సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే నీకు అండ
‘జీవితకాలం’అంటుంటారు. అంటే ఏమిటి? ఎండమావులను వెదుక్కోటమా జీవితం? అనంతతత్వంలో లయ కావటమా? నీకు చెవికింపుగా వుండే మాటలు చెప్పేవాళ్లు లక్షలాది మంది వున్నారు. కాని నీకేది మంచిదో ఆ సంగతి చెప్పేవాళ్లు లక్షకొకడన్నా దొరుకుతాడా? నీకేది మంచిదో అదే సత్యం. నిజం నిష్ఠూరంగావున్నా అదే మంచిది. ఏది ఏమైనాసరే, సత్యానికి కట్టుబడి వుండు -అని ఎవరికి చెప్పినా వారికి అదంతగా రుచించదు. కాని సత్యమే చివరకు ప్రయోజనం కల్గిస్తుంది.
అంతా బ్రహ్మమే
నీకు ఐహిక విషయాలపై ఆకస్తి, అనుబంధం పెరిగినకొద్దీ బాధ, విచారం పెరుగుతాయి. అంతర్దృష్టితో ప్రకృతిని తిలకించు. క్రమంగా సంగం సడలిపోతుంది. కర్మ చేస్తూనే వుంటావుగాని ఫలాసక్తిపోతుంది. అప్పుడు నీకు అన్నీ మరింత స్పష్టంగా, యదార్థంగా, పరమాత్మ స్వరూపంగా గోచరిస్తుంటాయి. కన్నులు మూసికో. అంతఃచక్షువులను తెరచిచూడు. అంతా బ్రహ్మమే అన్న అద్భుతమైన అవగాహన సాక్షాత్కరిస్తుంది. ఐహిక విషయాల పట్ల నీ ఆసక్తికి పరిమితులుంటాయి. కాని పరమాత్మ పట్ల పెంచుకొనే అనుబంధానికి హద్దులుండవు. ఆ సత్యాన్ని అవలోకించు. అంతటా ఆయననే దర్శించు. ఆనందించు.
అదే సత్యం
ఉదయం లేచినప్పటినుండి, పడుకొనేదాకా చేసే పనులన్నీ జ్ఞానయజ్ఞంలో ఆర్పించే సమిధలే. అందులో కొన్ని అప్పటికప్పుడు ఎలా అనిపిస్తే అలాచేసే పనులు. అవి బుద్ధితో ఆలోచించి చేసేవికావు. బుద్ధిని దాటి అవతలి తీరాన్ని అంతఃకరణ చేరుకొన్నప్పుడు చేసేవి పవిత్రకార్యాలు. ఆ స్థితిలో సుషుప్తిలోవలె ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ మరుగున పడతాయి. విశ్వమంతా మన చేతననుండి తొలగిపోతుంది. అదే సత్యం. అదే ఆత్మ. అక్కడ బంధాలన్నీ తెగిపోతాయి.
నన్ను నీ సారథిగా పెట్టుకో
నీ మనసులో చౌకబారు కోరికలను తలెత్తనీయకు. తాత్కాలికమైన సుఖాలకై అర్రులు చాచకు. సంగాలను క్రమం గా తెంచుకొనే ప్రయత్నం చేయి. నీ ఆత్మను అనంతాత్మతో అనుసంధానం చేసేందుకు తపించు. నీ ప్రయత్నాలకు అడ్డుతగిలే శత్రువులు నీలోనే వున్నారు. వాళ్ల భరతం పట్టు. నన్ను నీ సారథిగా పెట్టుకో. నిన్ను ముక్తిదిశగా నడిపిస్తాను.
శ్రద్ధ, నిరాడంబరత్వం, సాధన-వీటి ద్వారానే నీకు నా అనుగ్రహం లభిస్తుంది.
అసలు తత్వం
ఈనాడు భక్తి, భక్తి.. భక్తి...అని అంటున్నారు. ఏమిటి ఈ భక్తి? కేవలం రాగ, తాళ, శ్రుతులతో కూడినటువంటి భజనాశక్తి? యోగము... యోగము... అంటే ఏమిటి యోగము? ముక్కు మూసుకొని మూల కూర్చోటమా యోగము? జ్ఞానమంటే ఏమిటి? అనేక గ్రంథములు చదివి ఏదోదానిలో ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని కంఠస్తం చేసుకొని వల్లించటమా జ్ఞానము? సన్యాసమంటే ఏమిటి? కాషాయవస్తమ్రు ధరించుట మాత్రమే సన్యాసమా! కాదు...కాదు... ‘్భక్తి’అనగా రాగద్వేష అసూయాదులకు అతీతమైనటువంటి యొక్క ప్రేమతత్త్వమే నిజమైన భక్తి. భక్తి...్భక్తి... అని ఏ మానవుడు అహంకారముతో విర్రవీగుతున్నాడో, అసూయతో జీవిస్తున్నాడో, ఆడంబరముతో బ్రతుకుతున్నాడో, వాడు భక్తుడే కాదు. ఇలాంటి వాని సమీపానికి కూడనూ ఈ భక్తి ప్రవేశించదు. ఈ మూడింటికీ అతీతమైన స్థితికి తానువెళ్లి ప్రశాంతమైనటువంటి ఆనందంతో ప్రేమించాలి భగవంతుణ్ణి. ఇంక యోగమంటే ఏమిటి? ఏదో హఠయోగమని, క్రియా యోగమని ఏమేమో కొత్త పేర్లుపెట్టుకొంటున్నారు. అదికాదు యోగము. ‘యోగః చిత్తవృత్తి నిరోధః’ ఇంద్రియ నిగ్రహమే నిజమైన యోగము. ఏ విధమైనటువంటి ఉద్వేగానికి, ఉద్రేకానికి గాని అవకాశము నందించకూడదు. ఇతరులు మనలను పొగిడినా తెగిడినా కూడనూ మనము ఏమాత్రమూ పొంగక, క్రుంగక ఉంటుండాలి. ఇట్టి ఇంద్రియ నిగ్రహమే నిజమైన యోగము. ఇంక జ్ఞానమనగా ఏమిటి? ‘అద్వైత దర్శనం జ్ఞానం’నా ఆత్మయే సర్వభూతముల యందు కూడానూ ప్రతిబింబిస్తున్నదనేటటువంటి ఏకాత్మభావమే నిజమైన జ్ఞానము. ఇక సన్యాసమంటే ఏమిటి? కేవలము గుణము మారాలి కానీ గుడ్డలుమారితే ప్రయోజనం లేదు. మనస్సు మారాలి కాని, మనిషి మారితే ప్రయోజనం లేదు. తలపులు బోడి కావాలి తలలు బోడి అయితే ప్రయోజనం లేదు. సర్వేంద్రియాలను అరికట్టి, సర్వసంగ పరిత్యాగి అయినటువంటివాడే సన్యాసి.
ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.