వేచి చూడాలి. అన్ని విషయాల్ని వివరించాలి. అలాగే వారు చక్కగా, పద్ధతిగా తిన్న ప్రతిసారీ మనం వారిని మెచ్చుకుంటుండాలి. పిల్లలు తమంతట తము, స్వంతంగా తినడం మొదలుపెట్టాక ఆహార పదార్థాలను కిందా మీదా పడేసి చిందరవందర చేసేసి గందరగోళం చేస్తుంటారు. పేట్లనుంచి ఎటువంటి పదార్థాలూ పడకుండా, మీద పోసుకోకుండా జాగ్రత్తపడటమనేది ఎంతైనా అవసరం. వేళ్ళతో పెద్దవాళ్ళు తిని చూపిస్తూ వారికి అదేమాదిరి జాగ్రత్తగా తినడం నేర్పించాలి. ఏం చేయాలో చూపించడం, ఎంత అవసరమో చెప్పింది పాటించేలా చూడటం అంతే అవసరం.
కుటుంబ సభ్యులందరూ తాపీగా కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేసే సందర్భాలు తరచూ కుదరకపోయినా, వీలైనంతవరకూ అందరూ ఒకచోట తింటూ భోజనం చేసే అలవాటు ఈ రోజుల్లో మనకి ఎంతైనా అవసరం. కూర్చోగానే ఎవరికివారు వడ్డించుకోవడం, అందరూ కూర్చోకముందే తినడం మొదలుపెట్టడం ఎంత అమర్యాదో వారికి తెలియజెప్పాలి.
చిన్నపిల్లలు అందరి మధ్య ఓ ఆకర్షణగా వుండాలని గట్టిగా అరుస్తుంటారు. పెద్దలు మాట్లాడుకుంటున్నపుడు అదేపనిగా మధ్యలో ఆటంకం కల్పిస్తుంటారు. వారికి కావాల్సినదేంటో అడిగి సమాధానమివ్వడం అన్ని విధాలా ఉత్తమం. లేనిపక్షంలో చికాకు కలిగిస్తారు. నోట్లో పెట్టుకుని టక్కున మింగేయకుండా చక్కగా నమిలి మింగే అలవాటు చేయాలి. ఒకసారి వివరించాక పరిశీలిస్తూ నెమ్మదిగా అర్థమయ్యేలా తెలియజెప్పాలి. అంతే తప్ప పదే పదే ఉపదేశాలు, సలహాలు ఇస్తూ పోకూడదు.
నలిమిన ప్రతిసారీ నోరు బాగా తెరిచి కాక, నోటిని మూసి ఏ విధంగా నమలాలో వారు ప్రాక్టీసు చేయాలి. నోరు తెరిచి చప్పుడు చేస్తూ నమలడం సరైన పద్ధతి కాదనే విషయం వారు గ్రహించేలా చేయాలి. బుగ్గల నిండా ఆహారం కుక్కుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో వారికి సోదాహరణాత్మకంగా చూపాలి. హడావుడి లేకుండా కొద్ది కొద్దిగా గబగబా నమిలేస్తూ తినడాన్ని వారికి నేర్పాలి. ఇలా చేయడం సౌకర్యమే కాకుండా ఆరోగ్యకరమైన విధానమని కూడా వారికి వివరించాలి.
ఒకేసారి ప్లేటంతా పదార్థాలు నింపేసి వారికి తినడానికి ఇబ్బంది కలిగించడం లేదా వారికి ఏది తినాలో తెలియక తికమకపడటం వంటివి లేకుండా, ఏవి ఇష్టమో వాటినే ముందుగా వారికి వడ్డించాలి. అవి పూర్తయ్యక మరో రకానికి వెళ్లాలి. ఒక రకం నుంచి మరో రకం పదార్థానికి సిద్ధమయ్యే సమయంలో ఇంకా పెట్టమని అడగడంలో ప్లీజ్, థ్యాంక్యూ లాంటి పదాలు ఉపయోగించడం వారికి నేర్పించాలి.
తల్లిదండ్రులు టేబుల్ మందు ఎంత హుందాగా వ్యవహరిస్తే పిల్లలకు అదే అలవాటవుతుంది. ఎందుకంటే.. అక్కడ వారు గురువులు కాబట్టి!

- పి.ఎం. సుందరరావు