సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయం
ప్రతి మానవుడు దైవస్వరూపుడే. అందరి యందునా వున్నది హృదయం ఒక్కటే. హృదయం అంటే హృత్+దయః. అదే పవిత్రమైన దయ. ఇంగ్లీషులో కూడా మానవులందరిని మ్యాన్‌కైండ్ అంటుంటారు. కైండ్‌నెస్‌తో కూడిన వాడే మ్యాన్. అనగా దయగలవాడే మనిషి అని అర్థం. అయితే ఈనాడు మానవుని యందు కైండ్‌నెస్ లేదు. కనుక వీనిని ఇప్పుడు మ్యాన్‌కైండ్ అనకూడదు. ఈ విధమైన అంతరార్థములతో మానవత్వమును మనవాళ్ళు పెంచుకుంటూ వచ్చారు.
శీలమే చిరంజీవి
మానవ జీవితానికి నడవడిక ప్రధానం. నడవడికకు గుణం ప్రధానం. గుణమే బలం.
ఈ లోకంలో ధనవంతులు, బలవంతులు, విద్యావంతులు, సౌందర్యవంతులు ఎందరో వున్నారు. అయినా ధనం, బలం, సౌందర్యం, విద్య లేకపోయినా గుణవంతుడే అధికంగా ప్రకాశిస్తాడు. మరణించిన తర్వాత ధనం ఉండదు. బలం ఉండదు. విద్య ఉండదు. సౌందర్యం ఉండదు. కాని మంచి గుణంవల్ల కలిగిన కీర్తి నిలిచే ఉంటుంది.
స్నేహరీతి
మన స్నేహాన్నిబట్టియే మంచిచెడ్డలు కల్గుతున్నాయి. భూమిపైన ఉండే దుమ్ము గాలితో కలిస్తే పైకి ఎగిరిపోతున్నది. నీటితో స్నేహం చేస్తే గుంతలోనికి దిగిపోతున్నది. పైకి ఎగరటానికి దానికి రెక్కలున్నాయా? క్రిందకు దిగటానికి దానికి కాళ్ళున్నాయా? దానికి రెండూ లేవు. అది తానుచేసే స్నేహంయొక్క ప్రభావంవల్లనే ఆయా పనులు చేయగలుగుతోంది.
బ్రహ్మక్షేత్రం
క్షేత్రం అంటే ఏమిటి? నీ హృదయక్షేత్రం. సత్వ గుణంతో వైరాగ్యంలో దానిని ధర్మక్షేత్రంగా మార్చు. అప్పుడు దివ్య కృషీవలుడు ఆ క్షేత్రాన్ని సాగుచేస్తూ వుంటాడు. మనిషి ముక్తుడౌతాడు. హృదయ క్షేత్రం ధర్మక్షేత్రమేకాదు బ్రహ్మక్షేత్రవౌతుంది. జీవన్ముక్తుల చరిత్ర అదే!
నిస్సంగ యోగం
నమే అస్తి కర్తవ్యం...
బ్రహ్మం సంపూర్ణమైనది. దానికి కోరికలు లేవు. అవసరాలంతకన్నా లేవు. చేయాల్సింది లేదు. సాధించాల్సిందీ లేదు.
అందుకే గీతలో కృష్ణుడు అర్జునునితో యిలా చెప్పాడు.
‘నమే పార్థ! అస్తి కర్తవ్యం
త్రిషు లోకేషు కించన...’
‘‘ఈ మూడు లోకాల్లోనూ నేను చేయవలసిందేమీ లేదు’’- ఈ సృష్టి అంతా ఆయన లీల. కార్యకారణ సంబంధంవల్ల కలుగుతోంది. ఆయన ఫలాన్ని అనుగ్రహిస్తాడు కాని కర్మలచే కట్టుబడడు.
సాయిక్కూడా అంతే! ఏ సంగమూ లేదు.
అంతా నిమిత్తమాత్రులమే
కాలాన్ని వృధాచేయకూడదు. మీకూ చేతనయిన పద్ధతిలో ప్రయోజనకరంగా కాలాన్ని వినియోగించాలి. అది మీ విధి; మీ బాధ్యత. అదే భగవత్సేవ. బద్ధకస్థులు చురుకుగా పనిచేయటానికి సంకోచిస్తారు. అలసిపోతామని వారి భయం. కొంతమందికి ఏ పనిచేయాలన్నా చేయగలమో లేదోనని సంకోచం. ఆవేశపూరితులు ఏదోవొకటి చేసి అప్పటికప్పుడు ఏదో సాధించాలని ఆతురత చూపుతారు. కాని ఆశాభంగం తప్పదు. సమబుద్ధితో ఆలోచించేవారు కార్యతత్పరత తమ ధర్మంగా భావించి కర్మ చేస్తారు. గెలుపుకు పొంగరు; ఓటమికి క్రుంగరు. ఏ పనిచేసినా వారి దృష్టిలో అది భగవత్కార్యమే. ఫలితాన్నికూడా వారు దేవునికే వదిలేస్తారు. తాము కేవలం నిమిత్తమాత్రులమని గ్రహిస్తారు.
సేవించి, తరించు!
అన్ని సంగాలనూ వదిలేయాలనేది సుదీర్ఘసాధనలో ముఖ్యమైన మెట్టు అని అవతారాలన్నీ ఘోషిస్తునే వున్నాయి. త్రేతాయుగంలో రుూ మాటే యోగ వాసిష్ఠం చెప్పింది. ద్వాపరంలో విషయ వాసనలను వదలమని కృష్ణుడర్జునునికి బోధించాడు.
అంతా ‘కృష్ణా! కృష్ణా!’అంటారు కాని తృష్ణను వదలరు. లౌకికమైన సంపదలకోసం, కీర్తిప్రతిష్ఠలకోసం పాకులాటే ‘తృష్ణ’. ప్రతి యుగంలోనూ శిష్టరక్షణకు భగవంతుడు అవతరిస్తూనే వున్నాడు. ఇప్పుడు మహాశక్తి, మాయాశక్తి, యోగశక్తి అన్నీ కలిసి మానవ రూపం ధరించి వచ్చాయి. సమీపించి, సేవించి, తరించండి! ఆనందాన్ని అందుకోండి!
ఆనంద స్వరూపి
మీకేం మీరు సాయి హాయిగా మందిరంలో పవ్వళిస్తున్నాడనుకుంటారు. నేను హాయిగా వుండేదెప్పుడు? మీతో నేనున్నప్పుడే నాకు హాయి. అందుకే నేను ‘నా జీవితమే నా సందేశం’అంటుంటాను. నేను ఎల్లప్పుడూ ఏదోవొక పనిలోనే వుంటాను. అయితే దేనితోనూ నాకు సంగం లేదు. విడిపోవాల్సిన అవసరమూ లేదు. నేనెప్పుడూ పరిపూర్ణ ఆనంద స్వరూపినే.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.